గంగలాపురం (కణేకల్లు) : తన కుమార్తె కొంతకాలంగా కన్పించడం లేదని కణేకల్లు మండలం గంగలాపురానికి చెందిన మల్లయ్య ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ యువరాజు సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లయ్య కుమార్తె మహాదేవి(24) అనంతపురంలోని మైత్రి ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తోంది. అక్కడే ఉన్న వాసవి హాస్టల్‌లో ఉంటూ విధులు నిర్వర్తించేది. నెలకోసారి ఇంటికి వచ్చి వెళ్లేది.
ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 28న ఇంటికెళ్లింది. మరుసటి రోజు డ్యూటీకి వెళతానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిపోయింది. తిరిగి ఎన్ని రోజులైనా కుమార్తె రాకపోవడంతో మల్లయ్య తన కుమార్తెకు ఫోన్ చేశాడు. అది పనిచేయకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి ఆరా తీశాడు. అయితే మహాదేవి డ్యూటీకి రాలేదని వారు చెప్పడంతో ఆమె ఆచూకీ కోసం బంధువుల ఇళ్లలో గాలించాడు. అయినా లభ్యం కాకపోవడంతో సోమవారం కణేకల్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
యువతి అదృశ్యం
Published Mon, Jun 12 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM
Advertisement
Advertisement