హైదరాబాద్: తమ కుమార్తెను చంపుకునేందుకు అనుమతించాలని రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన దంపతులు గురువారం హెచ్చార్సీని ఆశ్రయించారు. జగద్గిరిగుట్టకు చెందిన రామచంద్రారెడ్డి, శ్యామల దంపతుల కుమార్తె హర్షిత (11) గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతోంది. లివర్ మార్పిడికి రూ.25 లక్షలు అవసరమవుతాయని వైద్యులు తెలిపారు.
నిరుపేద కుటుంబం కావటంతో అంత మొత్తం నగదు సమకూర్చుకోలేమని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కుమార్తెకు మెర్సీ కిల్లింగ్ అంతిమ పరిష్కారమని ఆ తల్లిదండ్రులు నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు వారు హెచ్చార్సీని ఆశ్రయించి.. తమ చిన్నారి వేదనను చూడలేకున్నామని తెలిపారు. అందువల్ల మెర్సీ కిల్లింగ్కు అనుమతించాలని కోరారు.