ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ బంపరాఫర్‌ను ప్రకటించింది. యూజర్లకు ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఎయిర్ పాడ్స్‌ను ఫ్రీగా పొందాలంటే యాపిల్ నిబంధనల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
యాపిల్ మార్చి 7,2022 వరకు 'బ్యాక్ టూ యూనివర్సిటీ' ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్ధులు, టీచర్లకు ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. ఇందుకోసం యూజర్లు మాక్, ఐపాడ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందనే షరతు విధించింది.
ఈ ఆఫర్ యాపిల్ ప్రొడక్ట్ లైన మాక్‌బుక్ ఎయిర్, మాక్ బుక్ ప్రో, ఐమాక్, మాక్ మిని, ఐమాక్ ప్రో, ఐపాడ్ ప్రో, ఐ పాడ్ ఎయిర్‌ను కొనుగోలు చేస్తే యాపిల్‌కు చెందిన సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు. అదే ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా పొందిన యూజర్లు థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్, ఎయిర్ పాడ్స్ ప్రో కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చని తెలిపింది. కాకపోతే న్యూజనరేషన్ ఆడియో ప్రొడక్ట్‌లకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఆఫర్ ఏఏ దేశాల్లో ఉందంటే?
ప్రస్తుతం మాక్, ఐపాడ్ కొన్న యూజర్లకు యాపిల్ అందిస్తున్న ఈ ఫ్రీ ఆఫర్ ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, బ్రెజిల్, సౌత్ కొరియాతో పాటు భారత్‌లో సైతం అందుబాటులో ఉంది. కానీ యాపిల్ అఫీషియల్ సైట్‌లో మాత్రం "సేవ్ ఆన్ ఏ న్యూ మాక్ ఆర్ ఐపాడ్ విత్ యాపిల్ ఎడ్యుకేషన్ ప్రైసింగ్" అని చూపిస్తుంది. కాబట్టి డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదనంగా యాపిల్ 'యాపిల్ కేర్ ప్లస్' ప్రొటెక్షన్ ప్లాన్‌లపై 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది.
యూజర్లు ముందుగా ఈ ఆఫర్ పొందేందుకు మాక్, ఐపాడ్ ఉత్పత్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఉచితంగా పొందే ఎయిర్ పాడ్స్ అప్‌డేట్ అవుతాయి. యాపిల్ అధికారిక సైట్ ప్రకారం..ఈ ఆఫర్ ప్రస్తుతం, లేదంటే కొత్తగా ఆమోదించిన యూనివర్సిటీ విద్యార్ధులకు,లెక్చరర్స్‌కు, విద్యార్ధుల తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటుంది. మీరు ముందుగా సైన్ అప్ చేసి unidasyలో నమోదు ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ జరుగుతుందని గుర్తించాలి.
చదవండి: సంచలనం..! ఛార్జర్ అవసరంలేదు, ఫోన్‌డిస్‌ప్లేతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment