
అదృశ్యమైన పింకి
సాక్షి, హైదరాబాద్: తన భర్త మందలించాడని ఓ మహిళ ఇంట్లో నుంచి వెళ్లపోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితు ల వివరాల ప్రకారం.. రింగ్ బస్తీకి చెందిన మనీష్‌గౌడ్(34), పింకి(30)లకు 2012లో వివా హం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు దేవ్, దీప్‌లు ఉన్నారు. కాగా వీరి ఇంటి ప్రక్కనే ఉండే ఓ వ్యక్తి పింకితో చనువుగా ఉండడంతో మనీష్ పలుమార్లు హెచ్చరించాడు.
దీంతో ఈ నెల 19న పింకి తన పిల్లలతో ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. మొబైల్ ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె జాడ కోసం బందువుల ఇంట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. పక్కింట్లో ఉన్న వ్యక్తి కూడా ఆదే రోజు నుంచి కనిపించకపోవడంతో అతడి మీదే అనుమానం ఉందని మనీష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఇక్కడకే రావాలా.. గాంధీ, ఉస్మానియాకి పోవచ్చుగా..
Comments
Please login to add a commentAdd a comment