
సాక్షి, పహాడీషరీఫ్ (హైదరాబాద్): డ్యూటీకి వెళ్లిన గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన జగన్నాద్ బెహెరా తన భార్య సుబ్రదాస్ మహాపత్ర (25), కూతురుతో కలిసి జల్‌పల్లి శ్రీరాంకాలనీకి వలస వచ్చి... స్థానిక ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నారు. గత నెల 31వ తేదీన అనారోగ్యంగా ఉండటంతో జగన్నాద్ ఇంటి వద్దే ఉండగా...అతని భార్య మాత్రం డ్యూటీకి వెళ్లింది.
ఎంతకి ఇంటికీ రాకపోవడంతో కంపెనీ వద్ద వాకబు చేయగా.... కంపెనీలో పనిచేసే సూపర్‌వైజర్ హరి వెంట బైక్‌పై వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై జగన్నాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గాని 94906 17241 నంబర్‌లో గాని సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment