అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి | sales woman died in suspicious stage in hyderabad | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

Published Tue, Nov 3 2015 10:17 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

sales woman died in suspicious stage in hyderabad

హైదరాబాద్: దుస్తుల దుకాణంలో పనిచేసే ఓ మహిళ హత్యకు గురైంది. డబీర్‌పురాలో మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలివీ... అబిడ్స్‌లోని రూప్‌సాగర్ బట్టల షోరూంలో జీనత్(35) సేల్స్ ఉమన్‌గా పనిచేస్తుండేది. ఆమె డబీర్‌పురాలోని బాల్‌షెట్టిఖేత్ ప్రాంతంలో నివాసం ఉండేది.ఈ క్రమంలో తన గదిలో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెతో పాటు రూప్‌సాగర్ షోరూంలో పనిచేసే సయ్యద్ మొహ్‌సిన్ మంగళవారం ఉదయం ఆమె గదికి రాగా విషయం వెలుగులోకి వచ్చింది. అతడి సమాచారం మేర కు సీఐ మట్టయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు.

గుర్తు తెలియని వ్యక్తి ఆమె ముఖంపై దిండుతో అదిమి చంపేశాడని తెలిపారు. కాగా, మొహ్‌సిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం తనను జీనత్ రూ.3,000 అప్పు అడిగిందని.. ఆ డబ్బును తీసుకుని ఆమె గదికి వెళ్లగా చనిపోయి ఉందని చెబుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement