
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థ ఆపిల్ ఇప్పటివరకు లేనంత సన్నని (మందం తక్కువ) ఐపాడ్, మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లను తీసుకొస్తున్నట్లు ఆపిల్ కంపెనీ విశ్లేషకులు మింగ్ చీ క్యూ సూత్రప్రాయంగా మీడియాకు తెలియజేశారు. ఐపోడ్, మ్యాక్‌బుక్ ప్రోలలో ఆరు సన్నటి మోడళ్లు 2020 సంవత్సరానికి మార్కెట్‌లోకి వస్తాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు మందంగా 0.29 అంగుళాల మోడళ్లలో ఓ ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించగా, మందం తక్కువ సన్నటి మోడళ్లలో స్క్రీన్ డిస్ ప్లే కోసం చిన్న ఎల్‌ఈడీ లైట్లను, సన్నటి పిక్చల్స్‌ను ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. ఆరు సన్నటి మోడళ్లు వచ్చే ఏడాది ఏ నెలలో మార్కెట్‌లోకి వస్తాయో, వాటి ధర ఎంత ఉండవచ్చో మింగ్ చీ క్యూ వెల్లడించలేదు. సన్నటి మోడళ్లలో 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోను రూపొందిస్తున్నట్లు మార్కెట్ వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment