సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు, అధికారులు ఎంత చెప్పిన ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, ఇష్టం వచ్చినట్లు రోడ్డు దాటం..నిత్యం ప్రమాదాలకు కారణాలుగా మారుతున్నాయి. హైవేపై వాహనాలు వేగంగా వెళ్తాయన్న విషయం తెలిసిందే. ఆలాంటి దారిలో రోడ్డు దాటే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రాణాలకు ప్రమాదం తప్పదు.
తాజాగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబీర్‌పుర దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. వేగంగా వాహనాలు వస్తున్నా.. అవేవీ పట్టించుకోకుండా ఓ యువకుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. తనను చూసి వాహనాల డ్రైవర్లు నెమ్మదించరా! అని అతను రోడ్డును క్రాస్ చేసే క్రమంలో ఓ వాహనం వేగంగా రానే వచ్చింది. సదరు యువకుడిని ఢీ కొట్టింది. దీంతో ఆ పాదచారుడు ఎగిరిపడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ యువకుడు గాయాలతో బయటపడ్డాడు.
అయితే ప్రమాద సమయంలో బాధితుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. రోడ్డు దాటే సమయంలో వచ్చిపోయే వాహనాలను చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అతివేగంగా వెళ్తున్న వాహనం ఒక్కసారిగా స్పీడ్‌ను కంట్రోల్ చేయడం కష్టతరమవుతుందని, పాదచారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు.
Do not assume that vehicles will stop.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) August 28, 2021
A non-fatal road accident occurred near Dabirpura in Medchal PS limits.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/pjsdCX8qTu
Comments
Please login to add a commentAdd a comment