Veena-Vani
-
వీణావాణిలను పరామర్శించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్: అవిభక్త కవలలైన పదమూడేళ్ల వీణావాణిల గురించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. నిలోఫర్ ఆస్పత్రి నుంచి స్టేట్ హోంకు వచ్చిననాటి నుంచి వారు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారని, వారిది ప్రత్యేక పరిస్థితి కావడంతో సర్కారు కూడా వారిని అంతే ప్రత్యేకంగా కంటికి రెప్పలా చూసుకుంటోందని చెప్పారు. వారి చదువుకు అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం కల్పించింది. వీరి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఆదేశించడంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ వారి కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించారు. వారి బాగోగుల కోసం ఏకంగా రూ.6.46 లక్షలను కేటాయించారు. ఈ మొత్తంలో వారిని అనుక్షణం జాగ్రత్తగా చూసుకునే అయాలకే రూ.4.32 లక్షలను కేటాయించారు. వారికి చదువులు చెప్పే కౌన్సిలర్ కోసం రూ.1.14 లక్షలు, నిర్వహణ కోసం మరో రూ.లక్ష కేటాయించారు. వీణావాణిల స్థితిగతులపై మంత్రి తుమ్మల ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు స్టేట్ హోంను సందర్శించిన మంత్రి శుక్రవారం మరోమారు వచ్చి వీణావాణిలను పలకరించారు. వారితో కాసేపు మాట్లాడి వారికి ఇంకేమి కావాలో అడిగి తెలుసుకున్నారు. విద్య, ఇతర సౌకర్యాలు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్టేట్ హోం సిబ్బందికి సూచించారు. -
వీణ - వాణిలకు నీటి కష్టాలు
-
వీణ - వాణిలకు నీటి కష్టాలు
హైదరాబాద్: వీణ - వాణి ఆశ్రయం పొందుతున్న యూసఫ్‌గూడ లోని స్టేట్ హోంకు అధికారులు నీటి సరఫరా బంద్ చేశారు. హోం ఆవరణలో ఉన్న ఏడు భవనాలకు జలమండలి అధికారులు నీటి కనెక్షన్ కట్ చేశారు. స్టేట్ హోం తమకు రూ.24 లక్షల మేర చెల్లించాల్సి ఉందని జలమండలి అధికారులు అంటున్నారు. వృద్ధులు, పసిపిల్లలతో కలిపి 700 మంది పైగా ఈ ఆవరణలో మూడు రోజులుగా నీళ్లు లేక అల్లాడుతున్నారు. -
'నీలోఫర్ ఆస్పత్రిని చాలా మిస్సవుతున్నాం'
-
'నీలోఫర్‌ను మిస్సవుతున్నాం'
హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రిని చాలా మిస్సవుతున్నామని అవిభక్త కవలలు వీణా-వాణి పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం తమని తరలించిన స్టేట్ హోం కూడా బాగానే ఉందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వీణా-వాణిలను నీలోఫర్ ఆస్పత్రి నుంచి స్టేట్ హోమ్ కు తరలించిన సంగతి తెలిసిందే. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా అధికారులు ఈ చర్య తీసుకున్నారు. ఊహ తెలిసినప్పటి నుంచి వీరిద్దరూ నీలోఫర్ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. నీలోఫర్ నుంచి వెళ్లబోమని గతంలో పలుమార్లు వీణా-వాణి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, వీణావాణీల కోసం నీలోఫర్ ఆస్పత్రి సిబ్బందిని డిప్యూటేషన్ మీద ఇక్కడికి తీసుకొచ్చామని, వారికి ఏ ఇబ్బంది కలుగకూండా చూసుకుంటామని స్టేట్ హోం డైరెక్టర్ లక్ష్మిదేవి తెలిపారు. అవిభక్త కవలలైన వీణా-వాణి విడదీసి విముక్తి కల్పించాలని ప్రభుత్వం భావించినా అది నెరవేరే పరిస్థితి కనిపించకపోవడంతో వారిని జీవితాంతం స్టేట్‌హోమ్‌లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం గత ఆగస్టులోనే నిర్ణయించింది. పేదరికం కారణంగా వీణావాణీలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాసక్తత కనబరిచిన విషయం తెలిసిందే. వీణా-వాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు అమెరికా, లండన్, ఆస్ట్రేలియాకు చెందిన వైద్యులు ముందు వచ్చినా... రిస్క్ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆపరేషన్ పై ప్రభుత్వం వెనక్కు తగ్గింది. -
స్టేట్ హోంకు వీణా వాణీ తరలింపు
-
గుట్టుచప్పుడు కాకుండా వీణావాణీ తరలింపు
-
గుట్టుచప్పుడు కాకుండా వీణావాణీ తరలింపు
హైదరాబాద్: అవిభక్త కవలలు వీణావాణీలను నీలోఫర్ ఆస్పత్రి నుంచి స్టేట్ హోమ్ కు తరలించారు. తెలంగాణ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వీరిని తరలించడం చర్చనీయాంశంగా మారింది. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా వీణావాణీలను ఆస్పత్రి నుంచి స్టేట్ హోమ్ కు పంపించారు. ఊహ తెలిసినప్పటి నుంచి వీరిద్దరూ నీలోఫర్ ఆస్పత్రిలోనే ఉంటున్నారు. నీలోఫర్ నుంచి వెళ్లబోమని గతంలో పలుమార్లు వీణ, వాణి కన్నీళ్లు పెట్టుకున్నారు. అవిభక్త కవలలైన వీరిని విడదీసి విముక్తి కల్పించాలని ప్రభుత్వం భావించినా అది నెరవేరే పరిస్థితి కనిపించకపోవడంతో వీణావాణీలను జీవితాంతం స్టేట్‌హోమ్‌లో ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం గత ఆగస్టులోనే నిర్ణయించింది. పేదరికం కారణంగా వీణావాణీలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు నిరాసక్తత కనబరిచిన విషయం తెలిసిందే. వీణావాణీలకు శస్త్రచికిత్స చేసేందుకు అమెరికా, లండన్, ఆస్ట్రేలియాకు చెందిన వైద్యులు ముందు వచ్చినా... రిస్క్ ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆపరేషన్ పై ప్రభుత్వం వెనక్కు తగ్గింది. -
అమెరికా వీణా-వాణీలు
తెలుగు బాలికలు వీణా-వాణీలను వేరు చేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాధ్యపడడం లేదు. కానీ సరిగ్గా వీరిలాగే తలలు కలసిపోయి ఉన్న అమెరికన్ కవలలకు మాత్రం అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి విజయవంతంగా వారిని విడదీశారు. న్యూయార్క్‌కు చెందిన 13 నెలల ఈ కవలల పేర్లు జేడన్, అనియాస్. వీళ్లిద్దరినీ వేరు చేసేందుకు అక్కడి మాంటెఫెర్ పిల్లల ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన 27 గంటల ఆపరేషన్ వైద్య చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలిచింది. నికోల్, క్రిస్టినా దంపతులకు రెండో సంతానంగా తలలు అతుక్కుని కవలలు జన్మించారు. విడివిడిగా కాకుండా కపాలాలు రెండూ కలిసిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ తల్లిదండ్రులు డాక్టర్ జేమ్స్ గుడ్ రిచ్‌ను సంప్రదించారు. అప్పటికే కష్టతరమైన ఆపరేషన్లు ఎన్నో చేసిన అనుభవం ఉందాయనకు. అయితే జేడాన్, అనియాస్లది కష్టతరమైన కేసు. చిన్న తేడా వచ్చినా పిల్లలు మరణించే అవకాశం ఉంది. చివరికి తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఆపరేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. డాక్టర్ జేమ్స్ ఆధ్వర్యంలో మొత్తం 20 మంది వైద్యులు 27 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించారు. మొదటి 16 గంటలు పిల్లల తలలను వేరుచేయడానికే పట్టింది. తర్వాత త్రీడీ టెక్నాలజీ సాయంతో కపాలాలను వేరు చేశారు. సర్జరీకి మరో 11 గంటలు పట్టింది. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన వెంటనే తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుని మురిసిపోయారు. -
వీణా-వాణీల ఆపరేషన్‌కు ఆస్ట్రేలియా బృందం సిద్దం
-
'ఆపరేషన్‌ను కేంద్రం దృష్టికి తీసుకెళతాం'
-
వీణావాణిల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతాం
- వారికి శస్త్రచికిత్స కంటే సామాజిక భద్రతే ముఖ్యం: దత్తాత్రేయ - వీణావాణి ప్రస్తుతం చురుగ్గా, ఆరోగ్యంగా ఉన్నారు - వైద్యుల సలహా మేరకే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని వెల్లడి సాక్షి, హైదరాబాద్ : ‘‘అవిభక్త కవలలు వీణావాణిలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నారు. వారి లో శారీరకంగానే కాదు మానసికంగా కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి శస్త్రచికిత్స చేస్తే 90 శాతం ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఈ అంశంలో వైద్యుల నిర్ణయమే అంతిమం..’’ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తత్రేయ పేర్కొన్నారు. ప్రస్తుతం వీణావాణిలకు శస్త్రచికిత్స చేయడం కంటే సామాజిక భద్రత కల్పించడమే ముఖ్యమని తాను భావిస్తున్నట్లు చెప్పారు. తమ పిల్లలకు శస్త్రచికిత్స చేయించాలని కోరుతూ వీణావాణిల తల్లిదండ్రులు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్సపై సాధ్యాసాధ్యాలను ఆరా తీసేందుకు దత్తాత్రేయ శనివారం నిలోఫర్ ఆస్పత్రికి వచ్చారు. వీణావాణిలతో మాట్లాడారు, వారితో కాసేపు చదరంగం ఆడారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. ‘‘వీణావాణిలను చూడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఈ రోజు కుది రింది. వెల్ కం సార్.. అంటూ వారు నన్ను ఆప్యాయంగా పలకరించారు. వారి గదిలోకి తీసుకెళ్లారు. ఆస్పత్రి నుంచి ఇంటికి పంపిస్తాం వెళ్తారా? అని అడిగితే.. అమ్మ ఒడిలాంటి ఆస్పత్రిని వదిలి వెళ్లబోమన్నారు. వారికి చిన్నప్పుడే శస్త్రచికిత్స చేసి ఉంటే బాగుండేది. అయినా ఈ అంశాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళతాను. ప్రాణాలతో వారిని కాపాడే అవకాశముంటే తప్పకుండా శస్త్రచికిత్స చేయించేందుకు కృషి చేస్తాం. కార్మిక శాఖ తరఫున వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం..’’ అని చెప్పారు. ఆస్ట్రేలియా బృందం చికిత్స: లక్ష్మారెడ్డి వీణావాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన వైద్య బృందం ముందుకు వచ్చిందని మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఈ చికిత్సకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇక నీలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రిలో వీణావాణిలను ఉంచడం కుదరని, వారిని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు కూడా ముందుకు రానందున స్టేట్‌హోమ్‌కు తరలించడమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. శనివారం ఆయన నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రితో పాటు ఎర్రగడ్డలోని ఛాతీ, మానసిక చికిత్సాలయాలను సందర్శించి... మౌలిక సదుపాయాలు, రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కలరా, ఇతర సీజనల్ వ్యాధులపై భయపడాల్సిన అవసరం లేదని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులను అప్రమత్తం చేశామన్నారు. -
వీణావాణి ఫ్యామిలీ
ఆ‘పరేషాన్’ వీణ-వాణి... వీరు 2003 అక్టోబరు 16న కలిసి పుట్టారు. దేహాలే వేరు, తలలు కలిసే ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వీరి శస్త్ర చికిత్స అంశంపై తరచు ప్రస్తావనకు వస్తోంది. వీరికి పన్నెండేళ్లు నిండాయి. (ఈ సందర్భంగా సాక్షి ఫ్యామిలీ జూన్ 30 గురువారం సంచికలో స్పెషల్ స్టోరీ ఇచ్చింది) నీలోఫర్‌లో పన్నెండేళ్లలోపు వారే ఉండాలనే నిబంధన ఉండడంతో వీరిని అక్కడి నుంచి తీసుకెళ్లాలని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటనేది అయో మయంగా మారింది. వీణ-వాణిల పరిస్థితిపై వారి తల్లిదండ్రులు మారగాని మురళీ- నాగలక్ష్మీలను ‘సాక్షి’ ఫ్యామిలీ పలకరించింది. వారి మనోగతాన్ని తెలుసుకుంది. వీణ-వాణిల పుట్టుకను దేవుడే నిర్ణయించాడు. ఆ దేవుడినే నమ్ముకున్నాం. అంతా మంచి జరుగుతుందనే ఆశతో ఉన్నాము. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా వీరిని విడదీసే శస్త్ర చికిత్సకు మాత్రం ముహూర్తం కుదరడంలేదు. ఇన్నాళ్ల పరిస్థితి వేరు. వీణ-వాణిలు ఇప్పుడు పెద్దవాళ్లవుతున్నారు. స్వతంత్రంగా ఆలోచించే పరిస్థితిలో ఉంటున్నారు. ఇప్పటికే ఒక్కో సందర్భాల్లో ఒకరి అభిప్రాయం ఒక్కోలా ఉంటోంది. అమ్మాయిలు కావడం వల్ల ఇక నుంచి సమస్యలు పెరుగుతాయి. పరిణామాలు ఎలా ఉన్నా... ఇప్పుడు శస్త్ర చికిత్స చేయడమే సరైనదని భావిస్తున్నాము. ఏళ్ల తరబడి అనుభవిస్తున్న బాధ ఇప్పుడు అలవాటైంది. శస్త్ర చికిత్సతోనే ఇన్నాళ్లుగా... వాళ్లిద్దరు, మేము అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి కలుగుతుంది. దీనికి ఇదే సరైన సమయం. ప్రభుత్వం, వైద్యులు స్పందించి ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ పరిస్థితి ఏ తల్లిదండ్రులకూ రాకూడదు వీణ-వాణిలకు నీలోఫర్ తల్లి లాంటిది. 2006 ఏప్రిల్ 19 నుంచి వాళ్లు అక్కడే ఉంటున్నారు. ఇద్దరి బాగోగులు నీలోఫర్ డాక్టర్లు, సిబ్బందే చూస్తున్నారు. సమయానికి అన్నీ సమకూర్చుతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా టీచర్‌ను పెట్టారు. ఇద్దరూ ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలు మాట్లాడగలుగుతున్నారు. పుట్టిన రెండేళ్ల నుంచి ఇప్పటి వరకు వీణ-వాణిలకు నీలోఫర్ తల్లిగా, తండ్రిగా నిలిచింది. మా కన్న బిడ్డలే అయినా పరిస్థితుల వల్ల మేం వారికి ఏమీ చేయలేకపోతున్నాము. వారికి దూరంగా బతుకుతున్నాము. ఇప్పుడు వారికి అన్నీ తెలుస్తున్నాయి. ఇటీవల వారి దగ్గరికి వెళ్లినప్పుడు... ‘అక్క, చెల్లెను మీ దగ్గర ఉంచుకుంటున్నారు. మమ్మల్ని మాత్రం ఇక్కడే ఉంచుతున్నారు. మేం అనాథలమా? ఎందుకమ్మా ఇలా’ అని అడిగారు. వారి ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియలేదు. ఈ పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు జూన్ మొదటి వారంలో నిలోఫర్ అధికారులు ఫోన్ చేశారు. ‘జూన్ 8న నిలోఫర్ బోర్డు మీటింగ్ ఉంది, వీణ-వాణిల అంశం చర్చిస్తాము. ఆ రోజు మీరు రావాలి’ అని చెప్పారు. మేం వెళ్లాము. ఎయిమ్స్ పరీక్షల నివేదికలు వచ్చాయని వివరించారు. శస్త్ర చికిత్స చేస్తే ఇద్దరి ప్రాణానికి హామీ ఇవ్వలేని చెప్పారు. శస్త్ర చికిత్స విజయవంతమయ్యేందుకు 80 శాతం అవకాశాలు ఉన్నాయని లండన్ వైద్య బృందం చెప్పిన విషయం గుర్తు చేశాము. లండన్ వైద్య పరీక్షల నివేదికను వివరించారు. శస్త్ర చికిత్సలో ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. 12 ఏళ్ల లోపు వారే నీలోఫర్‌లో ఉండాలనే నిబంధన ఉందని చెప్పారు. వీణ-వాణిలను ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ వార్త మమ్మల్ని ఆందోళనకు గురిచేసింది. వీణ-వాణిలు పుట్టినప్పటి నుంచి ఆస్పత్రుల్లోనే ఉన్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. మా ఊళ్లో పరిస్థితి వేరు. వైద్య ఖర్చుల కోసం ఉన్న అర ఎకరం పొలం అమ్మేశాను. నేను ఆటో నడుపుతుంటా. నాగలక్ష్మి కూలి పనులు చేస్తుంటుంది. మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందరం కలిసి హైదరాబాద్‌లో ఉండలేము. అలా అని వీణ-వాణిలను ఊళ్లోకి తీసుకురాలేము. ఏం చేయాలో అయోమయంగా ఉంది. శస్త్ర చికిత్స కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయిస్తామని చెప్పింది. వీణ-వాణిలకు శస్త్ర చికిత్స చేయించడమే మంచిదనే ఉద్దేశంతో ఉన్నాము.సూర్యాపేట నుంచి... పిల్లలు నల్లగొండ జిల్లా సూర్యపేటలోని విజయకృష్ణ నర్సింగ్ హోమ్‌లో పుట్టారు. తలలు కలిసి పుట్టడం మాకు అప్పుడు వింతగా అనిపించింది. విజయకృష్ణ నర్సింగ్ హోం నిర్వాహకురాలు డాక్టర్ విజయ మేడమ్ గుంటూరులోని డాక్టర్ నాయుడమ్మ దగ్గర పనిచేశారు. మా సంతానం విషయాన్ని విజయ మేడమ్ డాక్టర్ నాయుడమ్మతో చెప్పారు. మూడోరోజు నాయుడమ్మ సార్ వచ్చి పరిశీలించారు. వీణ-వాణి అని వాళ్లకు ఆయనే పేరు పెట్టారు. పిల్లలను గుంటూరుకు తీసుకెళ్లారు. వీణ-వాణిల తలలు అంటుకుని ఉన్నాయి. పూర్తిగా అంటుకుని ఉండకుండా చర్మం పొరను విడదీసీ మళ్లీ కలవకుండా శస్త్రచికిత్స చేశారు. మరోసారి శస్త్రచికిత్స చేసి విడదీసే ప్రయత్నం చేస్తామని అన్నారు. వాళ్లు రెండున్నరేళ్లు గుంటూరులోనే డాక్టర్ నాయుడమ్మ సార్ దగ్గర ఉన్నారు. ఆ తర్వాత నాయుడమ్మ సార్ రిటైర్ అయ్యారు. అప్పుడు గుంటూరు నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చాము. సూపరింటెండెంట్ ఎన్సీకే రెడ్డి సార్ వీణ-వాణిని నీలోఫర్‌లోనే పెట్టుకుంటామని చెప్పారు. పలుసార్లు పరీక్షలు నిర్వహించడం, శస్త్ర చికిత్స చేసి విడదీసేందుకు పలు దేశాల వైద్యులు రావడం, పరీక్షలు నిర్వహించడం అప్పటి నుంచి కొనసాగుతోంది. 2008లో ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే మూడు నెలలు ఉన్నారు. డాక్టర్ ఆశిష్‌మెహతా పరిశీలించారు. శస్త్ర చికిత్సకు అవసరమైన వైద్య పరీక్షల కోసం చెన్నైకి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్సకు రూ.8 కోట్లు ఖర్చవుతుందని అన్నారు. చేస్తే వీణ-వాణిల ప్రాణానికి భరోసా ఇవ్వలేమని, ఒకరే బతికే అవకాశం ఉందని చెప్పారు. అక్కడి నుంచి మళ్లీ నిలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. 2009 జనవరి 1న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నీలోఫర్‌కు వచ్చి వీణ-వాణిలను పరామర్శించారు. ఆ సంఘటన మరిచిపోలేం. వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స చేయిస్తానని చెప్పి రూ.3 కోట్లు విడుదల చేశారు. సెప్టెంబరులో వైఎస్సాఆర్ దివంగతులయ్యారు. మా ఆశలు కూలిపోయాయి. తర్వాత ముఖ్యమంత్రి రోశయ్యను కలిశాము. సింగపూర్‌కు చెందిన డాక్టర్ కీత్‌గో వచ్చి పరిశీలించారు. శస్త్ర చికిత్స చేస్తామని చెప్పారు. ఎయిమ్స్‌లోనే చేయాలని ప్రభుత్వం భావించింది. అప్పటి నుంచి వివిధ దేశాల వైద్యులు వచ్చి పరిశీలించి వెళ్తున్నారు. లండన్‌కు తీసుకువస్తే శస్త్ర చికిత్స చేస్తామని 2015 ఫిబ్రవరిలో అక్కడి నుంచి వచ్చిన వైద్యులు చెప్పారు. ఇలా ఎంత మంది వైద్యులు పరిశీలించినా... శస్త్రచికిత్స ఎప్పుడనేది కచ్చితంగా ఎవరూ చెప్పడంలేదు. ప్రభుత్వమే మా మొర ఆలకించాలి. - పిన్నింటి గోపాల్, సాక్షిప్రతినిధి, వరంగల్ ఫొటోలు : పెద్దపెల్లి వరప్రసాద్ -
వీణా-వాణిల ఆపరేషన్‌కు ఆర్సీహెచ్ సుముఖత
మెల్బోర్న్: అవిభక్త కవలలు వీణా-వాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు ఆస్ట్రేలియాలోని ప్రపంచ ప్రఖ్యాత రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ (ఆర్సీహెచ్) సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఈ ఆస్పత్రిని సందర్శించి వీణా-వాణిల శస్త్రచికిత్సపై వైద్య నిపుణులతో చర్చించారు. ఆర్సీహెచ్ వైద్యులు గతంలో చేసిన ఆపరేషన్ల గురించి నిరంజన్‌రెడ్డికి వివరించారు. వీణా-వాణిలకు ఆపరేషన్ చేసే విషయంపై సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో మరింత కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని నిరంజన్ రెడ్డి చెప్పారు. -
నేడు నీలోఫర్‌కు ఎయిమ్స్ బృందం
వీణ-వాణిల శస్త్రచికిత్స సాధ్యాసాధ్యాల పరిశీలన సాక్షి, హైదరాబాద్: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్-న్యూఢిల్లీ)కి చెందిన ముగ్గురు సభ్యుల న్యూరో వైద్యుల బృందం నేడు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి రానుంది. అవిభక్త కవలలైన వీణ-వాణిల శస్త్రచికిత్సకు సాధ్యాసాధ్యాలు, వైద్య పరీక్షలు తదితర వాటిపై పరిశీలనకు ఈ బృందం వస్తున్నట్టు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్‌కు చెందిన గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ వైద్యులు డా.డేవిడ్ డునావే, డాక్టర్ జిలానీల బృందం హైదరాబాద్‌కొచ్చి నీలోఫర్‌లో ఉన్న వీణ-వాణిలను పరిశీలించారు. ఐదు దశల్లో శస్త్రచికిత్స నిర్వహించి వీళ్లిద్దరినీ వేరు చేస్తామని.. ఈ కవలలను లండన్‌కు తీసుకురావాలని అన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. లండన్ వైద్యులను రప్పించి ఢిల్లీలోని ఎయిమ్స్‌లోనే శస్త్రచికిత్స చేయించాలని నిర్ణయించింది. అంటే ఇప్పటికి సుమారు పది మాసాలు అయింది. తాజాగా ఎయిమ్స్ వైద్యులతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో వీణ-వాణిలను పరిశీలించేందుకు ముగ్గురు వైద్యుల బృందం వస్తోంది. వీరికోసం నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు ఏర్పాట్లు చేశారు. వీణ-వాణిలకు అన్ని వైద్య పరీక్షలు చేసి నివేదికలను సిద్ధం చేశారు. ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం లండన్ వైద్యులతోనూ ఆ బృందం సమాలోచనలు జరుపనుంది. -
వీణ-వాణీలకు వైద్య పరీక్షలు
హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణ, వాణిలను వేరు చేసేందుకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లండన్ వైద్యుల బృందం శనివారం నిలోఫర్ ఆస్పత్రికి చేరుకుంది. లండన్ నుంచి వైద్యులు డునావే, జిలానీ.. వీణ-వాణిలకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్నీ సానుకూలంగా ఉంటే వీణా-వాణిలను లండన్‌కు తరలించి శస్త్రచికిత్స చేసే అవకాశముంది. ఈ ఆపరేషన్‌కు 25 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చవుతుందని అంచనా. లండన్ వైద్యులు రెండు రోజుల పాటు వీణా వాణీలను ఇక్కడే క్షుణ్నంగా పరీక్షించి ఆపరేషన్‌తో వారిని విడదీసేందుకు అవకాశం ఉంటుందా లేదా అన్న విషయాన్ని తేల్చనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా తదితర ఉన్నతాధికారులతో లండన్ వైద్య బృందం చర్చలు జరుపనుంది. అవిభక్త కవలలను వేరు చేయడంలో లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆస్పత్రి పేరు పొందింది. 2011లో ఇదే ఆస్పత్రిలో సూడాన్‌కు చెందిన ఏడాది వయస్సున్న అవిభక్త కవలలు రిటాల్, రిటాగ్లను విజయవంతంగా వేరు చేశారు. అప్పట్లో ఈ ఆపరేషన్‌కు 6 కోట్లు ఖర్చయింది. ప్రస్తుతం 25 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చయ్యే అవకాశముందని సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన వీణ, వాణి పుట్టినప్పటి నుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్‌లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు.