state home
-
బాత్రూం కిటికీ నుంచి పారిపోయిన యువతి
హైదరాబాద్: స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న యువతి అదృశ్యమైన సంఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరి«ధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మల్లీశ్వరీ అనే యువతి గత కొంతకాలంగా మధురానగర్ డివిజన్ పరిధిలోని స్టేట్‌హోంలో ఉంటూ సమీపంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతోంది. కాగా కడప జిల్లాకు చెందిన ప్రవీణ్ అనే యువకుడితో ఇన్‌స్ట్రాగాంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో సోమవారం ఆర్థరాత్రి తన గది నుంచి బాత్రూం కిటికీలోనుంచి దూకి పారిపోయింది. తాను ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమించానని, అతనితో పాటు వెళుతున్నట్లు ఉత్తరంలో పేర్కొంది. స్టేట్‌హోం ఇన్చార్జి ముంతాజ్‌బేగం ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వీణ - వాణిలకు నీటి కష్టాలు
-
వీణ - వాణిలకు నీటి కష్టాలు
హైదరాబాద్: వీణ - వాణి ఆశ్రయం పొందుతున్న యూసఫ్‌గూడ లోని స్టేట్ హోంకు అధికారులు నీటి సరఫరా బంద్ చేశారు. హోం ఆవరణలో ఉన్న ఏడు భవనాలకు జలమండలి అధికారులు నీటి కనెక్షన్ కట్ చేశారు. స్టేట్ హోం తమకు రూ.24 లక్షల మేర చెల్లించాల్సి ఉందని జలమండలి అధికారులు అంటున్నారు. వృద్ధులు, పసిపిల్లలతో కలిపి 700 మంది పైగా ఈ ఆవరణలో మూడు రోజులుగా నీళ్లు లేక అల్లాడుతున్నారు. -
'నీలోఫర్ ఆస్పత్రిని చాలా మిస్సవుతున్నాం'
-
'నీలోఫర్‌ను మిస్సవుతున్నాం'
హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రిని చాలా మిస్సవుతున్నామని అవిభక్త కవలలు వీణా-వాణి పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం తమని తరలించిన స్టేట్ హోం కూడా బాగానే ఉందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వీణా-వాణిలను నీలోఫర్ ఆస్పత్రి నుంచి స్టేట్ హోమ్ కు తరలించిన సంగతి తెలిసిందే. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా అధికారులు ఈ చర్య తీసుకున్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి వీరిద్దరూ నీలోఫర్ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. నీలోఫర్ నుంచి వెళ్లబోమని గతంలో పలుమార్లు వీణా-వాణి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, వీణావాణీల కోసం నీలోఫర్ ఆస్పత్రి సిబ్బందిని డిప్యూటేషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చామని, వారికి ఏ ఇబ్బంది కలుగకూండా చూసుకుంటామని స్టేట్ హోం డైరెక్టర్ లక్ష్మిదేవి తెలిపారు. అవిభక్త కవలలైన వీణా-వాణి విడదీసి విముక్తి కల్పించాలని ప్రభుత్వం భావించినా అది నెరవేరే పరిస్థితి కనిపించకపోవడంతో వారిని జీవితాంతం స్టేట్‌హోమ్‌లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం గత ఆగస్టులోనే నిర్ణయించింది. పేదరికం కారణంగా వీణావాణీలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాసక్తత కనబరిచిన విషయం తెలిసిందే. వీణా-వాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు అమెరికా, లండన్, ఆస్ట్రేలియాకు చెందిన వైద్యులు ముందు వచ్చినా... రిస్క్ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆపరేషన్ పై ప్రభుత్వం వెనక్కు తగ్గింది. -
స్టేట్ హోంకు వీణా వాణీ తరలింపు
-
గుట్టుచప్పుడు కాకుండా వీణావాణీ తరలింపు
-
గుట్టుచప్పుడు కాకుండా వీణావాణీ తరలింపు
హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణీలను నీలోఫర్ ఆస్పత్రి నుంచి స్టేట్ హోమ్ కు తరలించారు. తెలంగాణ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వీరిని తరలించడం చర్చనీయాంశంగా మారింది. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా వీణావాణీలను ఆస్పత్రి నుంచి స్టేట్ హోమ్ కు పంపించారు. ఊహ తెలిసినప్పటి నుంచి వీరిద్దరూ నీలోఫర్ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. నీలోఫర్ నుంచి వెళ్లబోమని గతంలో పలుమార్లు వీణ, వాణి కన్నీళ్లు పెట్టుకున్నారు. అవిభక్త కవలలైన వీరిని విడదీసి విముక్తి కల్పించాలని ప్రభుత్వం భావించినా అది నెరవేరే పరిస్థితి కనిపించకపోవడంతో వీణావాణీలను జీవితాంతం స్టేట్‌హోమ్‌లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం గత ఆగస్టులోనే నిర్ణయించింది. పేదరికం కారణంగా వీణావాణీలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాసక్తత కనబరిచిన విషయం తెలిసిందే. వీణావాణీలకు శస్త్రచికిత్స చేసేందుకు అమెరికా, లండన్, ఆస్ట్రేలియాకు చెందిన వైద్యులు ముందు వచ్చినా... రిస్క్ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆపరేషన్ పై ప్రభుత్వం వెనక్కు తగ్గింది. -
వీణావాణీల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం
హైకోర్టుకు నివేదించిన సర్కార్ సాక్షి, హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణీల సంరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. వీణా-వాణీల ప్రాణాలకు ముప్పుకలగని రీతిలో శస్త్రచికిత్స చేసేందుకు ఎవరైనా డాక్టర్‌ను పిటిషనర్ తీసుకొస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదంది. వీణా-వాణీలను వేరుచేయడంలో జరుగుతోన్న జాప్యంపై జోక్యం చేసుకోవాలంటూ స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ, వీణా-వాణీలు ప్రస్తుతం నిలోఫర్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వారికి ప్రభుత్వం అక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తోందని వివరించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
సహృదయంతో ఆనాథ యువతితో పెళ్లి
వెంగళరావునగర్: ఆమె పేరు అర్చన. తల్లిదండ్రులు లేరు. ఈ లోకంలోకి వచ్చినప్పటి నుంచీ శిశువిహారే అన్నీ. ఓ ప్రైవేటు సంస్థ సాయంతో పదో తరగతి పూర్తి చేసింది. ఆ తరువాత స్టేట్‌హోంకు చేరుకుంది. అక్కడి అధికారులు మహిళా శిశు సంక్షేమశాఖ ఆవరణలోని పాలిటెక్నిక్ కళాశాలలో చేర్పించి చదివించారు. చదువు పూర్తి కాగానే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంది. 23 ఏళ్లుగా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న అర్చన అనే అనాథ యువతికి శనివారం నిశ్చితార్థం జరుగబోతోంది. సూపర్వైజర్ ప్రోత్సాహంతోనే... అర్చన పని చేసే ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న సుజాత అనే మహిళ ప్రోత్సాహంతోనే ఈ నిశ్చితార్థం జరుగుతోంది. అర్చన క్రమశిక్షణ, సత్ప్రవర్తన సూపర్వైజర్కు ఎంతో నచ్చింది. దాంతో సూపర్వైజర్ సుజాత తన మరిదికి ఆమెను ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె సూచన మేరకు తూర్పు గోదావరి జిల్లా ఆకివీడులో ఉంటున్న అత్తమామలు, మరిది వంశీభాస్కర్లు అర్చనను చూసి..పెళ్లికి అంగీకరించారు. స్టేట్‌హోం ఉన్నతాధికారుల నుంచీ గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో అర్చన, వంశీభాస్కర్ల నిశ్చితార్థం శనివారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిశ్చితార్థానికి ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్టు స్టేట్‌హోం ఇన్చార్జి గిరిజ తెలిపారు. -
ఇక జీవితాంతం స్టేట్‌హోమ్‌లోనే..
వీణావాణీల భవిష్యత్తుపై సర్కార్ నిర్ణయం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అనుమతికి వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదన వారి చదువు, భద్రత, వైద్యం, ఇతరత్రా బాధ్యత ప్రభుత్వానిదే హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణీలను జీవితాంతం స్టేట్‌హోమ్‌లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ఉంచేందుకు అనుమతి కోరుతూ స్త్రీ, శిశు సంక్షేమశాఖకు.. వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదన పంపాలని నిర్ణయించింది. వారు టీనేజీలోకి అడుగుపెట్టినందున భద్రత, చదువు, వైద్య వసతి, ఇతరత్రా అన్ని సదుపాయాలు ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందువల్ల స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు సమగ్రమైన ప్రతిపాదనలతో నివేదిక తయారుచేసి అనుమతి తీసుకోనున్నారు. అక్కడి నుంచి అంగీకారం రాగానే వారిని స్టేట్‌హోమ్‌కు తరలిస్తారు. పేదరికం కారణంగా వీణావాణీలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాసక్తత కనబరిచిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అవిభక్త కవలలుగా ఉన్న వారికి సంబంధించిన అంశాన్ని ప్రత్యేక అంశంగా పరిగణించి చివరకు స్టేట్‌హోమ్‌కి తరలిస్తేనే మంచిదని సర్కారు భావించింది. శస్త్రచికిత్సపై ఆశ ల్లేవ్.. అవిభక్త కవలలైన వీరిని విడదీసి విముక్తి కల్పించాలని ప్రభుత్వం భావించినా అది నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. లండన్ డాక్టర్లు పరిశీలించి వెళ్లారు. వారు సరేనన్నా.. రిస్క్ ఉంటుందన్నారు. ఈ విషయంపై ఎయిమ్స్ వైద్యులు కూడా రిస్క్ తప్పదని స్పష్టంచేశారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా డాక్టర్లు కూడా ముందుకు వచ్చారు. కానీ రిస్క్ ఉంటుందన్న వైద్య నిపుణుల అభిప్రాయం వ్యక్తం కావడంతో శస్త్రచికిత్సకు వెళ్లడానికి సర్కారు ఏమాత్రం సుముఖంగా లేదు. శస్త్రచికిత్స చేస్తే అవిభక్త కవలల్లో ఎవరికి ప్రాణాపాయం ఉన్నా అది ఆమోదయోగ్యం కాదని... అలాంటి రిస్క్ భరించడానికి ప్రభుత్వ వర్గాలు, తల్లిదండ్రులు సిద్ధంగా లేరని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఎన్ని కోట్లైనా సర్కారు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని... కానీ రిస్క్ ఉంటే మాత్రం ముందుకు వెళ్లబోమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి జీవితాంతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామంటున్నారు. స్టేట్‌హోమ్‌కు తరలిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఖరారు చేస్తామని... ఆ ప్రకారం వారు నడుచుకోవాల్సి ఉంటుందంటున్నారు. -
ముగ్గురు బాలికల ఆత్మహత్యాయత్నం
* స్టేట్ హోంలో ఘటన * చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలింపు * వేధింపులు తాళలేకే అంటున్న బాధితులు హైదరాబాద్: స్టేట్ హోంలో ముగ్గురు బాలికలు గురువారం ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది. వెంటనే బాలికలను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా సురక్షితంగా ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు. వారం క్రితం స్టేట్‌హోం సిబ్బంది కళ్లుగప్పి పారిపోయిన 11మంది బాధితుల్లో ఈ ముగ్గురు కూడా ఉండటం గమనార్హం. వివిధ నేరాలకు పాల్పడి అరెస్టైన 18 ఏళ్లలోపు అమ్మాయిలను కోర్టు ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాంగణంలోని రెస్క్యూ హోంకు తరలిస్తారు. అలాగే తల్లిదండ్రులులేని అనాథలు, భర్త, ఇతరుల నిరాధరణకు గురైన మహిళలకు స్టేట్‌హోంలో వసతి కల్పిస్తారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన 15 ఏళ్ళ బాలిక, మెదక్ జిల్లా కారమంగి గ్రామానికి చెందిన 16 ఏళ్ళ బాలిక, ఖమ్మం జిల్లా ముట్టితాండ గ్రామానికి చెందిన 15 ఏళ్ళ బాలిక సిబ్బంది వేధింపులు తాళలేక గురువారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రెస్క్యూహోంలోని ఇద్దరు బాలికలు ఐరన్ టాబ్లెట్లను మింగగా, స్టేట్‌హోంలోని మరో బాలిక సర్ఫ్ కలిపిన నీళ్లు తాగింది. హోం ఇన్చార్జి నిర్మల వెంటనే 108కు సమాచారం అందించి, చికిత్స కోసం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలికలు మింగిన మాత్రలు, తాగిన సర్ఫ్ నీళ్లను వైద్యులు బలవంతంగా కక్కించారు. వేధింపులు తాళలేకే.. అధికారుల వేధింపులు తాళలేకే తాము ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే హోంలో ఆశ్రమం పొందుతున్న బాలికలందరినీ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నామని, ఇప్పటి వరకూ తాము ఎవ్వరినీ వేధించలేదని శిశుసంక్షేమ శాఖ అధికారులు చెపుతున్నారు. రెస్క్యూ హోం, స్టేట్ హోంలో ఉండలేకే వారు ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. -
స్టేట్‌హోం నుంచి 11మంది యువతుల పరారీ
సికింద్రాబాద్‌లో పట్టుబడిన బాలిక హైదరాబాద్ : నగరంలోని యూసుఫ్‌గూడ స్టేట్‌హోం నుంచి 11మంది యువతులు అధికారుల కళ్లుగప్పి బుధవారం ఉదయం పరారయ్యారు. వీరిలో ఇటీవలే ప్రసవించిన ఒకామె తన ఆరునెలల బాలుడ్ని కూడా తీసుకొని వెళ్లిందని అధికారులు గుర్తించారు. వెళ్లిపోయిన వారిలో కొందరు బాలికలు కూడా ఉన్నారు. వీరిలో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓ బాలిక (15) సికింద్రాబాద్ మోండా మార్కెట్ వద్ద బుధవారం సాయంత్రం పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. యువతులు హాస్టల్‌కున్న ఓ కిటికీ గుండా వెళ్లి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న రెస్క్యూహోం సూపరింటెండెంట్ నిర్మల ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.స్టేట్ హోం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే యువతులు పారిపోయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరారైన వారిలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారితో పాటు, నల్గొండ, మెదక్,కరీంనగర్, జిల్లాలకు చెందినవారున్నారు. సంఘటనా స్థలానికి వచ్చిన వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు,పోలీసులు హోం పరిసర ప్రాంతాలను పరిశీలించారు. మిగతా వారిని పట్టుకునేం దుకు పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. కోర్టు కేసులకు పంపనందునే.. మంగళవారం రాత్రి అధికారుల తనఖీలో హోంలో ఉన్న పలువురి వద్దనుంచి సెల్ఫోన్లను తీసుకోవడం వల్లనే వీరంతా పథకం ప్రకారం వెళ్లిపోయినట్లు తొలుత అధికారులు భావించారు. అయితే పట్టుబడిన బాలిక సమాచారం ప్రకారం వీరిలో అధికులు వివిధ ప్రాంతాల్లో కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. వాటికి వారిని హాజరు పరిచే విషయంలో హోం నిర్వాహకులు శ్రద్ధచూపక పోవడంతో వారంతా కూడబలుక్కొని పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం కోర్టుకు హాజరయ్యేందుకు అంతా పరారైనట్లు బాలిక కథనం. ఈ మేరకు తమ బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారంతా అమీర్ పేటకు వచ్చారని వారితో కలిసే వెళ్లిపోయామని వెల్లడించింది. -
కూచిపూడితో టీచింగ్
కర్ణాటక సంగీతం మొదలు కూచిపూడి, భరతనాట్యం, కథక్, టెంపుల్‌డాన్స్ నేర్చుకుంది అచ్యుత మానస. నేర్చుకున్న కళను అద్భుతంగా అభినయించి అటు గురువుల ఆశీస్సులను, ఇటు ఆహుతుల ప్రశంసలనూ అందుకుంటోంది. ఇంకోవైపు అకడమిక్స్‌లోనూ చురుకుగానే ఉంది. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఎమ్ఎన్సీలో ఉద్యోగమూ సంపాదించుకుంది. తన తండ్రి రవిచంద్ర (డిఐజీ)లాగే సివిల్స్ జాయిన్ అవ్వాలన్నది ఆమె ధ్యేయం. ఆ అభ్యాసమూ మొదలుపెట్టింది. 2010 వరకు ఇంకో ఆలోచనేదీ లేకుండా తన లక్ష్యసాధన దిశగా ప్రయాణం సాగింది. ఆ తర్వాత... ఆగస్ట్ 15, 2010. అప్పుడు మానస వాళ్ల నాన్న ఉద్యోగరీత్యా గుంటూరులో ఉన్నారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు తల్లి,తండ్రీ సహా తనూ హాజరైంది. స్టేట్‌హోమ్‌లోని పిల్లలు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన వందేమాతరం పాటమీద డాన్స్ చేశారు. మానస మనసు చివుక్కుమంది. తర్వాత ఒక ఈవెంట్లో క్లాసికల్ డాన్స్ అని ‘చంద్రముఖి’ సినిమాలోని పాట మీద చేశారు. ‘పిల్లలు కదా ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. అదే క్లాసికల్ డాన్స్ అంటే నమ్ముతారు వాళ్లకేం తెలుసు’ అని అప్పటికైతే సరిపెట్టుకుంది కానీ మనసొప్పలేదు. ఆ పిల్లలకు శాస్త్రీయ నృత్యం నేర్పించాలనే తపన మొదలైంది. స్టేట్‌హోమ్‌కి వెళ్లింది. పిల్లలను పరిచయం చేసుకుంది. అసలు క్లాసికల్ డాన్స్ ఎలా ఉంటుందో చెప్పింది.. చేసిచూపించింది. జనవరి 26కల్లా వందేమాతరం పాటమీద కూచిపూడి నేర్పించింది. ప్రదర్శన ఇప్పించింది. ‘డాన్స్ అనగానే సినిమా పాటలమీద చేస్తాం’ అనే పిల్లల మైండ్‌సెట్‌ను మార్చేసింది. వాళ్లకోసం ఇంకేదో చేయాలనుకునేలోపే వాళ్ల నాన్నకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. హైదరాబాద్‌లో.. గుంటూరు స్టేట్ హోమ్ ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడి స్టేట్‌హోమ్ పిల్లలకూ డాన్స్, సంగీతం నేర్పించాలనుకుంది మానస. కథలు, పాటలతో మొదలుపెట్టి మెల్లగా అడుగుల్లోకి వచ్చింది. ‘కూచిపూడి మై లైఫ్’ అనే పేరుతో ఆ పిల్లలకు శాస్త్రీయ నృత్యం నేర్పిస్తూ శాస్త్రీయ కళల పట్ల అవగాహన కలిగిస్తోంది. ‘‘చదువు, జ్ఞానం రెండూ వేర్వేరని నా ఉద్దేశం. చదువు ఎవరైనా నేర్పిస్తారు. జ్ఞానం కళల వల్ల అబ్బుతుంది. బతకడానికి కావల్సిన ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ పిల్లలకు అవి చాలా అవసరం. ఈ లోకంలో తమకెవరూ లేరని, తమనెవరూ చూడరనే ఆత్మన్యూనతలోంచి లోకం తమ దృష్టిని వీరిపై మరల్చుకునే స్థితికి రావడానికి ఈ కళ వీళ్లకు ఒక సాధనంగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మొదట్లో ఈ పిల్లలు నాతో చాలా రూడ్‌గా ఉండేవారు. వాళ్లలో ఒక రకమైన కసి కనిపించేది. వీళ్లను డీల్ చేయగలనా? అనుకున్నాను. కానీ తర్వాత్తర్వాత నాకు మంచి స్నేహితులైపోయారు. ఈ పిల్లలతో గడిపినంత సేపు అలౌకిక ఆనందంలో ఉంటాను. ఓ గుడిలో దొరికే ప్రశాంత కనిపిస్తుంది’ అంటుంది అచ్యుత మానస. అయిదేళ్ల ప్రాయం నుంచే... అయిదేళ్ల వయసున్నప్పటి నుంచే కర్ణాటక సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది మానస. కాస్త ఊహ తెలిసేటప్పటికి తనకు కావల్సింది ఇది కాదు డాన్స్ అనుకుంది. ఆ మాటే అమ్మతో చెపితే.. ఎన్నాళ్లు నేర్చుకుంటుందిలే.. అని డాన్స్‌లో చేర్పించింది అమ్మ. అలా కాజా వెంకట సుబ్రహ్మణ్యం దగ్గర కూచిపూడి, డాక్టర్ దేవేంద్ర పిళై దగ్గర భరతనాట్యం, పండిట్ అంజుబాబు దగ్గర కథక్, ఓలేటి రంగమణి దగ్గర టెంపుల్‌డాన్స్ నేర్చుకుంది అచ్యుత మానస. డివీడి.. మానస గురువు అయిన కాజా వెంకట సుబ్రహ్మణ్యం నృత్యదర్శకత్వంలో ‘కూచిపూడి నృత్యాభినయ వేదిక .. నాట్యం మోక్షమార్గం’ పేరుతో చిత్రించిన డీవీడీని త్వరలోనే విడుదల చేయబోతోంది మానస. ఈ వేడుక ఆరంభవేళ కాజా వెంటక సుబ్రహ్మణ్యం కొరియోగ్రఫీలో స్టేట్‌హోమ్ పిల్లలతో నాట్యప్రదర్శన ఇప్పించబోతోంది. ‘లెర్నింగ్.. షేరింగ్.. డిస్కస్’ ఇది అచ్యుత మానస పాటించే జీవనసూత్రం. ఇదే సూత్రాన్ని స్టేట్‌హోమ్ పిల్లలకూ నేర్పించే గురుతర బాధ్యతను నిర్వర్తిస్తోంది! నిజమైన కళాసేవ చేస్తోంది! - సరస్వతి రమ -
ఆశ్రయం కోల్పోయిన విద్యార్థుల.. అభిప్రాయ సేకరణ
పెద్దవూర, న్యూస్‌లైన్: పెద్దవూర మండలం ఏనెమీదితండా వీఆర్ఓ సంస్థ ఆశ్రమ పాఠశాల మూసివేతతో ఆశ్రయం కోల్పోయిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ బుధవారం వారి స్వగ్రామాలకు వెళ్లి కలిసి అభిప్రాయాలను సేకరించింది. ఏనెమీదితండా వీఆర్ఓ సంస్థ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 12మంది గిరిజన బాలికలపై జరిగిన లైంగికదాడి సంఘటనలో నిందితులను అరెస్టు చేసి ఆశ్రమ పాఠశాలను మూసివేశారు. వీఆర్ఓ సంస్థ హాస్టల్ మూతపడటంతో అందులో చదువుకుంటున్న 45మంది బాలురు, 34మంది బాలికలు ఇంటి ముఖం పట్టారు. ఇందులో లైంగికదాడికి గురైన 12మంది బాలికలను అధికారులు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని స్టేట్‌హోంకు తరలించారు. వివిధ గిరిజన సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల విన్నపం మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా గిరిజన సంక్షేమ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులను టీంగా ఏర్పాటు చేశారు. మంగళవారం జిల్లా విద్యాధికారి ఏనెమీదితండా ప్రాథమిక పాఠశాల హెచ్ఎం, అసిస్టెంట్ ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతో విద్యార్థుల జాబితా లేక అధికారుల టీం కొంత ఇబ్బంది పడ్డారు. చివరకు నాగార్జునసాగర్‌లో ఉన్న హెచ్ఎంను తీసుకువచ్చి బాధిత విద్యార్థుల అడ్రస్‌లను తీసుకోవాల్సి వచ్చింది. ఈ కమిటీ బుధవారం మూడు బృందాలుగా విడిపోయి వీఆరోఓ సంస్థ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాధిత విద్యార్థుల గ్రామాలకు వెళ్లి విద్యార్థులు ఎక్కడ చదువుతారో తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. వీరిని అర్హత కలిగిన, వారు ఎంచుకున్న పాఠశాలలో చేర్పించనున్నారు. విద్యార్థులు చదుకొవటానికి ఆసక్తి చూపే జాబితాను తయారు చేసి కలెక్టర్‌కు 10వ తేదీలోపు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూవోలు హరికిషన్‌సింగ్, సంజీవరావు, దేవరకొండ, దామరచర్ల, మిర్యాలగూడ బాలుర ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్ ప్రిన్సిపాళ్లు నాగేశ్వర్రావు, సోమ య్య, కె.సుధాకర్‌రెడ్డి, పెద్దవూర,త్రిపురారం,చందంపేట, చివ్వెం ల, పెద్దగట్టు మినీ గురుకులం పాఠశాలల హెచ్ఎంలు బాల్యనాయక్, సుజాత, హైజక్, విమల, చంద్యానాయక్ పాల్గొన్నారు.