
అదృశ్యమైన శ్రీపూజ, రితిక
చిలకలగూడ : కుటుంబకలహాల కారణంగా ఓ మహిళ కుమార్తెతో సహా అదృశ్యమైన సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ వరుణ్‌కాంత్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పార్శిగుట్ట సంజీవపురం ప్రాంతానికి చెందిన చెందిన చరణ్‌దాస్, శ్రీపూజ అలియాస్ అనూష దంపతులకు ఇద్దరు సంతానం. గత కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈనెల 6న కూడా వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికిలోనైన శ్రీపూజ అదే రోజు మధ్యాహ్నం తన సోదరుడికి ఫోన్ చేసి తాను చిన్నకుమార్తె రితిక (03)ను తీసుకుని హుజూరాబాద్‌లోని పుట్టింటికి వెళుతున్నానని, పెద్ద కూతురు మన్విత (05)ను స్కూత్ నుంచి తీసుకు రావాలని తన భర్త చరణ్‌దాస్‌కు చెప్పాలని సూచించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన చరణ్‌దాస్ భార్యకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. పుట్టింటికి వెళ్లలేదని తెలియడంతో ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వరుణ్‌కాంత్‌రెడ్డి తెలిపారు.