
యామల రామలక్ష్మి (ఫైల్)
సీతమ్మధార(విశాఖపట్నం): ఇంటి పనికి వెళ్లి వస్తానని చెప్పి, వెళ్లిన మహిళ తిరిగి రాకపోవడంతో.. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్వారకానగర్, మొదటి లేన్‌లోని పవన్ టవర్స్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్న సింహాచలం నాయుడు కుమార్తె రామలక్ష్మి వివాహిత.
భర్తతో విడిపోవడంతో తండ్రి వద్ద ఉంటూ, చుట్టుపక్కల ఇంటి పనులకు వెళ్లి వస్తుంటుంది. ఈ నెల ఐదో తేదీన పనికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన కుమార్తె రాకపోవడంతో, బంధువులు, స్నేహితులను వాకబు చేశారు. వారు రాలేదని తెలపడంతో బుధవారం ద్వారకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ అప్పలరాజు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని హెచ్‌సీ కె.అప్పలరాజుకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment