Pahadi Shareef
-
గృహిణి అదృశ్యంపై కేసు నమోదు
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గురువారెడ్డి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరాం కాలనీకి చెందిన సంపంగి గణేష్ ఏడాది క్రితం శిరీష(21) అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి శిరీష కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడడం లేదు. తాజాగా ఆమె తల్లితో మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 9న తల్లి వద్దకు వెళ్లొస్తానని చెప్పి శిరీష బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయమై గణేష్ అత్తగారింటిలో వాకబు చేయగా, అక్కడికి రాలేదని తెలిపారు. దీంతో పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లోగాని 87126 62367 నంబర్లో గాని సమాచారం అందించాలని తెలిపారు. -
Hyderabad: చంపుతానని బెదిరించి.. భార్యను వ్యభిచారంలోకి దింపి!
సాక్షి, హైదరాబాద్: కడదాక తోడుంటానంటూ కట్టుకున్న భార్యనే వ్యభిచార కూపంలోకి దింపాడో ప్రబుద్ధుడు. ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల ప్రకారం.. చాంద్రాయణగుట్టకు చెందిన సాదిక్ (34) గతంలోనే వివాహం జరగగా..2019లో పహాడీషరీఫ్‌కు చెందిన మహిళ(25)ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. పెళ్లైన నాటి నుంచే సాదిక్ రెండో భార్యను చంపుతానంటూ బెదిరించి బయటికి తీసుకెళ్లి వ్యభిచారం చేయించడం మొదలెట్టాడు. ఇది నచ్చని ఆమె భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఈ ఏడాది మార్చిలో విడాకులు తీసుకుంది. తాజాగా ఈ నెల 2న ఆమె సరూర్‌నగర్ పరిధిలో స్నేహితులతో కలిసి రోడ్డుపై ఉండటాన్ని గమనించిన సాదిక్ కొట్టాడు. దీంతో ఆమె సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అంతటితో ఆగకుండా గురువారం పహాడీషరీఫ్‌లోని అత్తగారింట్లో భార్య లేని సమయంలో అత్తని బెదిరించి కుమారుడిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు బలవంతపు వ్యభిరారం, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. అతని చెర నుంచి క్షేమంగా బాలుడిని విడిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. కాగా సున్నితమైన కేసు కావడంతో వివరాలు మీడియాకు వెల్లడించలేమని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ కె.కిరణ్ కుమార్ తెలిపారు. చదవండి: పిల్లలు కావాలా?.. సక్సెస్ రేటు కోసం సంతాన సాఫల్య కేంద్రాల అడ్డదారులు -
Hyderabad: అజయ్‌తో పరిచయం.. సహజీవనం ముసుగులో చిన్నారుల కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్: మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి ఆమె ఇద్దరు పిల్లలను ఎత్తుకెళ్లిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కె.మధుసూదన్ కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన లీలం యాదవ్ భర్త జితేందర్ యాదవ్ ఏడాది క్రితం మృతి చెందగా ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఏడు నెలల క్రితం బిహార్‌కే చెందిన అజయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేయసాగారు. రెండు నెలల క్రితం వీరు జల్పల్లి శ్రీరాం కాలనీలోకి మకాం మార్చగా.. లీలం యాదవ్ స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో పని చేస్తోంది. ఆదివారం సాయంత్రం ఆమె ఇంట్లో పని చేస్తుండగా ఆమె కుమార్తె ప్రీతి (2.5 సంవత్సరాలు), కుమారుడు రితేష్ (16 నెలలు) ఇంటి ముందు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో తాగిన మైకంలో ఇంటికి వచ్చిన అజయ్ లీలంతో గొడవపడి చేయిచేసుకున్నాడు. అనంతరం ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లిపోయాడు. కొద్ది సేపటి అనంతరం గమనించిన ఆమె స్థానికంగా వెతికినా లాభం లేకపోవడంతో సోమవారం పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి: కుల పంచాయితీలో మహిళపై దాడి.. నిండు ప్రాణం తీసిన వాట్సాప్ ప్రచారం -
భర్తకు అనారోగ్యం.. డ్యూటీకని వెళ్లిన భార్య.. సూపర్వైజర్తో బైక్‌పై..
