
శ్రావణి (ఫైల్)
మేడ్చల్: ఓ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లిన యువతి ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరుడు మేడ్చల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కండ్లకోయ హెచ్‌బీ కాలనీకి చెందిన జె.శ్రావణి (23) నానక్‌రామ్‌గూడలోని క్యాప్‌జెమిని కంపెనీ కార్యాలయంలో ఇంటర్వూ కోసం శనివారం ఉదయం 8 గంటలకు ఇంటి నుండి బయలుదేరి వెళ్లింది. 9:48 గంటలకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కేంద్రానికి చేరుకున్నట్లు చెప్పిందని ఆమె సోదరుడు ప్రశాంత్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని, సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో అదేరోజు రాత్రి క్యాప్‌జెమినీ కార్యాలయానికి వెళ్లి విచారించగా సమాచారం తెలియలేదన్నారు. శ్రావణి , ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని మేడ్చల్ పోలీసులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment