
అనూష (ఫైల్)
ధర్మవరం అర్బన్: తన భార్య అనూష మూడురోజులుగా కనిపించడంలేదని గోరంట్ల మండలం కామిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాసులు శనివారం ధర్మవరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసులుకు ధర్మవరానికి చెందిన అనూషతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. బ్యాంక్ కోచింగ్ నిమిత్తం రోజూ ధర్మవరం నుంచి అనంతపురానికి వెళ్లివచ్చేది. మార్చి 27న సాయంత్రం ఆమె ధర్మవరానికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి వెతుకుతున్నా ఎక్కడా కనిపించలేదు. తన భార్య ఆచూకీ తెలిసిన వారు పట్టణ పోలీసులకు సమాచారమందించాలని శ్రీనివాసులు కోరుతున్నాడు. పోలీసులు గాలింపు చేపట్టారు.