ఒరిజినల్‌ టీడీపీ ఈడా లేదు.. ఆడా లేదు | There is no original TDP in both states | Sakshi
Sakshi News home page

ఒరిజినల్‌ టీడీపీ ఈడా లేదు.. ఆడా లేదు

Published Sun, May 28 2017 1:29 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

ఒరిజినల్‌ టీడీపీ ఈడా లేదు.. ఆడా లేదు - Sakshi

ఒరిజినల్‌ టీడీపీ ఈడా లేదు.. ఆడా లేదు

ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీని చంద్రబాబు సర్వనాశనం చేసిండు: ఎర్రబెల్లి

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా ఊపిరి పోసుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లేదని.. ఏపీ, తెలంగాణలో ఉన్నది అసలైన టీడీపీ కాదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు విమరర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు సహా ఆ పార్టీలో ఇప్పుడున్నవాళ్లంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లేననని ధ్వజమెత్ తారు. శనివారం టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో ఎర్రబెల్లి విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుంటాయని కాంగ్రెస్‌ నేత జైపాల్‌రెడ్డి, టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి ఇస్తున్న సంకేతాలు టీడీపీ దుస్థితికి అద్దం పడుతున్నాయని ఎర్రబెల్లి అన్నారు.  పార్టీని కాపాడుకునేందుకు ఆనాడు చంద్రబాబు వైపు నిలబడ్డామని.. కానీ తెలంగాణ వ్యతిరేక కుట్రలు, నీచపు రాజకీయాలతో టీడీపీని బాబు సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. బాబు తప్పుడు చేష్టలు చూడలేకే టీడీపీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలం కలసి టీటీడీఎల్పీని టీఆర్‌ఎస్‌ ఎల్పీలో విలీనం చేశామని ఎర్రబెల్లి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement