Woman Missing In Kakinada District: Quarrel Between Daughter In Law And Aunt - Sakshi
Sakshi News home page

AP: వాకిలి తుడవలేదని అత్త.. చల్లబడ్డాక తుడుస్తానని కోడలు.. చివరికి..

Published Mon, Apr 18 2022 11:00 AM | Last Updated on Tue, Apr 19 2022 10:22 PM

Quarrel Between Daughter In Law And Aunt: Woman Missing In Kakinada District - Sakshi

వీరరాఘవమ్మ(ఫైల్‌ఫోటో)

పిఠాపురం(కాకినాడ జిల్లా): పొద్దు కునుకుతోంది ఇంకా వాకిలి తుడలేదని అత్త, ఇంకా చాలా ఎండగా ఉంది కదా చల్లబడ్డాక తుడుస్తానని కోడలు అంతే ఇద్దరు పంతాలకు పోవడంతో వారి మధ్య చిన్న గొడవ. ఇంతలో బయటి నుంచి ఇంటికి వచ్చిన కొడుకు తన తల్లిని భార్యను చిన్న దానికి గొడవెందుకంటూ మందలించాడు. అంతా సర్దుమణిగింది అనుకుంటు ఉదయం లేవగానే కోడలు తనను కొడుకుతో తిట్టించిందని కోపగించి అత్త ఎవరికి చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లి పోయింది. రెండు రోజుల పాటు ఎంత వెదికినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో కొడుకు పోలీసులను ఆశ్రయించగా మహిళ అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

చదవండి: నచ్చని పెళ్లి చేస్తున్నారని.. ఆ యువతి ఎంతకు తెగించిందంటే?

పట్టణ ఎస్సై శంకర్రావు కథనం ప్రకారం స్థానిక కత్తులగూడేనికి చెందిన వాకాడ సత్యనారాయణ తన తల్లి భార్యతో కలిసి ఉంటున్నాడు. తల్లి, భార్యకు మధ్య వాకిలి తుడిచే విషయంలో చిన్న గొడవ జరగడంతో సత్యనారాయణ తల్లి వీరరాఘవమ్మ అలిగి ఈనెల 14వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి బంధువులు, తెలిసిన వాళ్ల ఇళ్ల దగ్గర ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఆదివారం ఆమె కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement