
సాక్షి, పహడీషరీఫ్: ఓ యువతి అదృశ్యమైన సంఘటన పహడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ బస్వగూడ తండాకు చెందిన సభావత్ రెడ్యా నాయక్ రెండో కూతురు సభావత్ సబిత(20) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈనెల 27న బాలిక తల్లి పనికి వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా సబిత కనిపించలేదు. కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోయింది. నరేశ్ అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. సబిత ఆచూకీ తెలిసిన వారు 94906 17241 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.
చదవండి: (పెళ్లయ్యాక స్వాతితో పీకల్లోతు ప్రేమ.. ట్యూషన్‌కి వెళ్లి..)
Comments
Please login to add a commentAdd a comment