Fight With Lover: Woman Writes Letter After Goes Missing At Medchal - Sakshi
Sakshi News home page

Hyderabad: ప్రియుడి గొడవ..  ‘అమ్మా.. అందరి ముందు పరువు పోయింది’ అంటూ

Published Thu, Jul 13 2023 12:59 PM | Last Updated on Thu, Jul 13 2023 4:26 PM

Fight With Lover: Woman Writes Letter After Goes Missing At Medchal - Sakshi

అదృశ్యమైన శైలజా, వెంకటేశ్వరి (ఫైల్‌)

సాక్షి, మేడ్చల్‌: అమ్మా.. అందరి ముందు నా పరువు పోయిందని లేఖ రాసి ఇంట్లో పెట్టిన యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి సుతారిగూడలో చోటు చేసుకుంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి సుతారిగూడకు చెందిన వరగంటి శైలజ(25) రెండేళ్లుగా ఓ అబ్బాయిని ప్రేమించింది. కొన్ని రోజులుగా అతడితో మాట్లాడటం మానేసింది.

ఈ నెల 9న రాత్రి సమయంలో  ప్రేమించిన యువకుడు మద్యం మత్తులో శైలజ ఇంటికి వచ్చి బూతులు తిట్టి వెళ్లిపోయాడు. దీంతో మరుసటి రోజు 10వ తేదీన మధ్యాహ్నం ఇంట్లో చెప్పకుండా శైలజ వెళ్లిపోయింది. ఇంట్లో లెటర్‌ కనిపించింది. అందులో ‘అమ్మా.. అందరి ముందు నా పరువు పోయింది, నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నా.. నా కోసం వెతకకండి’ అంటూ శైలజ లేఖలో పేర్కొంది. దీంతో కుటుంబికులు మేడ్చల్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఫోన్‌ రావడంతో బయటకు వెళ్లి.. 
ఫోన్‌ రావడంతో ఇంట్లో నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన కండ్లకోయలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొండం వెంకటేశ్వరి(22) కొంత కాలంగా ఓ అపార్ట్‌మెంట్‌లో హౌస్‌ కీపింగ్‌ పనులు చేస్తోంది. ఈ నెల 7వ తేదీన రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకుంటుండగా ఆమెకు ఫోన్‌ వచ్చింది. దీంతో ఫొన్‌ మాట్లాడుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబికులు మేడ్చల్‌ పోలీసులను ఆశ్రయించారు.  మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: పెళ్లి రిసెప్షన్‌లో యువకుల హల్చల్‌.. తుపాకీ, తల్వార్‌తో డ్యాన్స్‌లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement