
డబీర్‌పురా: పాతబస్తీలోని డబీర్‌పురా బడా ఖబ్రస్థాన్ (శ్మశాన వాటిక) కేర్‌టేకర్ కుమారుడు ఫైజల్ (36)శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యాడు. డబీర్‌పురా పోలీసుల కథనం ప్రకారం..శ్మశాన వాటికలో తవ్విన గుంతపై తలెత్తిన వివాదంలో వాగ్వివాదం జరగడంతో అబ్దుల్లా అనే వ్యక్తి ఫైజల్‌పై కత్తితో దాడి చేసి తీవ్రంగా పొడిచాడు. దీంతో గాయపడిన ఫైజల్‌ను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా మృతి చెందాడు. నిందితుడు అబ్దుల్లా మద్యం మత్తులో ఉన్నాడని, అతనిపై ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: వెబ్‌సైట్‌లో యువతుల చిత్రాలు పెట్టి వ్యభిచారం
Comments
Please login to add a commentAdd a comment