సాక్షి, హైదరాబాద్: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఓ యువతి అదృశ్యమైన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సోమిరెడ్డి సత్తిబాబు తన కూతురు రాధిక(19)ను స్వస్థలం ఆంధ్రపదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని మచ్చవాని పాలెంలో చదివిస్తున్నాడు. అయితే అక్కడ రాజేష్ అనే యువకుడు, రాధికలు ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసి రాధికను బాలానగర్‌లోని సాయినగర్‌కు ఆరు నెలల క్రితం తీసుకువచ్చాడు.
అయితే 17వ తేదీ ఉదయం 10.30 గంటలకు రాధిక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన సోమిరెడ్డి సత్తిబాబు బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసినా ఆచూకీ తెలియకపోవటంతో బాలానగర్ పోలీస్‌లను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పెళ్లయిన యువతితో యువకుని ప్రేమ వ్యవహారం.. చివరకు..
Comments
Please login to add a commentAdd a comment