సాక్షి, పహాడీషరీఫ్ (హైదరాబాద్): డ్యూటీకి వెళ్లిన గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన జగన్నాద్ బెహెరా తన భార్య సుబ్రదాస్ మహాపత్ర (25), కూతురుతో కలిసి జల్పల్లి శ్రీరాంకాలనీకి వలస వచ్చి... స్థానిక ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నారు. గత నెల 31వ తేదీన అనారోగ్యంగా ఉండటంతో జగన్నాద్ ఇంటి వద్దే ఉండగా...అతని భార్య మాత్రం డ్యూటీకి వెళ్లింది. ఎంతకి ఇంటికీ రాకపోవడంతో కంపెనీ వద్ద వాకబు చేయగా.... కంపెనీలో పనిచేసే సూపర్వైజర్ హరి వెంట బైక్‌పై వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై జగన్నాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గాని 94906 17241 నంబర్లో గాని సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. చదవండి: (ఏమైందో? ఏమో?.. చింతచెట్టుకు వేలాడుతూ..) -
విద్యార్థిని అదృశ్యం.. ఆ యువకుడిపైనే అనుమానం
సాక్షి, పహడీషరీఫ్: ఓ యువతి అదృశ్యమైన సంఘటన పహడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ బస్వగూడ తండాకు చెందిన సభావత్ రెడ్యా నాయక్ రెండో కూతురు సభావత్ సబిత(20) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈనెల 27న బాలిక తల్లి పనికి వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా సబిత కనిపించలేదు. కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోయింది. నరేశ్ అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. సబిత ఆచూకీ తెలిసిన వారు 94906 17241 నంబర్లో సమాచారం ఇవ్వాలని కోరారు. చదవండి: (పెళ్లయ్యాక స్వాతితో పీకల్లోతు ప్రేమ.. ట్యూషన్‌కి వెళ్లి..) -
ఆటోలో మహిళపై అత్యాచారయత్నం!
పహాడీషరీఫ్: ఆటో ఎక్కిన ఓ ప్రయాణికురాలిపై డ్రైవర్ మరో వ్యక్తితో కలిసి అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఫలక్‌నుమా వట్టెపల్లికి చెందిన మహిళ(35) కాటేదాన్‌లోని ఓ ఫంక్షన్హాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. సోమవారం రాత్రి ఆమె పనులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. కొద్దిదూరం వెళ్లగానే ఆటోడ్రైవర్ దారి మార్చి జల్పల్లి కార్గో రోడ్డుకు తీసుకొచ్చాడు. ఆటోడ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి కలిసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నం చేశారు. డేసీ దాబా సమీపంలోకి రాగానే ఆమె కేకలు వేయడంతో ఆమెను అక్కడ దింపేసి పరారయ్యారు. మంగళవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఆటోనంబర్ వివరాలు చెప్పలేకపోవడంతో పోలీసులు కార్గో రోడ్డులో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
పోలీసులకు తలనొప్పి.. చచ్చిందెవరో.. చంపిందెవరో!
నగర శివారు ప్రాంతంగా ఉన్న పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ నేరాలకు అడ్డాగా మారుతోంది. తమ శత్రువులను ఎక్కడో హత్య చేస్తున్న నిందితులు అర్ధరాత్రి వేళ మృతదేహాలను తీసుకొచ్చి స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాలలో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. ఉదయాన్నే ఆ మృతదేహాలను చూసి చచ్చిందెవరో.. చంపిందెవరో తేల్చడానికి పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తుంది. – పహాడీషరీఫ్ అధిక శాతం ఉత్తర భారతీయులే.. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశ్చా తదితర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు జీవనోపాధి కోసం నగరానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రస్తుతం వారంతా పహాడీషరీఫ్ ఠాణా పరిసరాలలో నివాసం ఉంటున్నారు. ఇలాంటి వారు హత్యకు గురవుతుండటం.. ఒక్కోసారి వీరే హత్యలు చేసి తమ స్వరాష్ట్రాలకు పారిపోతుండడంతో కేసుల దర్యాప్తు ముందుకు సాగని పరిస్థితి నెలకొంటోంది. వీరితో పాటు పాతబస్తీ నుంచి వచ్చి కూడా ఇక్కడ హత్యలు చేసిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. కాగా పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి నేరాల నివారణకు కృషి చేస్తామని ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రతీత్సింగ్ వెల్లడించారు. చదవండి: పహాడీషరీఫ్: 38 రోజుల్లో నాలుగు హత్యలు, హడలెత్తుతున్న స్థానికులు ► ముఖ్యంగా జల్పల్లి పెద్ద చెరువు పరిసరాలలోనే మృతదేహాలను పడేసేందుకు అనువైన స్థలంగా ఎంచుకుంటున్నారు. కొన్ని సార్లు ఇతర ప్రాంతాలలో హత్య చేసి ఇక్కడ పడేస్తుండగా.. మరికొన్ని సార్లు ఇక్కడ మద్యం పారీ్టలు చేసుకుంటూ పథకంలో భాగంగా హతమారుస్తున్నారు. ► ఇక్కడ జరుగుతున్న హత్యలను చూస్తున్న స్టేషన్ పరిధి ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి పూట గస్తీని ముమ్మరం చేయాలని కోరుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల హత్యలు నమోదైనప్పుడు వివరాలు తెలియని మృతుల కుటంబీకులు తమ వారు ఇలా దారుణ హత్యకు గురయ్యారన్న విషయాలు కూడా తెలియని పరిస్థితి నెలకొంటోంది. చదవండి: స్నేహితురాలి వద్దకు వెళుతున్నానని... ఎటూ తేలని హత్య కేసులు.. మచ్చుకు కొన్ని. ► మామిడిపల్లిలోని ఎస్ఎస్పీడీఎల్ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్న గెస్ట్‌హౌజ్‌లో 2016 జూన్ 25వ తేదీనా ఉత్తరప్రదేశ్‌కు చెందిన రమాకాంత్ పాండే (40) దారుణంగా హత్యకు గురయ్యాడు. వెంచర్లోకి తాను తీసుకొచ్చిన ఓ యువతీ, యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావించినప్పటికీ వారు ఇంకా దొరకలేదు. వీరి ఆచూకీ కోసం పోలీసులు బీహార్ వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ► అదే విధంగా 2016 ఆగస్టు 13వ తేదీనా పహాడీషరీఫ్ – మామిడిపల్లి రహదారి పక్కన ఉన్న ఓ ప్రైవేట్ సంస్థ ఆవరణలో 25 ఏళ్ల గుర్తుతెలియని యువకుడిపై పెట్రోల్ పోసి తగులబెట్టి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ కేసులో మృతుడు ఎవరో కూడా ఇంకా తేలలేదు. ► 2020 ఏప్రిల్ నెలలో ఇదే సంస్థ ప్రాంగణంలో గుర్తు తెలియని మహిళ అస్థిపంజరం లభ్యమయ్యింది. ఈ కేసులోనూ ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ► 2014 నవంబర్ 15వ తేదీనా ఎర్రకుంట అలీ నగర్లో హత్యకు గురైన యువతి వివరాలు కూడా ఇంకా తెలియరాలేదు. నెల వ్యవధిలో నాలుగు హత్యలు.. ► 2021 ఆగస్టు 3వ తేదీనా జల్పల్లి కార్గో రోడ్డు పక్కన గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నెల రోజుల కావస్తున్నా మృతుడు ఎవరో... హత్య చేసిందెవరో కూడా తెలియరాలేదు. ► ఆగస్టు 24వ తేదీనా ఇమాంగూడ సమీపంలో జంగయ్య అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ► ఆగస్టు 28వ తేదీనా రంగనాయకుల స్వామి ఆలయ పూజారీ కౌశిక్ శోభా శర్మ ఆలయ ప్రాంగణంలోనే గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ► జూలై 20వ తేదీనా తమిళనాడుకు చెందిన మురుగేశన్ జల్పల్లి శ్రీరాం కాలనీలో క్లీనర్ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. చెరువుకు పర్యాటకులు రావాలంటే భద్రతే ముఖ్యం.. జల్పల్లి పెద్ద చెరువును టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.9.5 కోట్లతో త్వరలోనే సుందరీకరణ పనులు చేయనుంది. పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చేలా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో ప్రజాభద్రత ఎంతో అవసరం ఉంది. రాక్ గార్డెన్ తెలపెట్టిన రాళ్లల్లోనే గతేడాది పాతబస్తీ యువకుడిని స్నేహితులు దారుణంగా హత్య చేశారు. -
పహాడీషరీఫ్: 38 రోజుల్లో నాలుగు హత్యలు, హడలెత్తుతున్న స్థానికులు
సాక్షి, హైదరాబాద్: మహిళా పూజారి దారుణ హత్యకు గురైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగనాయకుల కాలనీ నుంచి మామిడిపల్లి వెళ్లే దారిలో ఉన్న రంగనాయకుల దేవాలయంలో కౌశిక్ శోభాశర్మ(76), ఆమె కుమారుడు మనోజ్ శర్మ పూజారులుగా కొనసాగుతున్నారు. కుటుంబం మొత్తం నగరంలో నివాసం ఉంటుండగా శోభాశర్మ ఒంటరిగానే ఆలయంలో ఉంటూ దేవుడికి పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా ఈ నెల 28వ తేదీ రాత్రి 7.30 గంటల సమయంలో మనోజ్ తల్లికి ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో మామిడిపల్లిలోని ఓ యువకుడికి ఫోన్లో చెప్పి అక్కడికి వెళ్లి చూసి రమ్మనగా.. శోభాశర్మ మృతి చెంది కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో వెళ్లి చూడగా.. శోభా శర్మ మెడకు ఉరి బిగించి కనిపించింది. ముఖంపై కూడా రక్తపు గాయాలున్నాయి. గదిలో ఉన్న అల్మారా తలుపులు పగులకొట్టారు. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మనోజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా పోలీస్‌స్టేషన్ పరిధిలో 38 రోజుల వ్యవధిలో నాలుగు హత్యోదాంతాలు చోటు చేసుకోవడం పట్ల స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కొడుకు, కోడలు మృతి కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం.. -
పహాడీషరీఫ్ శ్మశాన వాటికలో చిన్నారి మృతదేహం మాయం
-
శ్మశాన వాటికలో చిన్నారి మృతదేహం మాయం
సాక్షి, హైదరాబాద్: పహాడీషరీఫ్ శ్మశాన వాటికలో ఓ చిన్నారి మృతదేహం మాయమైన ఘటన కలకలం రేపుతోంది. శ్మశానవాటిలో పూడ్చిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. మృతదేహం మాయంపై చిన్నారి బంధవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకు ఎత్తుకెళ్లారనే విషయం మిస్టరీగా మారింది. మృతదేహం మాయం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. -
పహడీషరీఫ్ మామిడిపల్లిలొ అగ్నిప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని పహడీషరీఫ్ మామిడిపల్లిలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ ట్రాన్స్‌కో 400 కేవీ సబ్‌స్టేషన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచడంతో..
మీర్‌పేట: అనారోగ్యంతో మృతి చెందిన మహిళ మతదేహాన్ని ఇంట్లోకి రానివ్వకుండా ఇంటి యజమాని అడ్డుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హయత్‌నగర్‌కు చెందిన సుధీర (51) భర్త కొంత కాలం క్రితం చనిపోయాడు. ఇద్దరు కుమారులు నిఖిల్‌సాగర్ (25), నిషాంత్ సాగర్ (22)లు ఉన్నారు. పదేళ్ల క్రితం జిల్లెలగూడ బాలాజీకాలనీలో అద్దెకు ఉంటున్నారు. సుధీర కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందింది. దీంతో అంత్యక్రియల నిమిత్తం కుటుంబసభ్యులు మృతదేహాన్ని సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకునివ్వకుండా ఇంటి యజమాని నిరాకరించింది. దీంతో కుటుంబ సభ్యులు చేసేది లేక ఇంటి బయటే రోడ్డుపై టెంట్ వేసి మృతదేహాన్ని ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని యజమానికి నచ్చజెప్పడంతో ఆ తరువాత కుటుంబసభ్యులు ఇంటి లోపలి వరండాలో మృతదేహాన్ని ఉంచి ఏర్పాట్లు చేసిన అనంతరం జిల్లెలగూడ శ్మశానవాటికిలో అంత్యక్రియలు నిర్వహించారు. పరస్పర దాడులు.. కేసు నమోదు పహాడీషరీఫ్: కోర్టు కేసు ఉన్న భూ విషయమై రెండు గ్రూపులు దాడులకు పాల్పడిన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్‌కు చెందిన ఇర్ఫాన్, ఇమ్రాన్ గ్రూప్‌కు ఇజ్రత్ అలీ, విరాహసత్ అలీ మరో గ్రూప్ నడుమ భూ వివాదం నెలకొంది. ఈ స్థలంలో గురువారం ఇర్ఫాన్ అలీ, ఇమ్రాన్ అలీలు ప్రహరీ నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న మరో వర్గం అడిగేందుకు రాత్రి 10గంటలకు వెళ్లారు. ఈ సమయంలో రెండు గ్రూప్‌లు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. అనంతరం ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చాదర్‌ఘాట్: కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల ప్రకారం.. ఆజంపురాకు చెందిన విజయ్‌కుమార్ (39) పెయింటర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం అర్ధరాత్రి భార్యను రూమ్‌లోంచి బయటకు నెట్టివేసి తలుపులు బిగించుకుని ఇనుపరాడ్డుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: చెట్టుపై కూర్చున్నట్లుగా యువతి మృతదేహం.. -
పహాడీషరీఫ్‌లో ఆటో డ్రైవర్ ఘాతుకం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పహాడీషరీఫ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆటోలో ఎక్కిన ఓ యువతిపై డ్రైవర్ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే సదరు యువతి ప్రతిఘటించడంతో అతి కిరాతంగా హతమర్చాడు. వివరాలు.. చాంద్రాయణగుట్టకు వెళ్లేందుకు బుధవారం రాత్రి 11గంటలకు ఆటో ఎక్కిన ఫాతిమాపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేయడానికి యత్నించాడు. దీంతో ఫాతిమా ప్రతిఘటించగా డ్రైవర్ ఫిరోజ్ ఆమెను స్క్రూ డ్రైవర్‌తో పొడిచి దారుణంగా హత్య చేశాడు. చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా, రెండు బోగీలు దగ్ధం ఫాతిమాకు సంబంధించిన ఆనవాళ్లు గుర్తుపట్టకుండా దుస్తులు తొలగించాడు. అక్కడితో ఆగకుండా ఆమె ముఖాన్ని ఇటుకతో ఛిద్రం చేశాడు. దిశ తరహాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. నిందితుడు ఫిరోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
స్నేక్‌గ్యాంగ్ ఇలాకాలో మరో దారుణం
సాక్షి, పహాడీ షరీఫ్: పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కొన్నాళ్ల క్రితం జరిగిన స్నేక్‌గ్యాంగ్ లాంటి భయంకరమైన ఘటన మరువక ముందే సోమవారం ఉదయం మరో దారుణం వెలుగుచూసింది. గుర్తు తెలియని యువతిపై అత్యాచారం చేసి, అనంతరం తలపై బండరాయితో మోది అత్యంత కిరాతకంగా హత్యచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి కమాన్ రోడ్డు ఆర్.ఆర్.మసాలా గేట్ ఎదురుగా వాదే ముస్తపా వెళ్లే రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గమనించిన బాటసారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎల్.బి.నగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ ఎస్.