
హైదరాబాద్: స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న యువతి అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరి«ధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మల్లీశ్వరీ అనే యువతి గత కొంతకాలంగా మధురానగర్ డివిజన్ పరిధిలోని స్టేట్‌హోంలో ఉంటూ సమీపంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతోంది.
కాగా కడప జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే యువకుడితో ఇన్‌స్ట్రాగాంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో సోమవారం ఆర్థరాత్రి తన గది నుంచి బాత్రూం కిటికీలోనుంచి దూకి పారిపోయింది. తాను ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమించానని, అతనితో పాటు వెళుతున్నట్లు ఉత్తరంలో పేర్కొంది. స్టేట్‌హోం ఇన్‌చార్జి ముంతాజ్‌బేగం ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment