
సాక్షి, హైదారాబాద్: విధులకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన ఓ ఐటీ ఉద్యోగిని అదృశ్యమైన ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై ఎం.అంజయ్య వివరాల ప్రకారం.. ప్రైవేటు ఉద్యోగి పగడాల ఉమా శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి రాంనగర్ గుండు సమీపంలో గల దుర్గా నివాస్ అపార్ట్‌మెంట్‌లోని 301 ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. ఆయన ఏకైక కుమార్తె శ్రీశివనాగ హర్షిత(24) హైటెక్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
గత నెల 24న ఉదయం 8 గంటల సమయంలో విధులకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి నేటికీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తండ్రి ఉమా శంకర్ తమ కుమార్తె కనిపించడం లేదంటూ శనివారం సాయంత్రం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా హర్షిత, రాము అనే యువకుడు ప్రేమించుకున్నారని, వారి ప్రేమను తాము అంగీకరించలేదని ఉమా శంకర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment