పహాడీషరీఫ్‌లో ఆటో డ్రైవర్‌ ఘాతుకం | Auto Driver Assassinate Women In Pahadi Shareef | Sakshi
Sakshi News home page

పహాడీషరీఫ్‌లో ఆటో డ్రైవర్‌ ఘాతుకం

Published Thu, Dec 17 2020 11:29 AM | Last Updated on Thu, Dec 17 2020 11:48 AM

Auto Driver Assassinate Women In Pahadi Shareef - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పహాడీషరీఫ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆటోలో ఎక్కిన ఓ యువతిపై డ్రైవర్ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే సదరు యువతి ప్రతిఘటించడంతో అతి కిరాతంగా హతమర్చాడు. వివరాలు.. చాంద్రాయణగుట్టకు వెళ్లేందుకు బుధవారం రాత్రి 11గంటలకు ఆటో ఎక్కిన ఫాతిమాపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేయడానికి యత్నించాడు. దీంతో ఫాతిమా ప్రతిఘటించగా డ్రైవర్‌ ఫిరోజ్‌ ఆమెను స్క్రూ డ్రైవర్‌తో పొడిచి దారుణంగా హత్య చేశాడు. చదవండి: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా, రెండు బోగీలు దగ్ధం

ఫాతిమాకు సంబంధించిన ఆనవాళ్లు గుర్తుపట్టకుండా దుస్తులు తొలగించాడు. అక్కడితో ఆగకుండా ఆమె ముఖాన్ని ఇటుకతో ఛిద్రం చేశాడు. దిశ తరహాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. నిందితుడు ఫిరోజ్‌ను పోలీసులు అరెస్ట్‌​ చేసి రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement