
సాక్షి, హైదరాబాద్, సంగారెడ్డి: బయటకు వెళ్లి వస్తానని చెప్పిన వ్యక్తి కనిపించకుండాపోయాడు. పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్ ఎస్ఐ సోమేశ్వరి కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నర్సపూర్ మండలం హమీద్‌నగర్‌కు చెందిన ప్రణయ్‌కుమార్‌రెడ్డి, సాయిలత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడునెలల క్రితం ఉపాధి నిమిత్తం అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని భవానీపురం కాలనీకి వచ్చారు.
ఈ నెల 22వ తేదీ రాత్రి పదిగంటలకు బయటకు వెళుతున్నానని చెప్పాడు. రాత్రయినా తిరిగి రాలేదు. భర్త కోసం భార్య సాయిలత తెలిసినవారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఐదురోజులు దాటినా జాడ తెలియకపోవడంతో సోమవారం ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment