
ఫైల్ ఫోటో
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని పహడీషరీఫ్ మామిడిపల్లిలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ ట్రాన్స్‌కో 400 కేవీ సబ్‌స్టేషన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.