techers
-
బంపరాఫర్..! ఉచితంగా యాపిల్ ఎయిర్ పాడ్స్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ బంపరాఫర్‌ను ప్రకటించింది. యూజర్లకు ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఎయిర్ పాడ్స్‌ను ఫ్రీగా పొందాలంటే యాపిల్ నిబంధనల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యాపిల్ మార్చి 7,2022 వరకు 'బ్యాక్ టూ యూనివర్సిటీ' ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్ధులు, టీచర్లకు ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. ఇందుకోసం యూజర్లు మాక్, ఐపాడ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందనే షరతు విధించింది. ఈ ఆఫర్ యాపిల్ ప్రొడక్ట్ లైన మాక్‌బుక్ ఎయిర్, మాక్ బుక్ ప్రో, ఐమాక్, మాక్ మిని, ఐమాక్ ప్రో, ఐపాడ్ ప్రో, ఐ పాడ్ ఎయిర్‌ను కొనుగోలు చేస్తే యాపిల్‌కు చెందిన సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు. అదే ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా పొందిన యూజర్లు థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్, ఎయిర్ పాడ్స్ ప్రో కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చని తెలిపింది. కాకపోతే న్యూజనరేషన్ ఆడియో ప్రొడక్ట్‌లకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆఫర్ ఏఏ దేశాల్లో ఉందంటే? ప్రస్తుతం మాక్, ఐపాడ్ కొన్న యూజర్లకు యాపిల్ అందిస్తున్న ఈ ఫ్రీ ఆఫర్ ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, బ్రెజిల్, సౌత్ కొరియాతో పాటు భారత్‌లో సైతం అందుబాటులో ఉంది. కానీ యాపిల్ అఫీషియల్ సైట్లో మాత్రం "సేవ్ ఆన్ ఏ న్యూ మాక్ ఆర్ ఐపాడ్ విత్ యాపిల్ ఎడ్యుకేషన్ ప్రైసింగ్" అని చూపిస్తుంది. కాబట్టి డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదనంగా యాపిల్ 'యాపిల్ కేర్ ప్లస్' ప్రొటెక్షన్ ప్లాన్లపై 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. యూజర్లు ముందుగా ఈ ఆఫర్ పొందేందుకు మాక్, ఐపాడ్ ఉత్పత్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఉచితంగా పొందే ఎయిర్ పాడ్స్ అప్డేట్ అవుతాయి. యాపిల్ అధికారిక సైట్ ప్రకారం..ఈ ఆఫర్ ప్రస్తుతం, లేదంటే కొత్తగా ఆమోదించిన యూనివర్సిటీ విద్యార్ధులకు,లెక్చరర్స్‌కు, విద్యార్ధుల తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటుంది. మీరు ముందుగా సైన్ అప్ చేసి unidasyలో నమోదు ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ జరుగుతుందని గుర్తించాలి. చదవండి: సంచలనం..! ఛార్జర్ అవసరంలేదు, ఫోన్‌డిస్‌ప్లేతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు! -
పాకిస్తాన్ ఆంక్షలు...నో జీన్స్ అండ్ టైట్స్
ఇస్లామాబాద్: కొన్ని ఇస్లామిక్ దేశాల్లో మహిళా వస్త్రధారణ పై ఆంక్షలు విధించడం సాధారణం. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు కూడా కో ఎడ్యుకేషన్ నిషేధిస్తూ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసింది. తాజాగా పాకిస్తాన్ కూడా అదే తరహలో ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఫెడరల్ డైరక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎఫ్‌డీఈ) మహిళా ఉపాధ్యాయులను టైట్స్, జీన్స్ ,పురుష ఉపాధ్యాయులను జీన్స్, టీ షర్ట్స్ ధరించకూడదంటూ ఆంక్షలు జారీ చేసింది. అంతేకాదు మహిళలు/పురుష ఉపాధ్యాయులు ఎలాంటి దుస్తులు ధరించాలో ఎఫ్‌డీఈ నిర్ణయించింది. పాకిస్తాన్లో అన్ని విద్యాసంస్థలలోని బోధన/బోధనేతర సిబ్బంది వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ తాము సూచించిన నియమాలను పాటించేలా చూడాల్సిందిగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. -
విద్యాశాఖలో పదోన్నతుల సందడి
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యాశాఖలో పదోన్నతుల పర్వానికి ప్రభుత్వం తెర తీసింది. ఇటీవల పదవీ విరమణ చేసిన, ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు నడుం బిగిం చింది. ఇలా జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఏర్పడిన మొత్తం 89 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. ఇందు కోసం సెకండరీ గేడ్ టీచర్లు (ఎస్జీటీ), తత్సమానమైన ఉపాధ్యాయ కేడర్ వారి ధ్రువపత్రాల పరిశీలనకు ముహూర్తం ఖరారు చేశారు. సీనియారిటీ జాబితా సిద్ధం... జిల్లాలో పదోన్నతులకు అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్ల సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖాధికారులు సిద్ధం చేశారు. డీఈఓ వెబ్సైట్లో సీనియారిటీ జాబితాను అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పదోన్నతులకు సంబం ధించి ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు.. ఆ తరువాత పర్వానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నారు. నేడు సర్టిఫికెట్ల పరిశీలన.. అర్హత కలిగి, సీనియారిటీ జాబితాలో ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), తత్సమానమైన కేడర్ ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈనెల 17వ తేదీన నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో శనివారం ఉదయం 10 గంటల నుంచి ప్రక్రియ మొదలు కానుంది. సర్వీస్ రిజిస్టర్, ఇతర ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇది వరకే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన ఉపాధ్యాయులు రావాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. అన్నీ అనుకూలించి.. జిల్లా కలెక్టర్ జె.నివాస్ పదోన్నతుల పర్వానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈనెల 22వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సీనియారిటీ జాబితాను సిద్ధం చేశాం.. ఇటీవలి పదవీవిరమణ చేసి, పదోన్నతులు పొందిన స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను అర్హులైన ఎస్జీటీలు, తత్సమాన కేడర్ కలిగిన ఉపాధ్యాయులతో పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీనియారిటీ జాబితాను సిద్ధం చేశాం. నేడు సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతున్నారు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – కె.చంద్రకళ, జిల్లా విద్యాఖాధికారి -
కొత్త సార్లొస్తున్నారు..
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు రానున్నారు. పెండింగ్‌లో ఉన్న టీఆర్టీ(టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) పోస్టులను భర్తీ చేసేందుకు రెండు రోజుల క్రితం జీఓ రాగా, అనంతరం షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటివరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్లతో నెట్టుకురాగా.. ఆయా పోస్టుల్లో కొత్త టీచర్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో 130 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో టీఆర్టీ ప్రకటన చేసింది. 2018 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించింది. అదే ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి.. విడతలవారీగా సెప్టెంబర్ 2018, ఏప్రిల్ 2019లో జాబితా విడుదల చేసింది. అయితే టీఆర్టీ నియామకాలపై మార్గదర్శకాలు జారీ చేసి.. అభ్యర్థుల ఎంపిక చేపట్టకపోవడంతో దాదాపు 20 నెలలపాటు అభ్యర్థులు నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం నియామక పత్రాలపై జీఓను విడుదల చేయడంతో త్వరలోనే అభ్యర్థులు టీచర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు.. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి జిల్లాకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్.. కార్యదర్శిగా డీఈఓ మదన్మోహన్ వ్యవహరించనున్నారు. పలువురు జిల్లాస్థాయి అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. పాఠశాల విద్యాశాఖ టీఆర్టీ జాబితాను ఇప్పటికే జిల్లా కమిటీకి సమర్పించింది. రోస్టర్, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో జిల్లా కమిటీలు తమ పరిధిలోని సబ్జెక్టులవారీగా ఖాళీలను గుర్తించి.. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ ఇలా.. టీఆర్టీ నియామకాలకు సంబంధించి షెడ్యూల్ ఇలా ఉంది. ఎంపికైన అభ్యర్థుల లిస్టును కేటగిరీ, మీడియంవారీగా ఈనెల 10న ప్రదర్శించనున్నారు. 11న జిల్లాస్థాయి కమిటీ సమావేశమై ఖాళీల పరిస్థితిని తెలుసుకొని కేటగిరీ, మీడియంలవారీగా ఖాళీలను వెల్లడిస్తారు. 13, 14వ తేదీన అభ్యర్థులకు కేటగిరీ, మీడియంవారీగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పోస్టింగ్ పొందిన కొత్త టీచర్లు ఈనెల 15న పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 17న జాయిన్ కానీ, రిపోర్టు చేయని అభ్యర్థుల వివరాలను గుర్తిస్తారు. 19న ఎంపికైన టీచర్లు జాయినింగ్ రిపోర్టును ఎంఈఓలు, హెచ్ఎంలకు అందజేయాలి. వేగవంతం చేస్తున్నాం.. టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పూర్వ ఖమ్మం జిల్లా నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశాల మేరకు త్వరలోనే నియామకాలు చేపట్టనున్నాం. మొత్తం 130 పోస్టులను భర్తీ చేయనున్నాం. – పి.మదన్మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి -
యూనియన్లతోనే సమస్యలు
రాయపర్తి : ఉపాధ్యాయ యూనియన్లతోనే తలనొప్పి వస్తుందని, యూనియన్లపై పెట్టే శ్రద్ధ బడిపై పెట్టి విద్యార్థుల సంఖ్యను పెంచి బలోపేతానికి కృషి చేయండని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో హెచ్ఎంతో విద్యావనరుల సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఉపాధ్యాయ సంఘం మూసివేసిన బడులను తెరిపించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా మీరు యూనియన్లని తిరిగి తలనొప్పి తెస్తున్నారన్నారు. ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకునే బా ధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజాప్రతిని ధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తుల సమన్వయంతోనే బడులను బలోపేతం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం లేకపోవడం మూలంగానే ప్రైవేట్‌కు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వ బడులలో మౌళిక వసతుల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. గదుల కొరతతో పాటు, త్రాగునీటి సమస్య తది తర అంశాలపై ఆయా పాఠశాలల హెచ్ఎం లతో చర్చించారు. పెండింగ్‌లో ఉన్న మధ్యా హ్న భోజన బిల్లులు రావడంలేదని ఓ హెచ్ఎం తెలపగా నిధులను విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎండీ ఉస్మా న్, ఎంపీపి గుగులోతు విజయ, జెడ్పిటీసీ వం గాల యాకమ్మ, తహసీల్ధార్ వాసం రామ్మూర్తి, ఎంపిడీఓ శంకరి, సర్పంచ్, ఎంపిటీసీలు, హెచ్ఎంలు, సీఆర్పీలు బందు నారాయణ, గారె కృష్ణమూర్తి, లింగారెడ్డి,అనుమాస్ వేణు, నగేష్, ప్రసాద్, సత్యనారాయణ, శోభారాణి, రమాదేవి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.