Hyderabad: Woman Goes Missing After Fight With Husband - Sakshi
Sakshi News home page

Hyderabad: భర్తతో గొడవపడి.. భార్య అదృశ్యం

Published Fri, Jan 6 2023 2:21 PM | Last Updated on Sat, Jan 7 2023 12:19 PM

Hyderabad Woman Goes Missing After Fight With Husband - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భర్తతో గొడవపడి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన గురువారం హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... హయత్‌నగర్‌ డివిజన్‌ సూర్యానగర్‌లో నివసించే మహీంద్రారెడ్డి ప్రైవేటు ఉద్యోగి. ఆయన భార్య శిరీష(25) బుధవారం రాత్రి గుర్తు తెలియని వారితో ఫోన్‌లో చాటింగ్‌ చేస్తుంది.

ఈ విషయమై భర్త ప్రశ్నించడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శిరీషపై భర్త చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త మహీంద్రారెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చదవండి: వీబీఐటీ కేసు: వల వేసి.. సవాల్‌ విసిరి.. పోలీసులకు చిక్కాడు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement