
సాక్షి, హైదరాబాద్ : కుత్బుల్లాపూర్‌లో సంచలనం సృష్టించిన గాయత్రి (19) మిస్సింగ్‌లో కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఇంట్లో చూసిన పెళ్లి సంబంధం నచ్చకపోవడంతోనే ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ మేరకు తన కోసం వెతకొద్దంటూ లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా, ప్రేమ వ్యవహారమే కారణమని కుటుంబ సభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు.
దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్‌కు చెందిన గాయత్రి(19) బుధవారం తను పనిచేసే సూపర్ మార్కెట్‌కు వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల మొత్తం వెలికారు. ఎక్కడా యువతి ఆచూకి లభించకపోవడంతో గురువారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో తనిఖీ చేయగా ఆమె రాసిన లేఖ లభించింది. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ కాల్ డాటా ఆధారంగా గాయత్రి ఆచూకి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment