రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని సతీమణి దుర్మరణం | mishap at hyderabad, AP APCOB Chairman Pinnamaneni Venkateswara rao wife has been killed | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని సతీమణి దుర్మరణం

Published Tue, May 17 2016 5:33 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని సతీమణి దుర్మరణం - Sakshi

రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని సతీమణి దుర్మరణం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వర రావు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆయన సతీమణి సత్యవాణితోపాటు కారు డ్రైవర్ దాసు కూడా దుర్మరణం చెందారు. హైదరాబాద్ శివారులోని పహాడీ షరీఫ్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న పిన్నమనేని కారు పహాడీ షరీఫ్ వద్ద బోల్తాకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ పిన్నమనేనిని శంషాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు.

విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డు మీద ఈ ప్రమాదం జరిగింది. దీనిపై ఔటర్ రింగ్ రోడ్డు ఉద్యోగులను సంప్రదించగా.. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఈ ప్రమాదం సోమవారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో జరిగిందని, కారు వెనుక టైరు బాగా దెబ్బ తినడంతో అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొని తిరగబడిందని చెప్పారు. దాంతో ముందుసీట్లో కూర్చున్న డ్రైవర్ దాసు, భార్య సత్యవాణి బయటకు పడిపోయారని, కారు అలాగే 50 అడుగుల పాటు ఈడ్చుకుంటూ వెళ్లిపోయిందని అన్నారు. రోడ్డు మీద పడిపోవడంతో తలకు గాయాలై సత్యవాణి, డ్రైవర్ వాసు అక్కడికక్కడే మరణించారని తెలిపారు.


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిన్నమనేని వెంకటేశ్వరరావు

తిరగబడిన కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement