mac
-
జూమ్ యూజర్లకు అలర్ట్..!
కరోనా రాకతో ఉద్యోగులు, విద్యార్థులు పూర్తిగా ప్రముఖ వీడియో మీటింగ్ యాప్లికేషన్ జూమ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. తాజాగా జూమ్ ప్లాట్‌ఫాంలో బగ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యాప్‌ను యూజ్ చేయనప్పుడు ఆటోమేటిక్‌గా జూమ్ రికార్డు చేస్తోన్నట్లు పలువురు యూజర్లు నివేదించారు. యాపిల్ మ్యాక్ వాడే వారిలో..! యాపిల్‌కు చెందిన మ్యాక్ ల్యాప్‌ట్యాప్స్‌లో ఈ సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్ మ్యాక్ ల్యాప్టాప్స్లోని జూమ్ యాప్‌లో బగ్ ఉన్నట్లు ఆయా యాపిల్ మ్యాక్ యూజర్లు నివేదిస్తున్నారు. యూజర్లు జూమ్ ఫ్లాట్‌ఫాంను ఉపయోగించని సమయంలో కూడా జూమ్ యాప్ మైక్రోఫోన్‌ను, వీడియోను ఆన్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా యాపిల్ మ్యాక్ యూజర్లు ఆందోళనకు గురవుతున్నారు. కాగా పలుమార్లు ఈ సమస్యపై ఫిర్యాదు రావడంతో సమస్యను పరిష్కరించడానికి జూమ్ గత ఏడాది డిసెంబర్లోనే వెర్షన్ 5.91.(3506) అప్డేట్ను విడుదల చేసింది. కాగా తాజా అప్డేట్ సమస్యను పరిష్కరించలేదు. ఈ సమస్య తిరిగి ఆయా యాపిల్ మ్యాక్ యూజర్లకు వచ్చినట్లు తెలుస్తోంది. మైక్రోఫోన్, వీడియో ఆన్‌లో ఉన్నప్పుడు యాపిల్ మ్యాక్ తన యూజర్లను అలర్ట్ చేస్తోంది. కాగా ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని జూమ్ తెలిపింది. చదవండి: గూగుల్ అనూహ్య నిర్ణయం..! ఆ సేవలు పూర్తిగా షట్‌డౌన్..! -
బంపరాఫర్..! ఉచితంగా యాపిల్ ఎయిర్ పాడ్స్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ బంపరాఫర్‌ను ప్రకటించింది. యూజర్లకు ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఎయిర్ పాడ్స్‌ను ఫ్రీగా పొందాలంటే యాపిల్ నిబంధనల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యాపిల్ మార్చి 7,2022 వరకు 'బ్యాక్ టూ యూనివర్సిటీ' ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్ధులు, టీచర్లకు ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. ఇందుకోసం యూజర్లు మాక్, ఐపాడ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందనే షరతు విధించింది. ఈ ఆఫర్ యాపిల్ ప్రొడక్ట్ లైన మాక్‌బుక్ ఎయిర్, మాక్ బుక్ ప్రో, ఐమాక్, మాక్ మిని, ఐమాక్ ప్రో, ఐపాడ్ ప్రో, ఐ పాడ్ ఎయిర్‌ను కొనుగోలు చేస్తే యాపిల్‌కు చెందిన సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు. అదే ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా పొందిన యూజర్లు థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్, ఎయిర్ పాడ్స్ ప్రో కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చని తెలిపింది. కాకపోతే న్యూజనరేషన్ ఆడియో ప్రొడక్ట్‌లకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆఫర్ ఏఏ దేశాల్లో ఉందంటే? ప్రస్తుతం మాక్, ఐపాడ్ కొన్న యూజర్లకు యాపిల్ అందిస్తున్న ఈ ఫ్రీ ఆఫర్ ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, బ్రెజిల్, సౌత్ కొరియాతో పాటు భారత్‌లో సైతం అందుబాటులో ఉంది. కానీ యాపిల్ అఫీషియల్ సైట్లో మాత్రం "సేవ్ ఆన్ ఏ న్యూ మాక్ ఆర్ ఐపాడ్ విత్ యాపిల్ ఎడ్యుకేషన్ ప్రైసింగ్" అని చూపిస్తుంది. కాబట్టి డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదనంగా యాపిల్ 'యాపిల్ కేర్ ప్లస్' ప్రొటెక్షన్ ప్లాన్లపై 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. యూజర్లు ముందుగా ఈ ఆఫర్ పొందేందుకు మాక్, ఐపాడ్ ఉత్పత్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఉచితంగా పొందే ఎయిర్ పాడ్స్ అప్డేట్ అవుతాయి. యాపిల్ అధికారిక సైట్ ప్రకారం..ఈ ఆఫర్ ప్రస్తుతం, లేదంటే కొత్తగా ఆమోదించిన యూనివర్సిటీ విద్యార్ధులకు,లెక్చరర్స్‌కు, విద్యార్ధుల తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటుంది. మీరు ముందుగా సైన్ అప్ చేసి unidasyలో నమోదు ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ జరుగుతుందని గుర్తించాలి. చదవండి: సంచలనం..! ఛార్జర్ అవసరంలేదు, ఫోన్‌డిస్‌ప్లేతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు! -
ఐఫోన్ యూజర్లకు శుభవార్త..!
భారత ఐఫోన్ యూజర్లకు ఆపిల్ శుభవార్తను అందించింది. ఐఫోన్ యూజర్లకు యాప్ స్టోర్ కొనుగోలులో భాగంగా మూడు కొత్త చెల్లింపు మోడ్‌లను ఆపిల్ ప్రవేశపెట్టింది. యూపీఐ, రూపే, నెట్ బ్యాంకింగ్ పేమెంట్స్ ఆప్షన్లను ఆపిల్ తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. గతంలో కేవలం క్రెడిట్, డెబిట్ కార్డులతో యాప్ స్టోర్, ఐట్యూన్స్‌లో చెల్లింపులు జరపడానికి వీలు ఉండేది. తాజాగా ఆపిల్ తీసుకున్న నిర్ణయంతో యూపీఐ, రూపే, నెట్ బ్యాంకింగ్ పేమెంట్స్ ఉపయోగించి చెల్లింపులు జరపవచ్చును. దీంతో అధిక సంఖ్యలో ఆపిల్ యూజర్లకు లాభం జరగనుంది. ఐట్యూన్స్‌లో పాటలను కొనుగోలు చేయడానికి యూజర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. టెక్ దిగ్గజం కుపెర్టినో యాప్ స్టోర్ యూజర్లకు ఈ విషయాన్ని నోటిఫికేషన్ల ద్వారా తెలిపింది. అయితే ఈ సేవలు అప్డేట్ చేసిన ఐవోస్, ఐప్యాడ్, మాక్ఓఏస్ లో వస్తుందని ఆపిల్ ఒక ప్రకటనలో పేర్కొంది. మీ ఐఫోన్, ఐపాడ్లో కొత్త పేమెంట్ అప్షన్లను ఇలా యాడ్ చేయండి..! మీ ఐఫోన్, ఐపాడ్‌లోని సెట్టింగ్ ఆప్షన్‌ను ఎంచుకోండి. తరువాత ఆపిల్ ఐడీపై ట్యాప్ చేయండి. తరువాత పేమెంట్ అండ్ షిప్పింగ్ ఆప్షన్‌పై ట్యాప్ చేయండి. మరోసారి మిమ్మిల్సి సైన్ ఇన్ అవ్వమని అడుగుతోంది. కొత్త పేమెంట్ విధానాన్ని యాడ్ చేసేందుకు యాడ్ పేమెంట్ మేథడ్ను సెలక్ట్ చేసుకోండి. యూపీఐ, రూపే, నెట్‌బ్యాంకింగ్ వివరాలను యాడ్ చేసేందుకు చూపించే స్టెప్స్‌ను ఫాలో అవ్వండి. అవసరమైతే పేమెంట్ మేథడ్ను పునర్వ్యవస్థీకరించడానికి, తీసివేయడానికి ఎగువ కుడి మూలలో ఉన్న ఎడిట్పై క్లిక్ చేయండి. యూజర్లు ఆపిల్ ఐడీ నుపయోగించి మల్టీపుల్ పేమెంట్ విధానాలతో చెల్లింపులు జరపవచ్చును. -
అగ్గిరాజుకుంటే ఆగమే, ఆపిల్,విండోస్‌పై కేంద్రం హెచ్చరిక
విండోస్, ఆపిల్ కొత్త వెర్షన్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరికులు జారీ చేసింది. పెగాసెస్‌తో సైబర్ అగ్గిరాజుకుంటే ఆగమేనని భావించిన కేంద్రం సైబర్ దాడులు జరిగే ఓఎస్‌లను గుర్తించి.. వాటి వినియోగంలో జాగ్రత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర టెక్నాలజీ విభాగానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)విండోస్,ఆపిల్ ఐఫోన్,యాపిల్ ఐప్యాడ్, మాక్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరస్తులు ప్రైవేట్, ప్రభుత్వరంగానికి చెందిన సంబంధిత శాఖల రహస్యాల్ని సేకరించేందుకు టార్గెటెడ్ కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లను 'కోడ్ ఎగ్జిక్యూషన్' సాయంతో దాడి చేస్తారని,ఆ సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేలా అలర్ట్‌గా ఉండాలని స్పష్టం చేసింది. విండోస్ వినియోగదారులు,యాపిల్ కొత్త వెర్షన్లను ఆపరేట్ చేసే వినియోగదారులు మితిమీరిన అనుమతుల కారణంగా యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్‌లో ఉన్న ఫైళ్లు,డేటా బేస్‌తో పాటు సెక్యూరిటీ అకౌంట్స్ మేనేజర్ (SAM) లు భద్రతలోపం తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. ఆ లోపం కారణంగా పాస్వర్డ్ లను గుర్తించి సిస్టమ్ డ్రైవ్‌లను దొంగిలించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 వెర్షన్ 1809 32-బిట్ సిస్టమ్స్, ARM64- ప్రాసెసర్, x64- ప్రాసెసర్ విండోస్ 10 వెర్షన్ 1909 32-బిట్ సిస్టమ్స్, ARM64- ప్రాసెసర్, x64- ప్రాసెసర్ విండోస్ 10 వెర్షన్ 2004 32-బిట్ సిస్టమ్స్, ARM64- ప్రాసెసర్ x64- ప్రాసెసర్ విండోస్ 10 వెర్షన్ 20 హెచ్ 2 32-బిట్ సిస్టమ్స్, ARM64- ప్రాసెసర్ x64- ప్రాసెసర్ విండోస్ 10 వెర్షన్ 21H1 32-బిట్ సిస్టమ్స్, ARM64 -ప్రాసెసర్ x64- ప్రాసెసర్ విండోస్ సర్వర్ 2019 విండోస్ సర్వర్ 2019 (సర్వర్ కోర్ ఇన్స్టాలేషన్) విండోస్ సర్వర్, వెర్షన్ 2004 (సర్వర్ కోర్ ఇన్స్టాలేషన్)ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఆపిల్ సాఫ్ట్వేర్ ఆపిల్ మాకోస్ బిగ్ సుర్ వెర్షన్లు 1 ఆపిల్ iOS 14.7.1, ఐప్యాడ్ వెర్షన్లు ఐఫోన్ 6 తరువాత విడుదలై ఐఫోన్ 6వెర్షన్లు ఐప్యాడ్ ప్రో (డివైజెస్) ఐప్యాడ్ ఎయిర్ 2 తో పాటు వాటి వెర్షన్లు ఐప్యాడ్ 5 తో పాటు వాటి వెర్షన్లు ఐప్యాడ్ మినీ 4 తో పాటు వాటి వెర్షన్లు ఐపాడ్ టచ్ (7 వ తరం) మాక్ ఓస్ బిగ్ సుర్ వెర్షన్లను అప్ డేట్ చేయాలని కోరింది. -
2021లో రానున్న ఆపిల్ ఎమ్2 ప్రాసెసర్
ఆపిల్ కంపెనీ ఇటీవలే సిలికాన్ ఎమ్1 ప్రాసెసర్‌తో మూడు మ్యాక్ కంప్యూటర్లను విడుదల చేసింది. దీంతో సంప్రదాయ ఇంటెల్ ప్రాసెసర్లకు స్వస్తి పలికింది. ఆపిల్ కంపెనీ మాక్ కోసం కొత్తగా సిలికాన్ ఎమ్1 ప్రాసెసర్ లను రూపొందించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 2021లో రాబోయే కొత్త 13-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో,16-అంగుళాల మాక్‌బుక్ ప్రోలో సిలికాన్ ఎమ్2 ప్రాసెసర్ ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఎమ్1 ప్రాసెసర్‌తో వచ్చిన కొత్త ల్యాప్‌టాప్‌లు పనితీరు, బ్యాటరీ విషయంలో ఇతర ల్యాప్‌టాప్‌ల కంటే మెరుగైన పనితీరును ప్రదర్శించాయి అని టెక్ నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంస్థ త్వరలో కొత్త మాక్‌బుక్ మరియు ఐమాక్ పరికరాలలో కొత్త ఆపిల్ సిలికాన్ ఎమ్2 ప్రాసెసర్‌తో తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆపిల్ 2021లో కొత్త డిజైన్‌తో మ్యాక్‌బుక్ ప్రొ మోడల్స్‌ని విడుదల చేయనుందట. అలానే 2022లో మిని-ఎల్ఈడీ డిస్ప్లేతో మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రొ, మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్‌లను యాపిల్ విడుదల చేస్తుందని సమాచారం. ఎఆర్ఎం ఎమ్1 చిప్ 5నానోమీటర్ పై బిల్డ్ చేయబడింది. కొత్త ఎమ్2 ప్రాసెసర్ ఎమ్1 ప్రాసెసర్ కు కొనసాగింపుగా రాబోతుంది. ఎమ్1 చిప్ లో శక్తివంతమైన 8-కోర్ సీపీయూ ఉంది. ఈ చిప్ మునుపటి తరం ప్రాసెసర్ల కంటే 3.5x వేగంగా మరియు 5x వేగవంతమైన జీపీయు పనితీరును ప్రదర్శిస్తుంది. ఆపిల్ సిలికాన్ ఎం1 చిప్సెట్లు న్యూరల్ ఇంజిన్ వంటి టెక్నాలజీ సహాయంతో రూపొందించబడ్డాయి. -
మేకా కొమ్ముకాస్తున్న అధికారులు ?
నరసాపురం: వేములదీవి మ్యాక్ సొసైటీ పరిధిలోని రైతులను 25 ఏళ్లుగా మోసం చేస్తూ ప్రభుత్వం సంక్షేమం రూపంలో ఇచ్చే సొమ్మును కాజేస్తూ కోట్ల కుంభకోణానికి పాల్పడిన అక్రమార్కులపై విచారణ కొనసాగుతోంది. తాజాగా సోమవారం గ్రామంలోని సొసైటీ కార్యాలయానికి విచారణ అధికారిగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా సహకారశాఖ డీఆర్ (కాకినాడ) కె.కృష్ణశృతి, విచారణ అధికారుల బృందంలోని కృష్ణకాంత్, లక్ష్మీశ్రీలతలతో కలిసి విచారణ జరిపేందుకు వచ్చారు. మొత్తం 138 మంది రైతులకు నోటీసులు ఇచ్చి సెక్షన్ 29 ప్రకారం విచారణ చేపట్టారు. అయితే విచారణలోనూ సొసైటీ అధ్యక్షుడు మేకా సత్యనారాయణ మాయాజాలం కనిపిస్తోంది. (‘మేకా’ వన్నె పులి) కేవలం రైతులు మాత్రమే విచారణకు రావాల్సి ఉండగా, సొసైటీ అధ్యక్షుడు మేకా సత్యనారాయణ కూడా ఉదయమే కార్యాలయానికి వచ్చి కూర్చున్నారు. దీంతో రైతులు భయపడి విచారణకు హాజరుకాలేదు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్, ఫిర్యాదుదారుడు పెన్మెత్స సుబ్బరాజు విచారణ అధికారులను నిలదీశారు. విచారణ జరుగుతున్న సమయంలో అభియోగాలు ఎదుర్కొంటున్న సొసైటీ అధ్యక్షుడు ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. అయితే దీనికి అధికారులు సరైన సమాధానం చెప్పలేదని సుబ్బరాజు ఆరోపించారు. గొడవ పెద్దదవుతున్న విషయాన్ని గమనించి మేకా సత్యనారాయణ అక్కడి నుంచి కొంతసేపటి తరువాత జారుకున్నారు. మొత్తంగా విచారణకు రైతులు ఎవరూ హాజరుకాలేదు. మేకా కొమ్ముకాస్తున్న అధికారులు ? ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు, సొసైటీ ఉద్యోగికి మరణానంతరం జీతాలు చెల్లించినట్లు చూపించడం, హమాలీ చార్జీల రూపంలో డమ్మీ వ్యక్తికి రూ.20 లక్షలు చెల్లింపు, మరో ఉద్యోగి పెద్ద మొత్తంలో సొసైటీ నిధులు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించనట్లు చేయడం, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందకుండా రైతులను నష్ట పోయేలా చేయడం, ఏటా లాభాలు ఆర్జిస్తున్నా సంఘ సభ్యులకు డివిడెండ్‌ను పంచకపోవడం తదితర ఆరోపణలతో కూడిన ఫిర్యాదును రైతులు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా విచారణ జరుగుతోంది. గతంలో అనేక ఫిర్యాదులు చేసినా కూడా టీడీపీ పెద్దల సహకారంతో మేకా వాటిని బయటకు రానివ్వలేదు. ప్రస్తుతం జరుగుతున్న విచారణ కూడా మేకా తనకున్న పలుకుబడితో పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోప్యంగా ఉంచాల్సిన విచారణ వివరాలను సహకారశాఖ అధికారులు మేకా సత్యనారాయణకు కొమ్ముకాస్తూ అతనికి సమాచారం ఇస్తున్నారని, అతను గతంలో మాదిరిగానే రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం రైతుల వద్దకు నేరుగా వెళ్లి విచారించాల్సిన అధికారులు సొసైటీ కార్యాలయానికి రైతులను పిలిచి, మళ్లీ అక్కడకు సొసైటీ అధ్యక్షుడు మేకా సత్యనారాయణ వచ్చి తిష్టవేసినా పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై మళ్లీ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తామని మాజీ సర్పంచ్ సుబ్బరాజు చెప్పారు. దీనిపై విచారణ అధికారి కె.కృష్ణశృతి వివరణ ఇస్తూ సొసైటీ అధ్యక్షుడు ఉదయం వచ్చి తనను కలిసి వెళ్లారని అంతకు మించి ఏమీ లేదని పేర్కొన్నారు. విచారణ సవ్యంగానే సాగుతోందని, తుది దశలో ఉందని చెప్పారు. ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించిన ఈ వ్యవహారంలో అధికారుల తప్పులు బయటపడితే వారు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. -
C/o కేజీహెచ్!
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు (మ్యాక్‌లు) రోగులకు నామమాత్రపు సేవలే అందిస్తున్నాయి. గతంలో అర్బన్ డిస్పెన్సరీలుగా ఉండే వీటిని తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మ్యాక్లుగా మార్పు చేశారు. విశాఖ నగరంతో పాటు అనకాపల్లి, భీమిలిలోనూ వెరసి 24 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇవి ఉదయం 8 నుంచి 12, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఈ ఆస్పత్రుల్లో డెంగ్యూ, మలేరియా, రక్తపోటు, మధుమేహం, కామెర్లు, హిమగ్లోబిన్, సీరం క్రియాటినిన్, లిపిడ్ ప్రొఫైల్, హెచ్ఐవీ తదితర 32 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ వీటిపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో ఈ కేంద్రాల సేవలను చాలా మంది వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో ఈ కేంద్రాలు ప్రాథమిక వైద్యానికే పరిమితమవుతున్నాయి. వాస్తవానికి మూడు నెలలుగా విశాఖ జిల్లా, నగరంలోనూ డెంగ్యూ జ్వరాలు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. వేల సంఖ్యలో డెంగ్యూ కేసులు నిర్ధరణ అవుతున్నాయి. ఒక్క కేజీహెచ్‌లోనే ఈ సీజనులో 8,400 మంది డెంగ్యూ అనుమానిత రోగులకు రక్త పరీక్షలు నిర్వహించారు. వీరిలో సుమారు 2,800 మందికి డెంగ్యూగా నిర్ధరణ చేశారు. గడచిన మూడు నెలలుగా ఈ 24 ఆరోగ్య కేంద్రాల్లో కేవలం 500 మంది మాత్రమే డెంగ్యూ పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 25 మందికి డెంగ్యూగా నిర్ధరణ అయింది. అంటే కేజీహెచ్‌కు వెళ్లే డెంగ్యూ రోగులతో పోల్చుకుంటే 6 శాతం మందికి మించడం లేదు. అంతేకాదు.. ఈ ఆస్పత్రుల్లో ప్రాథమిక వైద్యమే అందుతోంది. గతంలో డిస్పెన్సరీల్లో అవసరమైన రోగులకు సెలైన్లు ఎక్కించే వారు. మ్యాక్‌ల్లో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం ఒక్కో మ్యాక్‌లో ఒక ఎంబీబీఎస్ వైద్యుడు, ఒక ల్యాబ్ అసిస్టెంట్, ఒక ఫార్మసిస్టు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక ఆయా విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సదుపాయాలపై జనంలో అవగాహన కల్పించడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు. అక్కడ ఏఏ వైద్య సదుపాయాలున్నాయో కూడా చాలా మందికి తెలియడం లేదు. ఈ కేంద్రాల్లో సిబ్బంది కొరత కూడా వేధిస్తుండడంతో వచ్చే రోగులకు అరకొర సిబ్బంది పూర్తిస్థాయిలో వైద్యం అందించలేకపోతున్నారు. దీంతో అక్కడ తగినంత వైద్యం అందదన్న భావనతో పలువురు కేజీహెచ్‌కు వెళ్లిపోతున్నారు. దీంతో కేజీహెచ్‌పై రోగుల తాకిడి అధికమవుతోంది. అక్కడ వైద్యులకూ భారంగా పరిణమిస్తోంది. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలకు జవసత్వాలు కల్పిస్తే మరింత మంది పేదలకు ఉచిత వైద్యం అందించే వీలుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
జీఎస్టీ ఎఫెక్ట్: ఐ ఫోన్, ఐ ప్యాడ్ ధరల్లో కోత
న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నేటి(జూలై 1) నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో యాపిల్ సంస్థ తన ఉత్పత్తుల ధరలను ఇండియాలో గణనీయంగా తగ్గించింది. ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్ లపై గరిష్ట రిటైల్ ధరల్లో తగ్గింపును ప్రకటించింది. దాదాపు7.5 శాతం ధరలను తగ్గించి భారతీయులకు జీఎస్టీ గిఫ్ట్ అందించింది. కొన్ని మినహాయింపులతో మాక్ లైన్ కంప్యూటర్లను తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. భారతదేశంలో ఐఫోన్ ధరలు ఎలా మారాయో ఇక్కడ చూడండి ఐఫోన్ ఎస్ ఈ 32 జీబీ అసలు ధరరూ. 27,200 ప్రస్తుత ధర రూ. 26,000 128 జీబీ అసలు ధర రూ. 37,200 ప్రస్తుత ధర రూ. 35,000 ఐఫోన్ 6ఎస్ 32 జీబీ అసలు ధర రూ. 50 వేలు, ప్రస్తుత ధర రూ. 46, 900 128 జీబీ అసలు ధర రూ. 60 వేలు ప్రస్తుత ధర రూ. 55,900 ఐఫోన్ 6 ఎస్ ప్లస్ 32 జీబీ అసలు ధర రూ. 60 వేలు, ప్రస్తుత ధర రూ. 56, 100 128 జీబీ అసలు ధర రూ. 70 వేలు ప్రస్తుత ధర రూ. 65వేలు ఐఫోన్ 7 32 జీబీ అసలు ధర రూ. 60 వేలు, ప్రస్తుత ధర రూ. 56, 200 128 జీబీ అసలు ధర రూ. 70 వేలు ప్రస్తుత ధర రూ. 65,200 256 జీబీ అసలు ధర రూ. 80 వేలు ప్రస్తుత ధర రూ.74,400 ఐఫోన్ 7 ప్లస్ 32 జీబీ అసలు ధర రూ. 72వేలు, ప్రస్తుత ధర రూ. 67, 300 128 జీబీ అసలు ధర రూ. 82 వేలు ప్రస్తుత ధర రూ. 76,200 256 జీబీ అసలు ధర రూ. 92 వేలు ప్రస్తుత ధర రూ.85,400 -
యూకే వీసా పాలసీలో మార్పులు
లండన్: పెరిగిపోతున్న వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం వీసా పాలసీలో మార్పులు చేసింది. యూరోపియన్ యూనియన్(ఈయూ)కు చెందని దేశాల పౌరులకు వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. యూకే సర్కారు తాజా నిర్ణయంతో భారతదేశానికి చెందిన ఐటీ రంగ నిఫుణులపై ఎక్కువగా ప్రభావం పడనుంది. యునెటైడ్ కింగ్డమ్ హోం ఆఫీస్ ప్రకటించిన కొత్త వీసా నిబంధనల ప్రకారం.. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్సఫర్(ఐసీటీ) కేటగిరీ కింద నవంబర్ 24 తర్వాత వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి కనీస వార్షిక వేతనం 30,000 పౌండ్లు ఉండాలి. ఇప్పటి వరకూ ఇది 20,800 పౌండ్లుగా ఉంది. బ్రిటన్‌లోని భారత ఐటీ కంపెనీలు ఈ ఐసీటీ కేటగిరీనే ఎక్కువగా వినియోగించుకుంటున్నాయని, సుమారు 90 శాతం మంది భారత ఐటీ నిఫుణులు ఐసీటీ కిందే వీసా పొందారని యూకే మైగ్రేషన్ అడ్వయికమిటీ(ఎంఏసీ) ఇటీవల వెల్లడించింది. బ్రిటన్ ప్రధాని థెరెసా మే మూడు రోజుల పర్యటనకు ఆదివారం భారత్‌కు రానున్న నేపథ్యంలో వీసా మార్పుల ప్రకటన రావడం గమనార్హం. టైర్ 2 వీసా జారీకి సంబంధించి ఎంఏసీ సూచనల మేరకు మార్చిలో రెండు దశల మార్పులను యూకే ప్రభుత్వం ప్రారంభించింది. టైర్ 2 ఐసీటీతో పాటు ఇతర విభాగాల్లో కూడా వేతన పరిమితిని పెంచింది బ్రిటన్ ప్రభుత్వం. టైర్ 2(జనరల్) ఉద్యోగులకు కొన్ని మినహాయింపులతో 25,000 పౌండ్లు వేతనం ఉండాలని నిర్దేశించారు. ఇక ట్రైనీలుగా వచ్చే టైర్ 2(ఐసీటీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితి 23,000 పౌండ్లుగా నిర్ణరుుంచారు. దీంతోపాటు ఒక్కో కంపెనీ ఏటా 20 మందిని మాత్రమే ఇలా తీసుకురావాలని నిబంధన విధించారు. టైర్ 4 కేటగిరీలోనూ పలు మార్పులు చేశారు.