
ముస్కాన్ బేగం
సాక్షి, హైదరాబాద్: ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ యువతీ అదృశ్యమైన సంఘటన డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....నూర్‌ఖాన్‌బజార్ ఉస్మాన్‌పురా ప్రాంతానికి చెందిన వాసియా బేగం ఇంట్లో సోదరి కూతురు ముస్కాన్ బేగం (19) నివాసముంటూ ఇంటర్ చదువుతోంది.
కాగా గత నెల 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముస్కాన్ బేగం స్నేహితురాలి వద్దకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. అనంతరం ఆమె ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన వాసియా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు.
చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు
Comments
Please login to add a commentAdd a comment