ప్రతీకాత్మక చిత్రం
సీతానగరం (తూర్పుగోదావరి): స్థానికురాలైన తేలు శ్రావణి సంధ్య అనే యువతి 20 రోజుల క్రితం అదృశ్యమైంది. రాజమహేంద్రవరంలోని మీ సేవకు వెళ్లి వస్తానంటూ గత నెల 14న ఆమె ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. అప్పటి నుంచీ ఆమె తిరిగి రాలేదు. కాగా ఆమె ఇంటి పక్క పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న సింగవరపు లోకేష్ అనే యువకుడు కూడా అప్పటి నుంచి కనిపించడం లేదు. అతడే తన కుమార్తె శ్రావణి సంధ్యను కిడ్నాప్ చేసి ఉండవచ్చని తల్లి శ్రీలత అనుమానం వ్యక్తం చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తెలిపారు.
చదవండి: నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment