
సాక్షి, మీర్‌పేట: భర్తతో గొడవపడిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కనిపించకుండా పోయింది. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా పదర గ్రామానికి చెందిన కుమార్, రాధ (30) భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఏడేళ్ల క్రితం దంపతుల మధ్య గొడవ జరగడంతో రాధ భర్తను వదిలేసి జిల్లెలగూడ అంబేడ్కర్‌నగర్‌కు వచ్చి ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌ఉమన్‌గా పనిచేస్తూ ఇక్కడే ఉంటోంది. తరచూ భర్త వచ్చి వెళ్తుండేవాడు. రాధ కూలీ పనులకు కూడా వెళ్తుండేది. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడడంతో రెండు నెలలుగా ఇద్దరు కలిసి ఉంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న భర్త కుమార్ గత నెల 4న కుటుంబసభ్యులతో కలిసి అంబేడ్కర్‌నగర్‌కు వచ్చి రాధను మందలించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అర్ధరాత్రి అందరూ నిద్రించిన తర్వాత రాధ తన ఇద్దరు కుమారులు రవి (10), గణేష్ (12)ను తీసుకుని దుర్గాప్రసాద్‌తో కలిసి వెళ్లి తిరిగి రాలేదు. వారి ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: గాంధీ, ఉస్మానియాలో కరోనా కలకలం.. 94 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్
Comments
Please login to add a commentAdd a comment