
పిల్లలతో స్వప్న
సాక్షి, హైదరాబాద్ : తన ఇద్దరు పిల్లలతో సహా ఓ గృహిణి అదృశ్యమైంది. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా ఇమ్మిగనూరు మండలం నాగాలదిన్నెకు చెందిన కీరసాకరే రామకృష్ణ బతుకుదెరువు కోసం వచ్చి లేబర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబంతో కలిసి పెద్దంబర్‌పేట్‌లోని శాంతినగర్‌లో అద్దె కుంటున్నాడు. భార్య స్వప్న (32) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తుంది. వారికి కూతురు లావణ్య (14), కొడుకు ప్రవీణ్ (12) ఉన్నారు.
జులై 27న పనికి వెళుతున్నానని పిల్లలతో కలిసి బయటికి వెళ్లిన స్వప్న తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్క తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, స్వప్న రెండు నెలల క్రితం రాము అనే వ్యక్తితో కలిసి బయటికి వెళ్లిందని ప్రస్తుతం అతనిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: Independence Day: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్
Comments
Please login to add a commentAdd a comment