యూనియన్లతోనే సమస్యలు
Published Wed, Jul 27 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
రాయపర్తి : ఉపాధ్యాయ యూనియన్లతోనే తలనొప్పి వస్తుందని, యూనియన్లపై పెట్టే శ్రద్ధ బడిపై పెట్టి విద్యార్థుల సంఖ్యను పెంచి బలోపేతానికి కృషి చేయండని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో హెచ్‌ఎంతో విద్యావనరుల సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఉపాధ్యాయ సంఘం మూసివేసిన బడులను తెరిపించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా మీరు యూనియన్లని తిరిగి తలనొప్పి తెస్తున్నారన్నారు. ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకునే బా ధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజాప్రతిని ధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తుల సమన్వయంతోనే బడులను బలోపేతం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం లేకపోవడం మూలంగానే ప్రైవేట్‌కు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వ బడులలో మౌళిక వసతుల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. గదుల కొరతతో పాటు, త్రాగునీటి సమస్య తది తర అంశాలపై ఆయా పాఠశాలల హెచ్‌ఎం లతో చర్చించారు. పెండింగ్‌లో ఉన్న మధ్యా హ్న భోజన బిల్లులు రావడంలేదని ఓ హెచ్‌ఎం తెలపగా నిధులను విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎండీ ఉస్మా న్, ఎంపీపి గుగులోతు విజయ, జెడ్పిటీసీ వం గాల యాకమ్మ, తహసీల్ధార్ వాసం రామ్మూర్తి, ఎంపిడీఓ శంకరి, సర్పంచ్, ఎంపిటీసీలు, హెచ్‌ఎంలు, సీఆర్‌పీలు బందు నారాయణ, గారె కృష్ణమూర్తి, లింగారెడ్డి,అనుమాస్ వేణు, నగేష్, ప్రసాద్, సత్యనారాయణ, శోభారాణి, రమాదేవి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement