ఆటోలో మహిళపై అత్యాచారయత్నం! | Auto Driver Molestation Attempt On Woman At Pahadi Shareef Hyderabad | Sakshi
Sakshi News home page

ఆటోలో మహిళపై అత్యాచారయత్నం!

Published Wed, Nov 10 2021 6:45 AM | Last Updated on Wed, Nov 10 2021 12:57 PM

Auto Driver Molestation Attempt On Woman At Pahadi Shareef Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పహాడీషరీఫ్‌: ఆటో ఎక్కిన ఓ ప్రయాణికురాలిపై డ్రైవర్‌ మరో వ్యక్తితో కలిసి అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఫలక్‌నుమా వట్టెపల్లికి చెందిన మహిళ(35) కాటేదాన్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. సోమవారం రాత్రి ఆమె పనులు ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. కొద్దిదూరం వెళ్లగానే ఆటోడ్రైవర్‌ దారి మార్చి జల్‌పల్లి కార్గో రోడ్డుకు తీసుకొచ్చాడు.

ఆటోడ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి కలిసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారయత్నం చేశారు. డేసీ దాబా సమీపంలోకి రాగానే ఆమె కేకలు వేయడంతో ఆమెను అక్కడ దింపేసి పరారయ్యారు. మంగళవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఆటోనంబర్‌ వివరాలు చెప్పలేకపోవడంతో పోలీసులు కార్గో రోడ్డులో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement