MLA ERRABELLI
-
ఒరిజినల్ టీడీపీ ఈడా లేదు.. ఆడా లేదు
ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు సర్వనాశనం చేసిండు: ఎర్రబెల్లి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా ఊపిరి పోసుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లేదని.. ఏపీ, తెలంగాణలో ఉన్నది అసలైన టీడీపీ కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు విమరర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు సహా ఆ పార్టీలో ఇప్పుడున్నవాళ్లంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లేననని ధ్వజమెత్ తారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుంటాయని కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి, టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి ఇస్తున్న సంకేతాలు టీడీపీ దుస్థితికి అద్దం పడుతున్నాయని ఎర్రబెల్లి అన్నారు. పార్టీని కాపాడుకునేందుకు ఆనాడు చంద్రబాబు వైపు నిలబడ్డామని.. కానీ తెలంగాణ వ్యతిరేక కుట్రలు, నీచపు రాజకీయాలతో టీడీపీని బాబు సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. బాబు తప్పుడు చేష్టలు చూడలేకే టీడీపీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలం కలసి టీటీడీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశామని ఎర్రబెల్లి చెప్పారు. -
సీఎం కేసీఆర్ కూలి పనికి ఏర్పాట్లు
అసెంబ్లీ లాబీల్లో తెలిపిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి సాక్షి, హైదరాబాద్: ‘గులాబీ కూలి దినాలు’లో భాగంగా అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాను కూలీ చేయడానికి పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ 16వ ఆవిర్భావ బహిరంగ సభ కోసం రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకుని కిందిస్థాయి కార్యకర్త దాకా కూలి పనిచేసి ఖర్చుల సొమ్ములు సంపాదించుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం విధితమే. దీనిలో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు కూలి పనుల ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కూడా కూలి పనిచేయడానికి పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరును ఎంచుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని, కూలి పనికి కూడా ఏర్పాట్లు చేశామని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆదివారం అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది వరికోతల సమయం కావడంతో వరికోసే పనిని చూశామని, అయితే ఈ పనికి రైతుల నుంచి ఏమీ తీసుకోబోమని అన్నారు. తొర్రూరు వ్యాపార వర్గాల నుంచి సీఎం కూలి పనికి డబ్బులు ఇప్పించే ఏర్పాట్లు జరిగినట్లు చెప్పారు. కనీసం రూ.20 లక్షల కూలీ సొమ్ము వచ్చేలా చూస్తున్నామన్నారు. కాగా, అదే రోజు సీఎం కేసీఆర్ పాలకుర్తి మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పాలకుర్తి, బమ్మెర, రాఘవపురం గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు. -
జనగామ జిల్లా ఏర్పడుతుందని నమ్ముతున్నా
జనగామ : ‘జనగామ జిల్లా చేయాలని సీ ఎం కేసీఆర్‌కూ ఉంది.. ఎన్నికల సమయం లో ఇచ్చిన మాట తప్పకూడదని భావిస్తున్నారు..’ అని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జిల్లా సాధన కోసం కొనసాగుతున్న రిలే దీక్షల శిబిరాన్ని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యా దగిరిరెడ్డితో కలిసి దయాకర్‌రావు సందర్శించి, సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనగామ జిల్లా చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరిన సమయంలో మొదట్లో ప్రజలు సుముఖంగా లేరనే అభిప్రాయం వ్యక్తం చేశారని, మహబూబాబాద్ లాంటి చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తున్నందున జనగామను కూడా ఆలోచించాలని కోరినట్లు చెప్పారు. జనగామ జిల్లా చేస్తే పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు మండలాలకు తోడు అదనంగా రాయపర్తి, తొర్రూరు మండలాల ప్రజలకు ఇష్టం లేకున్నా, ఎలాంటి అభ్యం తరం లేదని సీఎంతో అబద్ధం ఆడాల్సి వచ్చిందన్నారు. స్టేష¯ŒSఘ¯ŒSపూర్లోని మండలాలను సైతం జనగామలో కలిపేందుకు ఎమ్మెల్యే రాజయ్య సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ముగ్గురు ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ఎంపీ బూర నర్సయ్య, ఎమ్మెల్సీ పళ్లా రాజేశ్వరెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి జనగామ జిల్లా ఏర్పాటుకు ఏకాభిప్రాయంతో సీఎం వద్దకు వెళ్తామన్నారు. సీఎం ఆలోచనలో మార్పు కనిపిస్తోందని, జిల్లా ఏర్పడుతుందనే పూర్తి విశ్వాçÜం తనకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్స¯ŒS గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, డాక్టర్లు లక్షి్మనారాయణ, రాజమౌళి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, గౌరవాధ్యక్షులు పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, బొట్ల శ్రీనివాస్, సంపత్, సతీష్, కనకారెడ్డి పాల్గొన్నారు. -
యూనియన్లతోనే సమస్యలు
రాయపర్తి : ఉపాధ్యాయ యూనియన్లతోనే తలనొప్పి వస్తుందని, యూనియన్లపై పెట్టే శ్రద్ధ బడిపై పెట్టి విద్యార్థుల సంఖ్యను పెంచి బలోపేతానికి కృషి చేయండని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో హెచ్ఎంతో విద్యావనరుల సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఉపాధ్యాయ సంఘం మూసివేసిన బడులను తెరిపించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా మీరు యూనియన్లని తిరిగి తలనొప్పి తెస్తున్నారన్నారు. ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకునే బా ధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజాప్రతిని ధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తుల సమన్వయంతోనే బడులను బలోపేతం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం లేకపోవడం మూలంగానే ప్రైవేట్‌కు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వ బడులలో మౌళిక వసతుల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. గదుల కొరతతో పాటు, త్రాగునీటి సమస్య తది తర అంశాలపై ఆయా పాఠశాలల హెచ్ఎం లతో చర్చించారు. పెండింగ్‌లో ఉన్న మధ్యా హ్న భోజన బిల్లులు రావడంలేదని ఓ హెచ్ఎం తెలపగా నిధులను విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎండీ ఉస్మా న్, ఎంపీపి గుగులోతు విజయ, జెడ్పిటీసీ వం గాల యాకమ్మ, తహసీల్ధార్ వాసం రామ్మూర్తి, ఎంపిడీఓ శంకరి, సర్పంచ్, ఎంపిటీసీలు, హెచ్ఎంలు, సీఆర్పీలు బందు నారాయణ, గారె కృష్ణమూర్తి, లింగారెడ్డి,అనుమాస్ వేణు, నగేష్, ప్రసాద్, సత్యనారాయణ, శోభారాణి, రమాదేవి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
దత్తత గ్రామాన్ని పట్టించుకోరా?
ఎమ్మెల్యే ఎర్రబెల్లిని నిలదీసిన ప్రజలు తొర్రూరు: ‘గ్రామాన్ని దత్తత తీసుకుని రెండేళ్లు అవుతుంది. ఇంతవరకు ఏం అభివృద్ధి చేశావంటూ’ వరంగల్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయూకర్‌రావును నిలదీశారు. మంగళవారం గ్రామంలో జరిగిన హరితహారం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేను సీపీఎం, సీపీఐ నాయకులు, ప్రజలు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ‘మరో ఆరు నెలలు ఓపిక పట్టండి. వచ్చే రెండేళ్లల్లో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా’ అని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. -
ఎర్రబెల్లి పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: తెలుగు దేశం పార్టీ నుంచి పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయకర్‌రావు పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై అనర్హత వేటు వేయాలని ఎర్రబెల్లి పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై కోర్టు ఏవిధమైన ఆదేశాలు జారీ చేస్తుందో అని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి తలసాని, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, కృష్ణారావు, సాయన్న టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. -
ఎర్రబెల్లిపై కేసు
పాలకుర్తి: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గోదాముల శంకుస్దాపన కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘర్షణ సంఘటనకు ఎమ్మెల్యే ఎర్రబెల్లిపై పాలకుర్తి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఎస్ఐ ఉస్మాన్ షరీఫ్‌తో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాల సంఘటనకు ఎమ్మెల్యే ఎర్రబెల్లిపై కేసులు నమోదు చేశారు. పాలకుర్తి పోలీస్ స్టేషన్లో గాయాల బాదితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి డివిజన్లోని బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లుగా తెలిసింది. పాలకుర్తిలో ఉద్రిక్త పరిస్దితి తగ్గే వరకు అడిషనల్ ఎస్పీ జాన్ వెస్లీ పోలీస్ స్టేసన్‌లోనే ఉండి సమీక్షిస్తున్నారు. 28న ఉదయం జనగామ కోర్టులో ఎర్రబెల్లిని హాజరు పరచనున్నట్లుగా సమాచారం.