dabeerpura
-
స్నేహితురాలి వద్దకు వెళుతున్నానని...
సాక్షి, హైదరాబాద్: ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ యువతీ అదృశ్యమైన సంఘటన డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....నూర్‌ఖాన్‌బజార్ ఉస్మాన్‌పురా ప్రాంతానికి చెందిన వాసియా బేగం ఇంట్లో సోదరి కూతురు ముస్కాన్ బేగం (19) నివాసముంటూ ఇంటర్ చదువుతోంది. కాగా గత నెల 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముస్కాన్ బేగం స్నేహితురాలి వద్దకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. అనంతరం ఆమె ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన వాసియా బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
వాళ్లే ఆగుతారనుకుంటే, ఆగమైపోతారు.. జరజాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు, అధికారులు ఎంత చెప్పిన ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, ఇష్టం వచ్చినట్లు రోడ్డు దాటం..నిత్యం ప్రమాదాలకు కారణాలుగా మారుతున్నాయి. హైవేపై వాహనాలు వేగంగా వెళ్తాయన్న విషయం తెలిసిందే. ఆలాంటి దారిలో రోడ్డు దాటే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రాణాలకు ప్రమాదం తప్పదు. తాజాగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబీర్‌పుర దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. వేగంగా వాహనాలు వస్తున్నా.. అవేవీ పట్టించుకోకుండా ఓ యువకుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. తనను చూసి వాహనాల డ్రైవర్లు నెమ్మదించరా! అని అతను రోడ్డును క్రాస్ చేసే క్రమంలో ఓ వాహనం వేగంగా రానే వచ్చింది. సదరు యువకుడిని ఢీ కొట్టింది. దీంతో ఆ పాదచారుడు ఎగిరిపడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ యువకుడు గాయాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాద సమయంలో బాధితుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. రోడ్డు దాటే సమయంలో వచ్చిపోయే వాహనాలను చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అతివేగంగా వెళ్తున్న వాహనం ఒక్కసారిగా స్పీడ్‌ను కంట్రోల్ చేయడం కష్టతరమవుతుందని, పాదచారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు. Do not assume that vehicles will stop. A non-fatal road accident occurred near Dabirpura in Medchal PS limits.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/pjsdCX8qTu — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) August 28, 2021 -
శ్మశానవాటిక గుంత: వ్యక్తి దారుణ హత్య
డబీర్‌పురా: పాతబస్తీలోని డబీర్‌పురా బడా ఖబ్రస్థాన్ (శ్మశాన వాటిక) కేర్‌టేకర్ కుమారుడు ఫైజల్ (36)శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యాడు. డబీర్‌పురా పోలీసుల కథనం ప్రకారం..శ్మశాన వాటికలో తవ్విన గుంతపై తలెత్తిన వివాదంలో వాగ్వివాదం జరగడంతో అబ్దుల్లా అనే వ్యక్తి ఫైజల్‌పై కత్తితో దాడి చేసి తీవ్రంగా పొడిచాడు. దీంతో గాయపడిన ఫైజల్‌ను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా మృతి చెందాడు. నిందితుడు అబ్దుల్లా మద్యం మత్తులో ఉన్నాడని, అతనిపై ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: వెబ్సైట్లో యువతుల చిత్రాలు పెట్టి వ్యభిచారం -
అది హైదరాబాద్‌లోనే జరిగింది.. ముంబైలో కాదు
సాక్షి, హైదరాబాద్ : ఆగస్టు 19న హైదరాబాద్‌లో డబీర్‌పుర డైరీ ఫాంలో గేదె నుంచి పాలు పిండిన తర్వాత అవే పాలను గ్లాసులో పోసుకొని తాగి.. మళ్లీ అవే ఎంగిలి పాలను అదే గిన్నెలో పోశాడు. గేదెలు నీళ్లు తాగడం కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో గ్లాసు నీళ్లు ముంచి అపరిశుభ్రంగా ఉన్న నీళ్లను తీసుకొచ్చి మళ్లీ గిన్నెలో కలిపాడు.. దాదాపు 30 సెకన్ల పాటు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పని చేసిన వ్యక్తి పేరు మహ్మద్ సోహైల్ అని చెప్పారు. అయితే ఇది ముంబైలో జరిగిందని.. ఆ వ్యక్తి ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి అంటూ కొందరు వ్యక్తులు ట్విటర్లో తప్పుడు వార్తలు పెట్టారు. అంతేకాదు.. హిందువులు పూజించే ఆవు నుంచి తీసిన పాలను ఎంగిలి చేసి వారి మనోభావాలను దెబ్బతీశాడంటూ పేర్కొన్నారు.అంతేగాక అతను ఆ పని చేస్తున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో నమాజ్‌కు సంబంధించిన పాటను ప్లే చేస్తున్నట్లుగా చూపించారు. దీనిని దాదాపు వెయ్యిసార్లు రీట్వీట్ చేశారు. (ఛీ.. ఇదేం బుద్ధిరా నాయనా) I can hear Naara-E-Takbeer A Muzlim milk seller doing what they have been taught to as per the book. This exclusive weird video must reach the masses who still believe in Ganga-Jamuni Tehzeeb & Bhai-Chaara. Just see the filth which many of us are eating/drinking around us. pic.twitter.com/vSeQYA7n9D — Ashish Jaggi (@AshishJaggi_1) August 19, 2020 అయితే ఇదంతా ఫేక్ అని.. పాలు పిండిన వ్యక్తి ముంబయికి చెందిన ముస్లిం కాదని హైదరాబాద్‌కు చెందిన కొరీనా సువారెస్ అనే న్యూస్ మీటర్ తన కథనంలో చెప్పుకొచ్చింది. నిజానికి ఈ ఘటన హైదరాబాద్‌లోనే చోటుచేసుకుందని.. డబీర్‌పురకు చెందిన గౌస్ అనే వ్యక్తి డైరీఫాం నడుపుతున్నాడు. గౌస్ దగ్గర రాజు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆరోజు వీడియోలో పాలు తాగిన వ్యక్తి రాజు అని పోలీసులు గుర్తించారు. కానీ రాజు పరారీలో ఉండడంతో డైరీ ఫాం నడుపుతున్న గౌస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఇదే విషయమై.. డబీర్‌పుర పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ మాట్లాడారు. వీడియోలో వైరల్ అయిన వ్యక్తి ముస్లిం వర్గానికి చెందిన వాడు కాదని.. ఈ ఘటన గౌస్ నడుపుతున్న జహంగీర్ డైరీ ఫాంలో చోటుచేసుకుంది. వీడియోలో ఉన్న వ్యక్తి రాజు అని.. ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడని సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే పోలీసు అధికారులు ఆ డైరీ ఫాంను సీజ్ చేశారని.. డైరీ ఫాం నిర్వహిస్తున్న గౌస్‌పై ఐపీసీ 269, సెక్షన్ 272, 273 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ముంబైలో జరగలేదని.. హైదరాబాద్‌లోని డబీర్‌పురాలోనే చోటుచేసుకుందని.. ఆ వ్యక్తి ముస్లిం కాదని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. -
ఎంగిలి చేసిన పాలను మళ్లీ అదే గిన్నెలో పోశాడు
-
ఛీ.. ఇదేం బుద్ధిరా నాయనా
సాక్షి, హైదరాబాద్ : మీరు రోజు పాలు తాగుతారా.. అయితే ఈ వార్త చదవకపోవడమే మంచిది. సాధారణంగా పాలలో నీళ్లు కలుపుతారన్న మాట నిజమే.. కానీ ఇక్కడ ఒక వ్యక్తి చేసిన పనికి మాత్రం పాలు తాగాలనిపించదు. డబీర్‌పురకు చెందిన మహ్మద్ సోహైల్ డైరీ ఫాం నడుపుతున్నాడు. తాజాగా మహ్మద్ సోహైల్ గేదెల నుంచి పాలు పిండాడు. తర్వాత ఆ పాలను ఒక గ్లాస్లో పోసుకొని సగం తాగాడు. ఎంగిలి చేసిన మిగిలిన పాలను మళ్లీ అదే గిన్నెలో పోశాడు. అనంతరం గేదెలు నీళ్లు తాగడం కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో గ్లాసు నీళ్లు ముంచి అపరిశుభ్రంగా ఉన్న నీళ్లను తీసుకొచ్చి మళ్లీ గిన్నెలో కలిపాడు.(చదవండి : కేసీఆర్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం, వ్యక్తి ఆరెస్ట్) మహ్మద్ సోహైల్ చేసిన పనిని కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. విషయం తెలుసుకున్న కొందరు స్థానికులు ప్రజలు తాగే పాలను ఇలా అపరిశుభ్రం చేస్తున్న వ్యక్తికి అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డబీర్‌పుర పోలీసులు డైరీ ఫామ్ యజమాని సోహైల్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
హైదరాబాద్: దుస్తుల దుకాణంలో పనిచేసే ఓ మహిళ హత్యకు గురైంది. డబీర్‌పురాలో మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలివీ... అబిడ్స్‌లోని రూప్‌సాగర్ బట్టల షోరూంలో జీనత్(35) సేల్స్ ఉమన్‌గా పనిచేస్తుండేది. ఆమె డబీర్‌పురాలోని బాల్షెట్టిఖేత్ ప్రాంతంలో నివాసం ఉండేది.ఈ క్రమంలో తన గదిలో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెతో పాటు రూప్‌సాగర్ షోరూంలో పనిచేసే సయ్యద్ మొహ్సిన్ మంగళవారం ఉదయం ఆమె గదికి రాగా విషయం వెలుగులోకి వచ్చింది. అతడి సమాచారం మేర కు సీఐ మట్టయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. గుర్తు తెలియని వ్యక్తి ఆమె ముఖంపై దిండుతో అదిమి చంపేశాడని తెలిపారు. కాగా, మొహ్సిన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం తనను జీనత్ రూ.3,000 అప్పు అడిగిందని.. ఆ డబ్బును తీసుకుని ఆమె గదికి వెళ్లగా చనిపోయి ఉందని చెబుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.