
సాక్షి, చిలకలగూడ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మాధవనగర్‌కు చెందిన సెంట్రింగ్ కార్మికుడైన ముస్తాల రవి, నాగలక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చి పార్శిగుట్టలో నివసిస్తున్నారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 20న నాగలక్ష్మి (24) తన కుమార్తెలు రిత్విక(4), రెండున్నరేళ్ల సిరిని వెంటతీసుకుని బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. స్వగ్రామంతోపాటు సన్నిహితులు, బంధు మిత్రులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో భర్త రవి సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అడ్మిన్ ఎస్‌ఐ తెలిపారు.
చదవండి: విష సర్పాన్ని ముద్దాడి.. మృత్యువుతో పోరాటం!
Comments
Please login to add a commentAdd a comment