jagathgirigutta
-
పక్కింటి వ్యక్తితో పింకి చనువు.. ఇద్దరు పిల్లలతో కలిసి
సాక్షి, హైదరాబాద్: తన భర్త మందలించాడని ఓ మహిళ ఇంట్లో నుంచి వెళ్లపోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితు ల వివరాల ప్రకారం.. రింగ్ బస్తీకి చెందిన మనీష్‌గౌడ్(34), పింకి(30)లకు 2012లో వివా హం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు దేవ్, దీప్‌లు ఉన్నారు. కాగా వీరి ఇంటి ప్రక్కనే ఉండే ఓ వ్యక్తి పింకితో చనువుగా ఉండడంతో మనీష్ పలుమార్లు హెచ్చరించాడు. దీంతో ఈ నెల 19న పింకి తన పిల్లలతో ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. మొబైల్ ఫోన్ సైతం స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె జాడ కోసం బందువుల ఇంట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. పక్కింట్లో ఉన్న వ్యక్తి కూడా ఆదే రోజు నుంచి కనిపించకపోవడంతో అతడి మీదే అనుమానం ఉందని మనీష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఇక్కడకే రావాలా.. గాంధీ, ఉస్మానియాకి పోవచ్చుగా.. -
భర్తను రెడ్ హ్యాండెడ్ పట్టుకొని.. ఏమైందో తెలుసా!
సాక్షి, హైదరాబాద్: మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్తను ఓ భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. మరో మహిళతో గుట్టుగా వివాహేతరం సంబంధం నడిపిస్తున్న భర్తను సదురు మహిళ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. జగద్గిరిగుట్టకు చెందిన అనిల్ అనే వ్యక్తి మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని కుత్బుల్లాపూర్ బ్యాంక్ కాలనీలో నివాసిస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి అనుమానం వచ్చిన భార్య రమేశ్వరి తన భర్త పట్టుకొని పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తామని తెలిపారు. -
పెద్దనాన్న అఘాయిత్యం, గర్భం దాల్చిన బాలిక
సాక్షి, జగద్గిరిగుట్ట: వరుసకు పెద్దనాన్న.. తన కూతురు వయస్సున్న ఆ బాలిక(13)పై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కూన మహాలక్ష్మినగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు.. బాధితుల కథనం ప్రకారం... గతేడాది అక్టోబర్ 20న ఆ బాలిక టీవీ చూసేందుకు అదే వీధిలో ఉంటున్న పెదనాన్న ఇంటికి వెళ్లింది, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. దీంతో వావి వరసలు మరిచిన పెదనాన్న తన మరదలి కూతురు నోట్లో టవల్ కుక్కి లైంగిక దాడికి పాల్పడ్డాడడు. ఆ తరువాత కూడా పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారిని చంపేస్తానని బెదిరించాడు. రోజులు గడుస్తున్న కొద్ది ఆ బాలికలో మార్పు కనిపించింది. ఈ నెల 24న తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులకు బాలిక ఆరు నెలల గర్భవతి అని డాక్టర్ చెప్పిన విషయం తీవ్ర దిగ్భాంతికి గురిచేసింది. బాలిక తల్లిదండ్రులు లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించగా తనకేమీ తెలియదని బుకాయించాడు. దీనితో తమకు న్యాయం చేయాలని ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడి ఆరోగ్యం బాగా లేనందును అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా నిందితుడి కుటుంబ సభ్యుడు మరో నలుగురితో ఈ కేసు ఉపసంహరించుకోవాల ని బాధితుల ఇంటిపై దాడి చేశారు. బాలికకు అబార్షన్ చేయించేందుకు కొందరు బస్తీ పెద్దలు రూ. 30 వేలు ఇప్పిస్తామని ఆశచూపినట్లు సమాచారం. వీరికి ఓ ఎస్ఐ సహకరిస్తున్నట్లు తెలిసింది. చదవండి: అనుమానంతో ఓ వ్యక్తిపై 10 మంది దాడి..మృతి -
జగద్గిరిగుట్ట: మైనర్ బాలికపై అత్యాచారం
-
కసాయి తండ్రి పైశాచికం
-
కుమార్తె కోసం హెచ్చార్సీని ఆశ్రయించిన తల్లిదండ్రులు
-
'కుమార్తెను చంపుకునేందుకు అనుమతించండి'
హైదరాబాద్: తమ కుమార్తెను చంపుకునేందుకు అనుమతించాలని రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన దంపతులు గురువారం హెచ్చార్సీని ఆశ్రయించారు. జగద్గిరిగుట్టకు చెందిన రామచంద్రారెడ్డి, శ్యామల దంపతుల కుమార్తె హర్షిత (11) గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతోంది. లివర్ మార్పిడికి రూ.25 లక్షలు అవసరమవుతాయని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం కావటంతో అంత మొత్తం నగదు సమకూర్చుకోలేమని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కుమార్తెకు మెర్సీ కిల్లింగ్ అంతిమ పరిష్కారమని ఆ తల్లిదండ్రులు నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు వారు హెచ్చార్సీని ఆశ్రయించి.. తమ చిన్నారి వేదనను చూడలేకున్నామని తెలిపారు. అందువల్ల మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలని కోరారు.