విష్ణు వర్ధన్ రెడ్డిలు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. చనిపోయిన యువతి 25– 30 ఏళ్ల మధ్య ఉంటుంది. ఆమెపై సామూహిక హత్యాచారం జరిగి ఉంటుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అక్కడికి వచ్చిన డాగ్ స్క్వాడ్ యువతి మృతదేహం నుంచి కమాన్ రోడ్డు సమీపంలోని ఓ గది వరకు వెళ్లి ఆగిపోయింది. క్లూస్ టీం సిబ్బంది శాంపిల్స్ సేకరణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనా స్థలంలో యువతి చెప్పులు, బురఖాతో పాటు గుట్కా ప్యాకెట్లు, సిమెంట్ బండరాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఘటనా స్థలానికి నిందితులు ఆటోలో వచ్చినట్లు ఆటో టైర్ల జాడలు ఉన్నాయి. పోలీసులు ఘటనా స్థలంలోని పరిసరాలలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
భార్య, కూతురుపై కన్ను.. వ్యక్తి దారుణ హత్య
సాక్షి, పహాడీషరీఫ్(హైదరాబాద్): ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆనంఖాన్(31) చాంద్రాయణగుట్టకు వలస వచ్చి ఒంటరిగానే ఉంటున్నాడు. మూడు నెలల క్రితం ఇతనికి స్థానికంగానే ఉన్న బార్ వద్ద వాదే సాల్హె హీన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. నిత్యం మద్యం సేవించే వీరి నడుమ చనువు పెరిగింది. ఈ క్రమంలోనే ఆనంఖాన్ వాదే సాల్హె హీన్లోని ఇమ్రాన్‌ఖాన్ ఇంటికి వెళ్లొచ్చేవాడు. ఇమ్రాన్ ఖాన్ భార్య, కూతురుపై కన్నేసిన ఆనంఖాన్ నేరుగా ఇమ్రాన్ ఖాన్‌తోనే నీ భార్య... కూతురు అందంగా ఉంటారని... తనను వారితో కలిసేలా చూడాలని కోరాడు. గురువారం రాత్రి బార్ వద్ద మద్యం తాగుతుండగా మరోసారి అడగడంతో... సరే కలిపిస్తానంటూ ఇమ్రాన్ ఖాన్ తన బస్తీకి తీసుకెళ్లాడు. ఎక్కడి నుంచో వచ్చి నా భార్య, కూతురుతో అక్రమ సంబంధం అడుగుతావా అని ఆగ్రహించిన ఇమ్రాన్ వెంటనే అక్కడే మటన్ దుకాణంలో ఉన్న కత్తితో ఆనం కడుపు, సంక, చెవి భాగాలలో పొడిచాడు. ఆనంఖాన్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. -
చికిత్స పొందుతూ ఏఎస్ఐ మృతి
పహాడీషరీఫ్: బాలాపూర్ పోలీస్‌స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంచాల ఏఎస్సై కె.నర్సింహ మృతి చెందాడు. నర్సింహ గత నెల 22న ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న విషయం విదితమే. అప్పటి నుంచి కాంచన్‌బాగ్‌లోని డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు సోమవారం మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలాపూర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఘటనకు ముందు నర్సింహ బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌లోనే విధులు నిర్వహించేవాడు. గత నెల 15న బాలాపూర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో తమ బంధువుల విందులో ఉన్నప్పుడు అక్కడికి బాలాపూర్ పెట్రోలింగ్ వాహనం రావడం, ఏఎస్సై కుమారుడికి పోలీసులతో వాగ్వాదం జరగడం, మధ్యలో నర్సింహా రావడంతో గొడవ జరిగింది. ఆ సమయంలో నర్సింహ దూషించిన వీడియోతో కానిస్టేబుళ్లు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేయడంతో అతన్ని మంచాల ఠాణాకు బదిలీ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన నర్సింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి
- ప్రస్తుతం బాలిక ఏడో నెల గర్భిణి పహాడీషరీఫ్: కన్న కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టి గర్భవతిని చేసిన ఓ ప్రబుద్దుడిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ వి.వి.చలపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిషా రాష్ట్రానికి చెందిన నిరంజన్ బేరా(35) పదేళ్ల క్రితం భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి జల్పల్లిలోని గ్రీన్ సిటీలో నివాసం ఉంటున్నాడు. నిరంజన్ దంపతులతో పాటు అతని పెద్ద కూతురు(16) కూడా లేబర్ పనికి వెళుతుంది. ఈ క్రమంలోనే ఏడు నెలల క్రితం కూతురు ఒక రోజు పనికి వెళ్లినచోట అలసి మధ్యలోనే ఇంటికి చేరుకొని గాఢ నిద్రలోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన నిందితుడు కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఏం జరిగిందో అర్థం కాక కూతురు అయోమయంలోనే ఉండి పోయింది. మరి కొన్నిరోజులకు అందరూ నిద్రిస్తున్న సమయంలో మరోసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మూడోసారి అఘాయిత్యానికి పాల్పడినప్పుడు కూతురు ఒంటిపై వస్త్రాలు లేకుండా పోయాయి. అప్పుడు గమనించిన కూతురు విషయాన్ని తన తల్లికి తెలిపింది. భర్తను నిలదీయడంతో ఎవరికైనా చెపితే చంపేస్తానంటూ హెచ్చరించాడు. ఇంతలో బాధితురాలు గర్భం దాల్చింది. మొదట్లో కడుపునొప్పిగా భావించిన కుటుంబ సభ్యులు అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గర్భవతి అని తేలింది. ఆ సమయంలో కూడా నిందితుడు ఎవరికి చెప్పినా చంపుతానంటూ బెదిరించాడు. ప్రస్తుతం సదరు బాలిక ఏడో నెల గర్భవతి. ఈ విషయాన్ని గమనించిన ఇంటి యజమాని పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. -
తల్లిని తిట్టాడని.. నవవధువు ఆత్మహత్య
పహాడీషరీఫ్: కట్టుకున్న భర్త తన తల్లిని దుర్భాషలాడాడని మనస్తాపానికి గురైన నవ వధువు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై నర్సింగ్ రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం....కొత్తపేటకు చెందిన అబ్దుల్లా బిన్ సాల్హెకు ఐదు నెలల క్రితం పర్వీన్ బేగం(30)తో వివాహమైంది. కాగా పెళ్లైన కొన్ని రోజుల నుంచే పర్వీన్ బేగాన్ని అదనపు కట్నం తీసుకురావాలంటూ అబ్దుల్లా వేధించసాగాడు. దీంతో పర్వీన్ వేధింపుల విషయాన్ని తల్లికి తెలియజేయడంతో ఆగ్రహానికి గురైన ఆమె తల్లి.. అల్లుడికి ఫోన్ చేసి గట్టిగా ప్రశ్నించింది. దీనికి ప్రతిగా అల్లుడు ఆమెను దూషించాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన పర్వీన్ తన వల్లే తల్లిదండ్రులకు ఇన్ని కష్టాలని భావించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
పహాడీ షరీఫ్ పీఎస్ పరిధిలో భారీగా భూకబ్జా
-
రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని సతీమణి దుర్మరణం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వర రావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆయన సతీమణి సత్యవాణితోపాటు కారు డ్రైవర్ దాసు కూడా దుర్మరణం చెందారు. హైదరాబాద్ శివారులోని పహాడీ షరీఫ్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న పిన్నమనేని కారు పహాడీ షరీఫ్ వద్ద బోల్తాకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ పిన్నమనేనిని శంషాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు మీద ఈ ప్రమాదం జరిగింది. దీనిపై ఔటర్ రింగ్ రోడ్డు ఉద్యోగులను సంప్రదించగా.. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో జరిగిందని, కారు వెనుక టైరు బాగా దెబ్బ తినడంతో అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొని తిరగబడిందని చెప్పారు. దాంతో ముందుసీట్లో కూర్చున్న డ్రైవర్ దాసు, భార్య సత్యవాణి బయటకు పడిపోయారని, కారు అలాగే 50 అడుగుల పాటు ఈడ్చుకుంటూ వెళ్లిపోయిందని అన్నారు. రోడ్డు మీద పడిపోవడంతో తలకు గాయాలై సత్యవాణి, డ్రైవర్ వాసు అక్కడికక్కడే మరణించారని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిన్నమనేని వెంకటేశ్వరరావు తిరగబడిన కారు -
ఇల్లు ఖాళీ చేయమంటే ప్రాణం తీశాడు
పహాడీషరీఫ్ (హైదరాబాద్) : ఇల్లు ఖాళీ చేయాలని కోరిన యజమానిపై కిరాయిదారుడు దాడిచేసి కొట్టడంతో ఆ యజమాని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హబీబ్‌నగర్ ప్రాంతానికి చెందిన గౌస్‌ఖాన్ (40) ఇంట్లో వారం రోజుల క్రితం అహ్మద్ బిన్ సాదిక్ (27) అనే ఆటోడ్రైవర్ భార్యాపిల్లలతో కలిసి అద్దెకు దిగాడు. కాగా సాదిక్ రోజూ మద్యం తాగి వచ్చి భార్యను కొడుతూ రణరంగం సృష్టిస్తుండడంతో ఇల్లు ఖాళీ చేయాలని గౌస్ కోరాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం గౌస్‌ఖాన్ భార్య భానుబేగంతో సాదిక్ ఘర్షణ పడ్డాడు. అడ్డు వెళ్లిన గౌస్ఖాన్పై దాడిచేసి విచక్షణా రహితంగా కొట్టడంతో గౌస్‌ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
అల్లా... శాంతిని ప్రసాదించు
* వేడుకున్న ముస్లింలు * ముగిసిన ఇస్లామిక్ సమ్మేళనం సాక్షి, హైదరాబాద్: ‘అల్లా.. సమాజంలో స్వార్థంతో పాపాలు పెరిగిపోతున్నాయి. రక్తపాతం కొనసాగుతోంది. శాంతిని ప్రసాదించు. సర్వ మానవాళిని కరుణించు. సన్మార్గంలో నడిచేలా దయ చూపు’ అంటూ లక్షలాది మంది ముస్లింలు దేవుడిని వేడుకున్నారు. తబ్లిక్ జమాత్ ఆధ్వర్యంలో పహాడీ షరీఫ్‌లో మూడు రోజుల పాటు జరిగిన ప్రపంచ స్థాయి ఇస్లామిక్ (ఇజ్తేమా) సమ్మేళనం సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా మౌలానా ఖాసీం ఖురేషీ సుదీర్ఘంగా దువా (అల్లాను వేడుకోలు) నిర్వహించారు. సర్వ మానవాళి పాపాలు క్షమించాలని, సుఖశాంతులతో సుభిక్షంగా ఉండేలా చూడాలని అల్లాను వేడుకున్నారు. ఉదయం ఫజర్ నమాజ్ అనంతరం ఇస్లాం పండితులు మౌలానా అస్లాం, మౌలానా ముస్తాక్, మౌలానా ఖాసీం ఖురేషిలు ప్రసంగించారు. ఇస్లాం మంచిని ప్రబోధిస్తూ శాంతిని కాంక్షిస్తుందన్నారు. దేవుడి వరం మానవ జన్మ అని, దానిని సార్థకం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహ్మద్ ప్రవక్త అనుసరించిన మార్గంలో జీవన గమనాన్ని సాగించాలన్నారు. మంచి మార్గంలో నడిచినప్పుడే ఇతరులకు ఆదర్శంగా మారుతారన్నారు. ఆధ్యాత్మిక చింతన, సహనం, మంచితనంతో దేనినైనా జయించవచ్చన్నారు. ప్రతి ఒక్కరికీ ఆత్మశుద్ధి అవసరమని, అప్పుడే దేవుడి కృప వెన్నంటి ఉంటుదన్నారు. కాగా, మూడు రోజుల పాటు జరిగిన సమ్మేళనానికి సుమారు నాలుగు లక్షల మందికి పైగా హాజరయ్యారు. ముగింపు సందర్భంగా ఇస్లామిక్ పండితులు భవిష్యత్తు కార్యచరణపై ప్రత్యేక భేటి నిర్వహించారు. -
బర్మా దేశస్థుల వివరాలు సేకరించిన పోలీసులు
పహాడీషరీఫ్ (హైదరాబాద్) : మయన్మార్ (బర్మా) దేశం నుంచి శరణార్థుల రూపంలో మూడేళ్ల క్రితం బాలాపూర్ రాయల్ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్న వారి వివరాలను పహాడీషరీఫ్ పోలీసులు సోమవారం సేకరించారు. కాలనీలోని నాలుగు క్యాంప్‌లతోపాటు ఒక్కో ఇంట్లో నివాసం ఉంటున్న బర్మా కుటుంబాల వివరాలను సేకరించారు. ఒక్కో వ్యక్తి ఫొటో, వేలి ముద్రలు, పూర్తి బయోడేటాలను తీసుకున్నారు. రాయల్ కాలనీలోనే 150 కుటుంబాలలో 533 మంది నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ....శరణార్థులుగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పహాడీషరీఫ్, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో 1450 మంది నివాసం ఉంటున్నారన్నారు. ప్రస్తుతం చాలామంది గుర్తింపు కార్డులు లేకుండా అక్రమంగా నివాసం ఉంటున్నారన్నారు. దీనికి తోడు ఒకరిద్దరికి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు తేలిందన్నారు. ఈ నేపథ్యంలో వీరి పూర్తి వివరాలు సేకరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ ఆదేశించారన్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడానికి యూఎన్‌హెచ్‌సీఆర్ కూడా సముఖత తెలిపిందని వెల్లడించారు.