![Hyderabad: Married woman goes missing in Pahadi Shareef](/styles/webp/s3/article_images/2025/01/12/1145.jpg.webp?itok=wp54rJfu)
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ గురువారెడ్డి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరాం కాలనీకి చెందిన సంపంగి గణేష్ ఏడాది క్రితం శిరీష(21) అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.
అప్పటి నుంచి శిరీష కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడడం లేదు. తాజాగా ఆమె తల్లితో మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 9న తల్లి వద్దకు వెళ్లొస్తానని చెప్పి శిరీష బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయమై గణేష్ అత్తగారింటిలో వాకబు చేయగా, అక్కడికి రాలేదని తెలిపారు. దీంతో పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లోగాని 87126 62367 నంబర్‌లో గాని సమాచారం అందించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment