ఎయిర్‌పోర్ట్‌లో మహిళ మిస్సింగ్‌ | Woman Missing in Shamshabad Airport | Sakshi
Sakshi News home page

Jun 8 2018 7:10 AM | Updated on Sep 4 2018 5:48 PM

Woman Missing in Shamshabad Airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో యార్లగడ్డ సాయిప్రసన్న అనే ప్రయాణికురాలు అదృశ్యమైంది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహిళ మిస్సింగ్‌ కేసు నగరంలో సంచలనం సృష్టిస్తోంది. వివరాలివి.. సాయిప్రసన్నను తన భర్త జైపూర్లో విమానం​ ఎక్కించారు. ఆమె హైదరాబాద్‌కు చేరుకుంది. సాయిప్రసన్న కోసం తండ్రి, తమ్ముడు ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూస్తున్నారు.

వారికి తెలియకుండానే క్యాబ్‌ మాట్లాడుకుని సాయిప్రసన్న ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరింది. క్యాబ్‌ ఎక్కిన తర్వాత తమ్ముడికి ఫోన్‌ చేసి మాట్లాడింది. దీంతో తమ్ముడు వెంటనే క్యాబ్‌ దిగాల్సిందిగా ఆమెకు చెప్పాడు. అనంతరం సాయిప్రసన్న ఫోన్‌ స్విఛ్చాప్‌ రావడంతో తండ్రి, తమ్ముడు ఆందోళన చెందారు.

సాయిప్రసన్న తండ్రి విషయాన్ని వెంటనే భర్తకు చెప్పాడు. ఖమ్మంకి చెందిన మోహన్‌ రావు అనే వ్యక్తిపై సాయిప్రసన్న భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఆయన వెంటనే తన కూతరు మిస్సైందని ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఎయిర్‌పోర్ట్‌లోని సీసీ టీవీ ఫుటేజీలే కీలకమని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement