RGIA Police
-
పైపుల్లో 14 కేజీల పసిడి
శంషాబాద్: పైపుల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డీఆర్ఐ అధికారులు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. దుబాయ్ నుంచి వస్తున్న ఎయిరిండియా విమానం ఏఐ–952 గురువారం తెల్లవారుజామున 5.30కి శంషాబాద్ విమానాశ్రయం లో దిగింది. బంగారం అక్రమ రవాణా గురించి విశ్వసనీయ సమాచారం రావడంతో అప్రమత్తమైన అధికారులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు తాము కూర్చున్న 31ఏ, 32ఏ సీట్ల కింద బంగారాన్ని తెచ్చినట్లు గుర్తించారు. నల్లని టేపుతో చుట్టిన బంగారాన్ని 14 హాలో పైపుల్లో దాచినట్లు అధికారులు తెలిపారు. పైపుల నుంచి 112 బంగారు బిస్కెట్ ముక్కలను బయటకు తీశారు. మొత్తం 14 కేజీల బరువు కలిగిన ఈ బంగారం విలువ రూ.5.46 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న వారిలో ఒకరు దక్షిణ కొరియాకు చెందిన వ్యక్తి కాగా మరొకరు చైనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇంత భారీ మొత్తంలో వీరితో బంగారాన్ని అక్రమంగా రవాణా చేయించింది ఎవరనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా, ఐదేళ్ల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురి నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు 27 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం 9 కేజీల బంగారాన్ని మరో వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఇద్దరు వ్యక్తుల నుంచి బంగారం స్వాధీనం చేసుకోవడం చర్చనీయాశమైంది. -
శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం
-
ఎయిర్‌పోర్ట్‌లో మహిళ మిస్సింగ్
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో యార్లగడ్డ సాయిప్రసన్న అనే ప్రయాణికురాలు అదృశ్యమైంది. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహిళ మిస్సింగ్ కేసు నగరంలో సంచలనం సృష్టిస్తోంది. వివరాలివి.. సాయిప్రసన్నను తన భర్త జైపూర్‌లో విమానం ఎక్కించారు. ఆమె హైదరాబాద్‌కు చేరుకుంది. సాయిప్రసన్న కోసం తండ్రి, తమ్ముడు ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూస్తున్నారు. వారికి తెలియకుండానే క్యాబ్ మాట్లాడుకుని సాయిప్రసన్న ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. క్యాబ్ ఎక్కిన తర్వాత తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడింది. దీంతో తమ్ముడు వెంటనే క్యాబ్ దిగాల్సిందిగా ఆమెకు చెప్పాడు. అనంతరం సాయిప్రసన్న ఫోన్ స్విఛ్చాప్ రావడంతో తండ్రి, తమ్ముడు ఆందోళన చెందారు. సాయిప్రసన్న తండ్రి విషయాన్ని వెంటనే భర్తకు చెప్పాడు. ఖమ్మంకి చెందిన మోహన్ రావు అనే వ్యక్తిపై సాయిప్రసన్న భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఆయన వెంటనే తన కూతరు మిస్సైందని ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఆర్జీఐఏ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఎయిర్‌పోర్ట్‌లోని సీసీ టీవీ ఫుటేజీలే కీలకమని పోలీసులు భావిస్తున్నారు. -
విమానంలో యువతిపట్ల అసభ్య ప్రవర్తన
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ విమానంలో ఇద్దరు యువకులు ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో ఓ యువతితో హర్యానాకు చెందిన జగదీష్‌సింగ్, సర్వేందర్ అనే యువకులు అసభ్యంగా ప్రవర్తించినట్లు సదరు యువతి ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్టులోకి అనుమతిలేని ట్యాక్సీడ్రైవర్లు
అదుపులోకి తీసుకున్న పోలీసులు! శంషాబాద్: నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా విమానాశ్రయంలోని అరైవల్ ప్రాంగణంలోకి వెళ్లిన మూడు ట్యాక్సీ కార్లతోపాటు వాటి డ్రైవర్లను ఆర్జీఐఏ పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేని ట్యాక్సీలు అరైవల్ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాయనే సమాచారం మేరకు పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని స్పష్టం చేశారు.