మా కూతురిని వెతికిపెట్టండి | - | Sakshi
Sakshi News home page

మా కూతురిని వెతికిపెట్టండి

Published Sun, Jun 16 2024 2:04 AM | Last Updated on Sun, Jun 16 2024 1:59 PM

మా కూతురిని వెతికిపెట్టండి

మా కూతురిని వెతికిపెట్టండి

 బాలిక తల్లిదండ్రుల వేడుకోలు 

గోనెగండ్ల: తమ కూతురు కనిపించకుండా పోయి 56 రోజులైనా జాడ లేదని, దయచేసి వెతికిపెట్టాలని మండల కేంద్రానికి చెందిన రూపేంద్రరెడ్డి, రామేశ్వరమ్మ దంపతులు పోలీసులను వేడుకున్నారు. ఏప్రిల్‌ 21న కూతురు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఆచూకీ కనిపెట్టకపోవడంతో దంపతులు శనివారం స్టేషన్‌ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివే తమ కూతురిని బేతంచర్ల మండలం శంకలాపురం గ్రామానికి చెందిన మధు అనే యువకుడు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లినట్లు తెలిసిందన్నారు. 

ఇదే విషయాన్ని ఏప్రిల్‌ 21న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసుకుని, పోలీసులు చేతులు దులిపేసుకున్నారన్నారు. ఇప్పటికై నా పోలీసులు తమ కూతురి జాడ కనిపెట్టి, తమకు దక్కేలా చేయాలని, లేనియెడలా తమకు ఆత్మహత్యే శరణ్యమని వారు తెలిపారు. ఇదే విషయమై సీఐ రామకృష్ణయ్యను ఆరా తీయగా బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామన్నారు. బా లిక, నిందితుడి సెల్‌ఫోన్లు కూడా ట్రెస్‌ కావడం లేదన్నారు.అయినా త్వరలోనే కేసును ఛేదిస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement