Mac computers
-
యాపిల్ వార్నింగ్:సెక్యూరిటీ లోపం, తక్షణమే అప్డేట్ చేసుకోండి!
ముంబై: టెక్ దిగ్గజం యాపిల్ సెక్యూరిటీ లోపాలపై తన యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. తన ఉత్పత్తులు ఐఫోన్లు, ఐప్యాడ్, మ్యాక్లకు సంబంధించి హ్యాకర్లు దాడిచేసి అవకాశం ఉందని సూచించింది. వెంటనే అప్డేట్ చేసుకోవాలని వినియోగదారులను కోరింది. iPhone6S, తదుపరి మోడల్స్; ఐప్యాడ్ 5వ తరంతో పాటు, అన్ని ఐప్యాడ్ ప్రో మోడల్స్, ఐప్యాడ్ ఎయిర్ 2; మ్యాక్ కంప్యూటర్లు macOS Montereyలను ప్రభావితం చేస్తుందని సెక్యూరిటీ నిపుణులు కూడా హెచ్చరించారు. దీనిపై బుధవారం రెండు భద్రతా నివేదికలను యాపిల్ విడుదల చేసింది. ఐఫోన్లు, ఐప్యాడ్లు, మాక్‌ల భద్రతాలోపాన్ని వెల్లడించిన యాపిల్ ఆయా పరికరాలపై హ్యాకర్లు పూర్తి పట్టు సాధించే అవకాశం ఉందంటూ పేర్కొంది. వీలైనంత త్వరగా ఆయా డివైస్‌లలో ఈ కొత్త ప్యాచ్ అప్డేట్ చేసుకోవాలని,లేదంటేసైబర్ నేరగాళ్లు సిస్టమ్‌లోకి ప్రవేశించి విలువైన డేటాను యాక్సస్ చేయవచ్చు. అన్ని డివైస్‌లలో ప్యాచ్డ్ వెర్షన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే ఎక్కడ, ఎవరి ద్వారా లోపాన్ని గుర్తించిందీ యాపిల్ స్పష్టం చేయలేదు. అటు భద్రతా నిపుణులు ప్రభావితమైన పరికరాలను అప్డేట్ చేసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చొరబాటుదారులు అసలు ఓనర్‌గా నటించి, వారి పేరుతో ఏదైనా సాఫ్ట్‌వేర్‌ను యాక్సెస్ చేసే అవకాశం ఉందని సోషల్ ప్రూఫ్ సెక్యూరిటీ సీఈవో రేచెల్ టొబాక్ తెలిపారు. 1/ Apple has just released macOS Monterey 12.5.1 and iOS 15.6.1/iPadOS 15.6.1 to resolve two zero-day vulnerabilities which have been actively exploited, and targeting crypto wallets. We strongly recommend that you update your devices as soon as possible. — GameStopNFT (@GameStopNFT) August 18, 2022 -
బంపరాఫర్..! ఉచితంగా యాపిల్ ఎయిర్ పాడ్స్!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ బంపరాఫర్‌ను ప్రకటించింది. యూజర్లకు ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఎయిర్ పాడ్స్‌ను ఫ్రీగా పొందాలంటే యాపిల్ నిబంధనల్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యాపిల్ మార్చి 7,2022 వరకు 'బ్యాక్ టూ యూనివర్సిటీ' ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్ధులు, టీచర్లకు ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. ఇందుకోసం యూజర్లు మాక్, ఐపాడ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందనే షరతు విధించింది. ఈ ఆఫర్ యాపిల్ ప్రొడక్ట్ లైన మాక్‌బుక్ ఎయిర్, మాక్ బుక్ ప్రో, ఐమాక్, మాక్ మిని, ఐమాక్ ప్రో, ఐపాడ్ ప్రో, ఐ పాడ్ ఎయిర్‌ను కొనుగోలు చేస్తే యాపిల్‌కు చెందిన సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు. అదే ఎయిర్ పాడ్స్‌ను ఉచితంగా పొందిన యూజర్లు థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్, ఎయిర్ పాడ్స్ ప్రో కి అప్‌గ్రేడ్ అవ్వొచ్చని తెలిపింది. కాకపోతే న్యూజనరేషన్ ఆడియో ప్రొడక్ట్‌లకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆఫర్ ఏఏ దేశాల్లో ఉందంటే? ప్రస్తుతం మాక్, ఐపాడ్ కొన్న యూజర్లకు యాపిల్ అందిస్తున్న ఈ ఫ్రీ ఆఫర్ ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, బ్రెజిల్, సౌత్ కొరియాతో పాటు భారత్‌లో సైతం అందుబాటులో ఉంది. కానీ యాపిల్ అఫీషియల్ సైట్లో మాత్రం "సేవ్ ఆన్ ఏ న్యూ మాక్ ఆర్ ఐపాడ్ విత్ యాపిల్ ఎడ్యుకేషన్ ప్రైసింగ్" అని చూపిస్తుంది. కాబట్టి డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదనంగా యాపిల్ 'యాపిల్ కేర్ ప్లస్' ప్రొటెక్షన్ ప్లాన్లపై 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. యూజర్లు ముందుగా ఈ ఆఫర్ పొందేందుకు మాక్, ఐపాడ్ ఉత్పత్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఉచితంగా పొందే ఎయిర్ పాడ్స్ అప్డేట్ అవుతాయి. యాపిల్ అధికారిక సైట్ ప్రకారం..ఈ ఆఫర్ ప్రస్తుతం, లేదంటే కొత్తగా ఆమోదించిన యూనివర్సిటీ విద్యార్ధులకు,లెక్చరర్స్‌కు, విద్యార్ధుల తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటుంది. మీరు ముందుగా సైన్ అప్ చేసి unidasyలో నమోదు ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ జరుగుతుందని గుర్తించాలి. చదవండి: సంచలనం..! ఛార్జర్ అవసరంలేదు, ఫోన్‌డిస్‌ప్లేతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు! -
వీటిలో ఇంటర్నెట్ సేవలు బంద్..!
రేపటి నుంచి అనగా సెప్టెంబర్ 30 నుంచి పలు డివైజ్‌ల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. Let’s Encrypt’sకు చెందిన IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్ గడువు రేపటితో ముగియనుంది. దీంతో పలువురు ఈ సర్టిఫికేట్లను కల్గిన డివైజ్‌లో వరల్డ్ వైడ్ వెబ్సేవలను పొందలేరని టెక్నికల్ నిపుణులు పేర్కొన్నారు. లెట్స్ ఎన్‌క్రిప్ట్ (Let's Encrypt) అనేది నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మొబైల్, ల్యాప్‌టాప్, పర్సనల్కంప్యూటర్స్ వంటి పరికరాల మధ్య ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఈ ఆర్గనైజేషన్ ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. ఈ సర్టిఫికేషన్ సహాయంతో మనం వాడే డివైజ్‌లకు ఏలాంటి హాని లేకుండా, సురక్షితమైన ఇంటర్నెట్ సేవలు అందుతాయి. అంతేకాకుండా మీ పర్సనల్ డేటాను హ్యక్ కాకుండా చూస్తోంది. మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు యూఆర్ఎల్ అడ్రస్‌లో మొదట హెఛ్టీటీపీఎస్తో ఆయా వెబ్సైట్ వస్తోంది. ఈ విషయాన్ని మనలో కొంత మంది గమనించే ఉంటాం. హెఛ్టీటీపీఎస్ ప్రారంభమయ్యే వెబ్సైట్ అత్యంత సురక్షితమని అర్థం. ఈ ప్రాసెస్ పూర్తిగా IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్ సహాయంతోనే జరుగుతుంది. చదవండి: Jeans Could Get Pricey: జీన్స్, టీషర్ట్స్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్...! ప్రభావం ఎక్కువగా వీటిపైనే..! IdentTrust DST Root CA X3 సర్టిఫికెట్ ఆప్డేట్ అయిన డివైజ్‌లకు ఏలాంటి ప్రాబ్లమ్ లేదు. ఏళ్ల తరబడి ఎలాంటి ఆప్డేట్కు నోచుకొని డివైజ్‌ల్లో ఇంటర్నెట్ సేవలు ముగియనున్నాయి. టెక్ క్రచ్ నివేదిక ప్రకారం...మాక్ఓఎస్ 2016 వర్షన్, పలు ఓల్డ్ ఐఫోన్స్, విండోస్ ఎక్స్పీ(విత్ సర్వీస్ పాక్ 3), ప్లే స్టేషన్ కన్సోల్ 3. ప్లేస్టేషన్ 4 వంటి అప్‌గ్రేడ్ కాని వాటిలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయి. ఇలా చేస్తే బెటర్ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత 7.1.1 కంటే పాత వెర్షన్లను కలిగి ఉన్న అన్ని ఆండ్రాయిడ్ డివైజ్ లలో ఇంటర్నెట్ పని చేయదు. ఐవోఎస్ 10 కంటే పాత వెర్షన్లను కలిగి ఉన్న ఐఫోన్లలో కూడా ఇంటర్నెట్ సేవలు పని చేయవు. మీ డివైజ్ లలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, వెంటనే మీ ఫోన్ లో చెక్ చేసి, పాత వర్షన్ ఉంటే వెంటనే అప్డేట్ చేయండి. ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ వర్షన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు మోజిలా ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తే ఇంటర్నెట్ సేవలను పొందవచ్చునని తెలుస్తోంది. చదవండి: భారీ డిస్కౌంట్లతో ముందుకువస్తోన్న షావోమీ..! సుమారు రూ. 75 వేల వరకు తగ్గింపు..! -
గూగుల్ సంచలన నిర్ణయం...!
ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్ కంపెనీ ఆండ్రాయిడ్ యాప్‌లను విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్చేయనున్నట్లు పేర్కొంది. ఆండ్రాయిడ్ యాప్‌లకు మద్దతు ఇచ్చే మొదటి ఆపరేటింగ్ సిస్టమ్‌గా విండోస్ 11 నిలిచింది. విండోస్ 11 లో ఆండ్రాయిడ్ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కాకుండా అమెజాన్ యాప్ స్టోర్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీలో భారత్ స్థానం ఎంతో తెలుసా...! తాజాగా గూగుల్ ఆండ్రాయిడ్ యాప్‌లను, గేమ్‌లను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పాటుగా ఆపిల్ మాక్ బుక్స్‌లో సపోర్ట్చేయడానికి గూగుల్ ప్రణాళికలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి యూఎస్ కోర్టులో ఆపిల్ కంపెనీకి, ఏపిక్ గేమ్స్ మధ్య విచారణ కొనసాగుతుంది. దీంతో గూగుల్ ‘గేమ్స్ ఫ్యూచర్’ అనే అంతర్గత గూగుల్ కాన్ఫిడెన్షియల్ ప్రెజెంటేషన్‌లో ఈ నిర్ణయాన్ని పొందుపర్చినట్లూ ప్రముఖ టెక్ వెబ్‌సైబ్ ది వెర్జ్ గుర్తించంది. ఈ నిర్ణయాన్ని గూగుల్ ప్లే డివిజన్ 2020 అక్టోబర్ నెలలో తీసుకుంది. ఈ ప్రెజెంటేషన్‌లో భాగంగా గూగుల్ 2025 నాటికి గేమింగ్ రంగంలో తన రోడ్‌మ్యాప్‌ను సిద్దంచేసుకుంది. (చదవండి: ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే వడ్డీ కట్టక్కర్లేదు) -
ఆ హెడ్‌ఫోన్స్ ధర రూ.59,900
ముంబై, సాక్షి: మొబైల్ ఫోన్ల రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ ‘ఆపిల్’ కంపెనీ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వైర్లెస్ హెడ్ ఫోన్లు డిసెంబర్ 15వ తేదీ నుంచి మార్కెట్లోకి రానున్నాయి. 2016లో తీసుకొచ్చిన ఏర్‌పాడ్స్ మ్యాక్స్ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ హెడ్ఫోన్ల కోసం ఈ క్షణం నుంచే బుకింగ్ చేసుకోవచ్చు. అయితే డిసెంబర్ 15 తర్వాతే దిగుమతి, ఎగుమతులను అనుమతిస్తారు. వీటి ధరను 549 పొండ్లు (53 వేల రూపాయలు)గా నిర్ణయించారు. ఏర్‌పాడ్స్ 159 పౌండ్లు, ఏర్‌పాడ్స్ ప్రోను 249 పొండ్లకు విక్రయించగా హెడ్ ఫోన్లకు వాటికన్నా ఎక్కువ ధరను ఖరారు చేశారు. ఇందులో బయటి నుంచి వచ్చే ధ్వనులను గణనీయంగా తగ్గించడంతోపాటు వినేవారి చెవుల నిర్మాణం తీరునుబట్టి లో ఫ్రీక్వెన్సీ లేదా మధ్యస్థ ఫ్రీక్వెన్సీలోకి దానంతట అదే మారేందుకు హెడ్ఫోన్ల అవుట్ పుట్‌ను మార్చేందుకు అందులో ‘అడాప్టివ్ ఈక్యూ’ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆపిల్ కంపెనీ వర్గాలు వివరించాయి. ఆకుపచ్చ, నీలి, గులాబీ, గోధుమ, రజితం రంగుల్లో హెడ్ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. అంతకు ఒక్క రోజు ముందు నుంచి, అంటే డిసెంబర్ 14వ తేదీ నుంచి కొత్త ఫిట్నెస్ యాప్‌ను ఆపిల్ కంపెనీ అందుబాటులోకి తెస్తోంది. నెలకు దీని సబ్ స్క్రిప్షన్ 9.99 పౌండ్లకు (989 రూపాయలు), అలాగే 9.99 డాలర్లకు సబ్స్క్రిప్షన్లు అందుబాటులో ఉంటాయని, ఈ యాప్ ద్వారా వివిధ రకాల ఫిట్నెస్ వీడియోలను, యోగా , డ్యాన్సింగ్ వీడియోలను వీక్షించవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. తాజా అమ్మకాలలో భాగంగా 25 దేశాలు, ప్రాంతాలకు వీటిని అందించనున్నట్లు వెల్లడించింది. ఐప్యాడ్లు తదితర యాపిల్ డివైస్‌లు ఐవోఎస్ 14.3 లేదా తదుపరి అప్‌గ్రేడ్‌తో పనిచేస్తాయని ఐఫోన్ల దిగ్గజం యాపిల్ పేర్కొంది. మ్యాక్ ఓఎస్ బిగ్ 11.1 లేదా తదుపరి అప్‌గ్రేడ్స్ ద్వారా వీటిని వినియోగించుకోవచ్చని వివరించింది. యాపిల్ వాచీలయితే ఓఎస్ 7.2, టీవీలకు ఓఎస్14.3 కంపాటిబుల్‌గా పేర్కొంది. చదవండి: (రూ. 13,000లలో నోకియా లేటెస్ట్ ఫోన్) హెచ్1 చిప్ ప్రపంచవ్యాప్తంగా హెడ్‌ఫోన్స్‌లో ఎయిర్‌పోడ్స్ జనాదరణ పొందినట్లు యాపిల్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ గ్రెగ్ జాస్వియక్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎయిర్‌పోడ్స్ మ్యాక్స్ ద్వారా అత్యంత నాణ్యతమైన ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చని తెలియజేశారు. ఆధునిక డిజైన్, ప్రతిభావంతమైన హెచ్1 చిప్, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ తదితరాల కారణంగా వినియోగదారులు అత్యుత్తమ వైర్లెస్ ఆడియోను ఆనందించవచ్చని వివరించారు. ఎడాప్టివ్ ఈక్విలైజర్ కలిగి ఉన్నట్లు తెలియజేశారు. మూడు మైక్రోఫోన్ల ద్వారా అనవసర శబ్దాలను తగ్గిస్తుందని(నాయిస్ రిడక్షన్) పేర్కొన్నారు. కానీ దీని ధరపై కొంత మంది నిపుణులతో పాటు, ఆపిల్ లవర్స్ కూడా పెదవి విరుస్తున్నారు. -
సరికొత్త ఫీచర్లతో యాపిల్ ప్రొడక్టులు
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఇంక్ సొంత చిప్‌ను ఆవిష్కరించనున్నట్లు పేర్కొంది. దీంతో ఇకపై యాపిల్ తయారీ మాక్ కంప్యూటర్లు సొంత చిప్‌తో వెలువడనున్నట్లు తెలియజేసింది. తద్వారా 15 ఏళ్లుగా ఆధారపడుతున్న ఇంటెల్ కార్ప్‌నకు యాపిల్ టాటా చెప్పనుంది. యాపిల్ తయారీ ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ కంప్యూటర్లు ఇకపై సొంత చిప్‌తో రూపొందనున్నట్లు కంపెనీ సీఈవో టిమ్ కుక్ తాజాగా పేర్కొన్నారు. వెరసి కొత్త శకానికి నాంది పలుకుతున్నట్లు వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాలోని క్యుపర్టినోగల కంపెనీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచవ్యాప్త డెవలపర్ వార్షిక సమావేశం తొలి రోజు కుక్ మరిన్ని వివరాలు వెల్లడించారు. ఐఓఎస్ 14 తమ హార్డ్‌వేర్ ప్రొడక్టులకు సిలికాన్ హృదయంవంటిదని, ప్రపంచస్థాయి డిజైన్ టీమ్ ద్వారా సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు కుక్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ తయారీ ఐఫోన్లు, ఐప్యాడ్లలో యాపిల్ అభివృద్ధి చేసిన చిప్‌లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. యాప్ స్టోర్ ద్వారా అందిస్తున్న సేవలు ఇటీవల కంపెనీ ఆదాయంలో ప్రధాన వాటా సాధిస్తున్న నేపథ్యంలో ఈ కాన్ఫరెన్స్‌కు ప్రాధాన్యత పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. కారు తాళాలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు డిజిటల్ షేరింగ్ చేసేందుకు వీలుగా యాపిల్ కొత్త వ్యవస్థను రూపొందించింది. ఐమెసేజ్ వ్యవస్థ ద్వారా బీఎండబ్ల్యూ 5 సిరీస్ వాహనాలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు యాపిల్ పేర్కొంది. ప్రస్తుతం అందిస్తున్న ఐఓఎస్ 13 ద్వారా ఇందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలియజేసింది. వచ్చే ఏడాదిలో మరిన్ని కార్లకు ఈ సదుపాయాన్ని విస్తరించే వీలున్నట్లు వివరించింది. నచ్చిన సైజులో విడ్జెట్స్ యాపిల్ కొత్త ఐవోఎస్ 14ను ప్రవేశపెట్టనుంది. దీనిలో భాగంగా విడ్జెట్స్‌ను విభిన్న పరిమాణంలో నచ్చిన విధంగా అమర్చుకోవచ్చు. అంతేకాకుండా పిక్చర్ ఇన్ పిక్చర్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. తద్వారా వీడియోను మినిమైజ్ చేసుకుని స్క్రీన్‌లో ఏదో ఒక కార్నర్లో సెట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఐఫోన్లలో ఇన్కమింగ్ కాల్స్ తెరనంతటినీ ఆవరించకుండా పైభాగానికి కుదించుకోవచ్చు. ఇక ఐప్యాడ్స్, ఐఫోన్ల వినియోగంలో డివైస్ల మధ్య ఐపోడ్స్ ఆటోమేటిగ్గా కనెక్ట్(స్విచ్ బ్యాక్) అవుతాయి. ఇక యాపిల్ వాచీలకు ఓఎస్-7ను అభివృద్ధి చేసింది. స్లీప్ ట్రాకింగ్‌ను ప్రధానంగా కంపెనీ ప్రస్తావిస్తోంది. వినియోగదారుడు నిద్రకు ఉపక్రమించగానే ఆటోమ్యాటిగ్గా స్లీప్ మోడ్‌లోకి మారుతుందని యాపిల్ తెలియజేసింది. ఇంకా యాపిల్ టీవీలకు వీడియో కెమెరాల ద్వారా డోర్‌బెల్ నోటిఫికేషన్స్ తదితర సౌకర్యాలను మెరుగుపరచినట్లు వివరించింది. -
మ్యాక్ కంప్యూటర్లతో మార్కెట్ ను దోచేస్తాం
కోల్ కత్తా : భారత్ లో కేవలం ఐఫోన్ అమ్మకాలను మాత్రమే కాదు.. మ్యాక్ కంప్యూటర్లపై కూడా టెక్ దిగ్గజం యాపిల్ దృష్టి సారిస్తోంది. చిన్న చిన్న పట్టణాలకు మ్యాక్ కంప్యూటర్లను తీసుకెళ్తూ.. మ్యాక్ కంప్యూటర్ అమ్మకాల పంపిణీని పెంచుకుని భారత మార్కెట్ ను దోచేయాలని చూస్తోంది. ఇతర కంపెనీల ఎలక్ట్రానిక్ స్టోర్ల ద్వారా మ్యాక్ కంప్యూటర్లను వినియోగదారులకు చేరువలో ఉంచాలని భావిస్తోంది. మ్యాక్ కంప్యూటర్లకు టాప్-10 మార్కెట్ గా ఉన్న భారత్ లో, పర్సనల్ కంప్యూటర్ల పెట్టుబడులు పెంచాలని ప్రస్తుతం ఈ టెక్ దిగ్గజం ప్లాన్ చేస్తుందని యాపిల్ కు సంబంధించిన ఇద్దరు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 75 సిటీలుగా ఉన్న మ్యాక్ కంప్యూటర్ల పంపిణీ అందుబాటును, వచ్చే రెండు, మూడేళ్లలో రెండింతలు చేయాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. చిన్న కంప్యూటర్ స్టోర్లు, ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్ స్టోర్ల ద్వారా యాపిల్ మ్యాక్ కంప్యూటర్ల పంపిణీని పెంచుకోనుందని చెప్పారు. ఇప్పడివరకూ మ్యాక్ కంప్యూటర్లు కేవలం యాపిల్ స్టోర్లలోనూ, ఆన్ లైన్ లోనూ, అతిపెద్ద రిటైల్ చైన్స్ క్రోమా, రిలయెన్స్ డిజిటల్ లో మాత్రమే అందుబాటులో ఉండేవి. యాపిల్ కలిగి ఉన్న కన్సూమర్ పీసీ విభాగ 8-9శాతం మార్కెట్ల షేరులో భారత్ కూడా ఒకటి. మ్యాక్ వ్యాపారాల రెవెన్యూలు గత కొన్నేళ్లలో 100శాతానికి పైగా పెరిగాయి. యాపిల్ కు మ్యాక్ పీసీ సరుకు రవాణా ఏడాదియేడాదికి 50 శాతం పైగా పెరుగుతున్నాయి. ఐఫోన్ బిజినెస్ లు పడిపోయి యాపిల్ నిరాశలో ఉన్నప్పటికీ మ్యాక్ కంప్యూటర్లకు వస్తున్న ఆదరణ ప్రస్తుతం యాపిల్ కు ఊరటగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ ట్రాకర్ ఐడీసీ నివేదిక ప్రకారం, భారత్ లో కంప్యూటర్ విభాగంలో 32.7శాతం షేరుతో జనవరి-మార్చి త్రైమాసికంలో యాపిల్ అగ్రస్థానంలో ఉంది. హెచ్ పీ 29.1శాతం షేరు, డెల్ 17.1శాతం మార్కెట్ షేరును కలిగి ఉన్నాయి.