
సాక్షి, హైదరాబాద్: పహాడీషరీఫ్ శ్మశాన వాటికలో ఓ చిన్నారి మృతదేహం మాయమైన ఘటన కలకలం రేపుతోంది. శ్మశానవాటిలో పూడ్చిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. మృతదేహం మాయంపై చిన్నారి బంధవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకు ఎత్తుకెళ్లారనే విషయం మిస్టరీగా మారింది. మృతదేహం మాయం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment