'నీలోఫర్‌ ఆస్పత్రిని చాలా మిస్సవుతున్నాం' | Veena-Vani comments on bringing them state home | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 2 2017 9:21 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

నీలోఫర్‌ ఆస్పత్రిని చాలా మిస్సవుతున్నామని అవిభక్త కవలలు వీణా-వాణి పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం తమని తరలించిన స్టేట్‌ హోం కూడా బాగానే ఉందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వీణా-వాణిలను నీలోఫర్‌ ఆస్పత్రి నుంచి స్టేట్‌ హోమ్‌ కు తరలించిన సంగతి తెలిసిందే. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా అధికారులు ఈ చర్య తీసుకున్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి వీరిద్దరూ నీలోఫర్‌ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. నీలోఫర్‌ నుంచి వెళ్లబోమని గతంలో పలుమార్లు వీణా-వాణి కన్నీళ్లు పెట్టుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement