యాపిల్ కంపెనీ మనదేనా? | chandra babu naidu promisses to give ipads to all teachers | Sakshi
Sakshi News home page

యాపిల్ కంపెనీ మనదేనా?

Published Fri, Sep 5 2014 2:27 PM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

యాపిల్ కంపెనీ మనదేనా? - Sakshi

యాపిల్ కంపెనీ మనదేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి.. యాపిల్ కంపెనీకి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. ఊ అన్నా.. ఆ అన్నా కూడా ఆయనకు యాపిల్ ఐప్యాడ్లే గుర్తుకొస్తున్నాయి. అవి దేనికి ఉపయోగపడతాయో, ఎందుకు ఉపయోగపడతాయో కూడా ఆలోచించకుండా ఎడాపెడా ఐప్యాడ్లు ఇచ్చేస్తానంటూ చెబుతున్నారు. నిన్న కాక మొన్న రైతులకు ఐప్యాడ్లు ఇస్తానన్న సీఎం.. తాజాగా ఉపాధ్యాయులకు కూడా అదే వరం ప్రకటించేశారు.

ఉపాధ్యాయ దినోత్సవం చేయడంలో తనకు తానే సాటి అని.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా.. వాటిని కాదనుకుని మరీ గుంటూరులో జరుగుతున్న గురుపూజోత్సవానికి హాజరయ్యానని చెప్పారు. మండలానికో ఉత్తమ ఉపాధ్యాయుడిని, ఉత్తమ విద్యార్థిని ఎంపిక చేస్తామని, విద్యార్థులకు సీఎం ఫెలోషిప్ కింద ప్రతినెలా స్టైపండ్ ఇస్తామని తెలిపారు. అవన్నీ బాగానే ఉన్నా.. ఉపాధ్యాయులకు, రైతులకు ఐప్యాడ్లు ఎలా ఉపయోగపడతాయన్నది మాత్రం ఇంకా బ్రహ్మపదార్థంగానే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement