Cyberabad Police Urge IT Employees Office Logout Timings Ahead of Rains - Sakshi
Sakshi News home page

Hyderabad Rains: ఆ ఏరియా వాళ్లు ఈ టైంకు ఆఫీస్‌లో లాగౌట్‌ చేయాల్సిందే

Published Tue, Jul 25 2023 5:15 PM | Last Updated on Tue, Jul 25 2023 5:47 PM

Cyberabad Police Urge IT Employees Office logout Timings ahead of Rains  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను భారీ వర్షాలు వణికిస్తున్న విషయం తెలిసిందే.  సోమవారం సాయంత్రం గంటపాటు ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. రాత్రి వరకు ఓ మోస్తరు వాన కొనసాగుతూనే ఉంది. అంతేగాక మంగళవారం(నేటి) నుంచి మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంతో.. తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది ఐఎండీ.

కాగా వర్షాల కారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాం అవుతున్న నేపథ్యంలో మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది.

►ఫేజ్ - 1: ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని తెలిపింది. 
►ఫేజ్ - 2: ఐకియా నుంచి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని పేర్కొంది.
ఫేజ్ - 3: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు లాగ్ ఔట్ చేసుకోవాలని చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement